Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
ఎన్నో చాలెంజులు వినే ఉంటారు , కానీ ఈ వికారమైన ఛాలెంజ్ మీ ఊహకు కూడా అందదు.
ఇలాంటి చెత్త చాలెంజులు కూడా ఉంటాయని మీ ఊహకు కూడా అందదు . ఈమద్య ice bucket ఛాలెంజ్ , సానిటరీ నాప్ కిన్ తో PADMAN ఛాలెంజ్ వంటివి కొన్ని మంచి ఉద్దేశాలకోసం వచ్చాయి, మరియు జనాలలో కొన్ని ఆలోచనలను కూడా రేకెత్తించగలిగారు. కానీ కొన్ని చాలెంజులు ఎందుకు పుడుతాయో, వాటి చివరి లక్ష్యం ఏమిటో ఎవరికీ అర్ధం కాదు. కానీ వీటిని ఆసక్తిగా భావించేవారు ప్రయత్నిస్తూ సామాజిక మాధ్యమాలలో లో ఛాలెంజ్ పేరుతో కొనసాగిస్తున్నారు. అలాంటిదే ఈ కండోమ్ ఛాలెంజ్ . దీనిపేరు కండోమ్ స్నోర్టింగ్.
ఈ వికారమైన ఛాలెంజ్ గురించిన పూర్తి వివరాలను మేము ఇక్కడ చెప్పబోతున్నాము.

కానీ ఈ ఛాలెంజ్ ను చదవడం వరకు పర్లేదు కానీ ప్రయత్నించడం మాత్రం చేయకండి, ఈ పని వలన శ్వాస సంబంధ సమస్యలు తలెత్తి, ఒక్కోసారి ప్రాణహాని కూడా జరుగవచ్చు.
వెర్రి వెయ్యి విధాలు, ఇదొక రకమైన వెర్రిగా మాత్రమే భావించండి. దయచేసి ప్రయత్నించకండి అని మా మనవి.

1993 లో ప్రారంభం :
నిజం ఈ ఛాలెంజ్ ఇప్పటిది కాదు,కొన్ని నివేదికల ప్రకారం ఇది 1993అక్టోబర్ న వెలుగులోనికి వచ్చింది. కెంట్ యూనివర్సిటీ కాంపస్ న్యూస్ పేపర్ లో వచ్చిన కథనం ప్రకారం “జిమ్ రోస్ సర్కస్ సైడ్ షో” సంస్థ వ్యవస్థాపకుడు జిమ్ “ కండోమ్ ని ముక్కు ద్వారా లోనికి తీసుకుని నోటి ద్వారా బయటకు తీసే పనికి ఉపక్రమించాడు”

ఈ ఛాలెంజ్ గురించి .... !
ఈ స్నార్టింగ్ కండోమ్ ఛాలెంజ్ పట్ల యువత ఎక్కువగా ఆకర్షితులై, తమకు తాము ఈ ప్రయత్నాలకు పూనుకుని సామాజిక మాద్యమాలలో వీడియోలు పెట్టడం అలవాటు చేసుకున్నారు. ఈ ఛాలెంజ్ ద్వారా చుట్టబడని కండోమ్ ను ముక్కు ఒకపక్క నుండి పీల్చుకుని గొంతు నుండి నోటి ద్వారా దీనిని బయటకు తీయవలసి ఉంటుంది.

ఆరోగ్య సమస్యలు:
ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది నిపుణులు డాక్టర్లు ఈ ఛాలెంజ్ మంచిది కాదని , కండోమ్ లో ఉపయోగించే రబ్బర్ మెటీరీయల్ వలన శ్వాసకోశ నాళాలు మూసుకుపోయి శ్వాస ఆడని పరిస్థితులకు ఒక్కోసారి దారి తీయవచ్చని, తద్వారా ప్రాణహాని కలిగే అవకాశం కూడా ఉన్నదని హెచ్చరిస్తున్నారు. మరియు ఒక్కోసారి కొన్ని క్లిష్ట పరిస్థితులకు దారి తీసి అంతర్గత భాగాల రక్త స్రావానికి కూడా కారణమవుతుంది. కావున ఇది మంచిది కాదు అని చెప్పబడినది.

డాక్టర్లు చెప్పిన సత్యాలు:
ఈ ఛాలెంజ్ వినడానికే వికారంగా ఉన్నా, అనేకమంది ఇంకా ప్రపంచంలో అక్కడక్కడా ప్రయత్నిస్తూనే ఉన్నారు. సరైన అవగాహన, తెలివి లేకపోవడమే ఇలాంటి విపరీత ధోరణులకు కారణం. డాక్టర్లు చెప్పిన ప్రకారం అనేక కండోమ్స్ లో ఉండే స్పెర్మిసిడల్ లూబ్రికెంట్ ముక్కు యొక్క శ్వాస కోశ నాళాలకు ఇన్ఫెక్షన్, అలర్జీలు వచ్చేలా చేయడం లో ప్రభావితం చూపుతాయి.
ఈ ప్రపంచంలో ఇలాంటి వికారమైన ఛాలెంజ్లు అనేకం
ఇంతకుముందు దాల్చిన చెక్క పొడి ఛాలెంజ్ కూడా వచ్చింది. Cinnamon challenge దీని పేరు. నీళ్ళు తాగకుండా స్పూన్ దాల్చిన చెక్క పొడిని మింగాలన్న ఈ ఛాలెంజ్ ఒక సెన్సేషన్ 2012 లో. కానీ దీనివలన అనేక ప్రతికూల ప్రభావాలు ఎదురై అనేక ఇబ్బందులకు కూడా గురైనారు. యూట్యూబ్ లో 50000 పైన వీడియోలు ఇవే ఉన్నాయి అంటే అర్ధం చేసుకోవచ్చు. ఎంత వెర్రిగా ఇలాంటివి పాటించేవారు ఉన్నారో ఈ ప్రపంచంలో అనిపిస్తుంది.
ఇలాంటివి మీకు కూడా తెలిస్తే కింది కామెంట్ సెక్షన్ లో తెలుపండి.



Click it and Unblock the Notifications