అడవిలో కోతులతో ఉంటూ..పూర్తిగా కోతిలా మారిన 8ఏళ్ల అమ్మాయి..!!

Posted By:
Subscribe to Boldsky

మీకు 'టార్జన్‌' సినిమా గుర్తుందా?. చిన్నప్పుడే తల్లితండ్రులకు దూరమైన ఓ బాలుడు, అడవిపాలై జంతువుల మధ్యే పెరిగి పెద్దవాడు కావడం.. వాటిలాగే వ్యవహరించడం.. చివరకు ఓ అమ్మాయి ప్రేమతో.. అతి ప్రయాసతో మనుషుల్లో కలిసిపోవడం..'' ఇదంతా సినిమా కధ. కాగా, అచ్చం అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది.

8 ఏళ్ల బాలిక కోతులతో కలిసి జీవిస్తుండగా, రాష్ట్రంలోని కతార్నియాఘాట్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఈ ఏడాది జనవరిలో ఆ బాలికను అడవి నుంచి పోలీసులు బయటకు తీసుకువచ్చారు. అప్పుడు వారు కోతుల నుంచి గట్టి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ బాలిక ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, రెండు, మూడు రోజులుగా ఆమె చిత్రాలు సామాజిక మాధ్యమంలో జోరుగా ప్రసారమై సంచలనం రేపాయి. ఆమె గురించి మరిన్ని వాస్తవాలను తెలుసుకుందాం...

మాటలు, చేతలు మర్చిపోయిన చిన్నారి:

మాటలు, చేతలు మర్చిపోయిన చిన్నారి:

మాట మర్చిపోయిన ఆ చిన్నారి.. తన దగ్గరకు ఎవరైనా వస్తుంటే భయపడుతూ కోతిలా అరుస్తోంది. అంతే కాదు అచ్చం కోతుల్లానా చేతులు కాళ్ల మీద నడుస్తోంది.

అడవి జీవితానికి అలవాటు పడిపోయింది :

అడవి జీవితానికి అలవాటు పడిపోయింది :

నెపాల్ కు దగ్గరో ఉన్న కతిర్నాయా ఘాట్ అడివి ప్రాంతంలో కోతులతో కలిసి జీవిస్తోంది. బాలికను ఆస్పత్రికి తీసుకువచ్చే నాటికి గోళ్లు, జుట్టు బాగా పెరిగి ఉన్నాయని, ఒంటి నిండా గాయాలు కూడా ఉన్నాయని.. చిన్నారి స్థితిని చూసి చాలా రోజుల నుంచి కోతులతో కలిసి జీవిస్తున్నట్లు గుర్తించామని చీఫ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ తెలిపారు.

ట్రీట్మెంట్ :

ట్రీట్మెంట్ :

బాలిక పరిస్థితికి అనుగుణంగా వైద్యం చేస్తున్నామని, అలాగే తల్లితండ్రులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. ఏ భాషనూ అర్థం చేసుకోవడం లేదని.మనుషులు దగ్గరికొస్తే భయపడుతోందని. అప్పడప్పుడు వింతగా ప్రవర్తిస్తూ.. దగ్గరికి వెళితే దాడి చేస్తోందని ఆమెకు చికిత్స చేస్తున్న డాక్టర్లు అంటున్నారు .

rn

మార్పు:

కాగా, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆ బాలిక ఇంకా చేతులతో ఆహారం తీసుకోవడం లేదు. నేరుగా నోటితోనే తింటోంది. అలాగే కాళ్లతో నడిపించేందుకు ప్రయత్నిస్తుంటే రెండు చేతులు కూడా నేలపై ఆన్చి.. కోతుల మాదిరిగా నడుస్తోంది. అయితే బాలిక చికిత్సకు స్పందిస్తోందని, ఆమెలో కాస్త మార్పు వస్తోందని వైద్యులు వెల్లడించారు. మరి అలా కోతులతో జీవిస్తూ, కోతిలా మారిపోయిన జంగిల్ గర్ల్ ను మీరూ చూడాలని అనుకుంటున్నారా..ఆలస్యం చేయకుండా వీగియో చూసేయండి...

English summary

The Story Of The Girl Who Lived With Monkeys!

She is an 8-year-old girl who was found in a jungle. Her rescuers claim that she has been living with monkeys and apes. Nobody is sure as to how long it has been since she is living there.
Story first published: Monday, April 10, 2017, 17:05 [IST]
Subscribe Newsletter