చ‌నిపోయిన త‌న ప్రియుడి ద్వారా త‌ల్లి కావాల‌నుకుంది? ఎందుకు?

By: sujeeth kumar
Subscribe to Boldsky

కొన్ని ప్రేమ క‌థ‌లు శాశ్వ‌తంగా నిలిచిపోతాయి. అవి చ‌దివాక క‌న్నీటితో చెమ్మ‌గిల్లిపోతాం. చ‌రిత్ర‌లో కొన్ని వేల‌, ల‌క్ష‌ల ప్రేమ క‌థ‌లున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు నిజ‌మైన ప్రేమ ఓడిపోలేద‌ని చెప్పొచ్చు.

ప్రేమ‌కున్న శ‌క్తి అనేక అద్భుతాలు చేస్తుంది. ప్రేమికులు చ‌రిత్ర‌లో ఎన్నో ఘ‌ట్టాల‌ను లిఖించారు. అలాంటి ఓ ప్రేమ క‌థే ఇంట‌ర్నెట్‌ను ఊపేసింది. అదే జోషువా డేవిస్‌, ఐలా క్రెస్‌వెల్‌ల‌దీ.

వైబ్రేట్ బ్రాతో పాటు ఎన్నెన్నో వెరైటీలు: వీటిని చూస్తే మీరు సర్ ప్రైజ్ అవుతారు!

ఐలా క్రెస్‌వెల్ త‌ను ఎంత‌గానో ప్రేమించిన బాయ్‌ఫ్రెండ్ హ‌ఠాత్తుగా చ‌నిపోయాడు. మృతిచెందిన త‌న బాయ్‌ఫ్రెండ్ మూలాన త‌ల్లి కావాల‌ని ఆమె ఏకంగా సుప్రీం కోర్టు మెట్లు ఎక్కింది. 24ఏళ్ల ఈ వ‌నిత చ‌నిపోయిన త‌న బాయ్‌ఫ్రెండ్ వీర్యంతో గ‌ర్భం దాల్చాల‌నుకుంది. ఆశ్ఛ‌ర్యంగా ఉంది క‌దూ! వీళ్ల ప్రేమ క‌థ గురించి పూర్తి వివ‌రాలు తెలుసుకుందాం...

నివేదిక ప్ర‌కారం...

నివేదిక ప్ర‌కారం...

ఓ ప్రముఖ దిన‌ప‌త్రిక ప్రచురించిన క‌థ‌నం ప్ర‌కారం జోషువా డేవిస్ అనే వ్య‌క్తి ఐలా క్రెస్‌వెల్‌కు బాయ్‌ఫ్రెండ్‌. 2016 ఆగ‌స్టులో హ‌ఠాత్తుగా చ‌నిపోయాడు. అత‌డు చ‌నిపోయిన గంట‌కు అత‌డి గ‌ర్ల్‌ఫ్రెండ్ పరుగున కోర్టుకు వెళ్లి త‌న బాయ్‌ఫ్రెండ్ వీర్యాన్ని వాడుకొని గ‌ర్భం దాల్చేందుకు అనుమ‌తి కోరింది.

సుదీర్ఘ‌ విచార‌ణ అనంత‌రం ఆమెకు కోర్టు అనుమ‌తిని మంజూరు చేసింది. ఐలా కృత్రిమ విధానంలో గ‌ర్భం దాల్చే ప్ర‌క్రియ అంతా ఒక ఇన్‌విట్రో ఫెర్టిలిటీ క్లిన్‌క్‌లో జ‌ర‌పాల‌ని కోర్టు సూచించింది. అటు ఆమె త‌ల్లిదండ్రులు, ఇటు జోషువా కుటుంబం ఆమెకు పూర్తి మ‌ద్ద‌తు ప‌లికారు.

ఇరు కుటుంబాలు ఇదే కోరుకున్నారు

ఇరు కుటుంబాలు ఇదే కోరుకున్నారు

మృతుడు జోషువా వీర్యం ఉప‌యోగించి ఐలా త‌ల్లి కావాల‌ని ఇరు కుటుంబాలు కోరుకున్నాయి. కోర్టు ఇందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని ఆశించారు కూడా. వీళ్ల‌కు మ‌ద్ద‌తుగా స్నేహితులు, బంధువులు నిలిచారు. జోషువా చ‌నిపోయే ముందు తామిద్ద‌రికీ ఒక పాప నో బాబు కావాల‌నే గ‌ట్టి కోరిక‌ను ఆధారాల‌తో స‌హా కోర్టుకు విన్న‌వించుకున్నారు. ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు ఐలాను పెళ్లి చేసుకొని క‌ల‌కాలం జీవించాల‌ని జోషువాకు ఉండేద‌ని కోర్టుకు తెలిపారు.

త‌న ప్రియుడి కోరిక మేర‌కే...

త‌న ప్రియుడి కోరిక మేర‌కే...

కోర్టులో ఐలా ఏం చెప్పిందంటే... నా ప్రియుడు జోషువా తండ్రి కావాల‌ని ఎంతో ఉద్వేగంతో ఉండేవాడు. మేమిద్ద‌రం పిల్ల‌ల గురించి ఎప్ప‌డూ మాట్లాడుకునేవాళ్లం. వారిని త‌మ‌ జీవితాల్లో భాగం చేసుకోవాల‌ని అనుకునేవాళ్ల‌మ‌ని చెప్పింది. త‌న ప్రియుడి కోరిక తీర్చ‌డ‌మే త‌న ధ్యేయ‌మ‌ని ఆమె కోర్టుకు తెలిపింది.

మిశ్ర‌మ స్పంద‌న‌

మిశ్ర‌మ స్పంద‌న‌

ఈ ప్రేమ‌క‌థ‌ను తెలుకున్న ప్ర‌జ‌లు ఇంట‌ర్నెట్‌లో రెండుగా చీలిపోయారు. ఒక వ‌ర్గంవారు ప్రేమికుల‌ను స‌మ‌ర్థించి కోర్టు ఆమెకు అనుమ‌తి ఇవ్వాల‌ని కోర‌గా, మ‌రో వ‌ర్గం వారు ఇందుకు ఒప్పుకోలేదు. అయితే ఐలా కోర్టుతోపాటు స‌మాజాన్ని ఒప్పించే ప్ర‌యత్నం చేసింది. జ‌స్టిస్ స్యుయ్ బ్రౌన్ వీళ్లిద్ద‌రి క‌థ‌ను స‌మ‌గ్రంగా ప‌రిశీలించి తుది నిర్ణ‌యం తీసుకున్నారు. ఐలా కోరుకున్న‌ట్టుగానే ఆమెకు అనుకూల‌మైన తీర్పునిచ్చాడు.

తీర్పు ఇది

తీర్పు ఇది

పుట్ట‌బోయే బిడ్డకు తండ్రి లేడ‌నే లోటు ఉన్నా... ఆ లోటును ఇరు కుటుంబాలవారు భ‌ర్తీ చేయ‌గ‌ల‌ర‌నే న‌మ్మ‌కాన్ని కోర్టు వ్య‌క్త‌ప‌రిచింది. ఇరు కుటుంబాల వారు ఐలా ప‌ట్ల చూపించిన అమిత‌మైన ప్రేమ‌కు, మ‌ద్ద‌తుకు కోర్టు ఆశ్చ‌ర్యం వ్య‌క్తంచేసింది. చనిపోయిన ఆమె ప్రియుడి వీర్యం ఉప‌యోగించుకునేందుకు కోర్టు అనుమ‌తించినా ఇంకా ఒక్క నిర్ణ‌యం కోర్టులో పెండింగ్‌లో ఉంది.

పెండింగ్లో ఉన్న నిర్ణ‌యం

పెండింగ్లో ఉన్న నిర్ణ‌యం

మృతిచెందిన జోషువా శ‌రీరంలోని అవ‌య‌వాల‌ను ఉప‌యోగించేందుకు అమెరికా సుప్రీం కోర్టు ఇంకా అనుమ‌తినివ్వ‌లేదు. కోర్టు త‌న‌కు అనుకూలంగా తీర్పు ఇవ్వ‌క‌పోతే పిటిష‌న్ దాఖ‌లు చేసేందుకు సిద్ధ‌ప‌డ‌తానంది. అయితే కేసు పూర్వాప‌రాల‌ను ప‌రిశీలించిన సుప్రీం కోర్టు తుది తీర్పును ఐలాకు అనుకూలంగా ఇచ్చింది. దీంతో ఇరు కుటుంబాల‌వారు ఎంతో సంతోషించారు. ఐలాకు ప్రేమ పంచ‌డం ద్వారా వాళ్లు త‌మ ఆనందాన్ని వ్య‌క్తంచేశారు.

జోషువా ఈ లోకంలో లేక‌పోయినా స‌రే పుట్ట‌బోయే బిడ్డ బాగోగులు ఐలా ఒక్క‌తే స‌మ‌ర్థంగా చూసుకోగ‌ల‌దు అని ఇరు కుటుంబాల‌వారు విశ్వ‌సించారు. ఈ ప్రేమికుల జంట 2ఏళ్లు గాఢ‌మైన ప్రేమ‌లో మునిగిపోయారు. విధివ‌శాత్తు జోషువా ఒక రోడ్ యాక్సిడెంట్‌లో చ‌నిపోయాడు.

English summary

Woman Who Wishes To Be A Mother Of Her Dead Boyfriend's

All that she wishes is to be close to her dead boyfriend…
Story first published: Thursday, November 9, 2017, 12:00 [IST]
Subscribe Newsletter