Latest Updates
-
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.! -
పంద్రాగ్రస్ట్ స్పెషల్.. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ పాత్రలో చాలా ఈజీగా తిరంగా కేక్.! -
ప్రాణాల మీదకు తెచ్చిన మొబైల్ పిచ్చి.. షకీలాకు మెడ సర్జరీ, కారణం తెలిస్తే షాక్! -
80వ స్వాతంత్ర్య దినోత్సవం.. వాట్సప్ స్టేటస్, కోట్స్.. మన భారతీయులకు ఇలా విషెస్ తెలియజేయండి! -
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన ఆవ నూనె తయారీ.. మిక్సీ ఉంటే చాలు! -
ఆగస్టు 15 స్పెషల్..పక్కా స్వీట్ షాప్ స్టైల్ మోతీచూర్ లడ్డూ.. మీ ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసేయండి -
రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా.. మీ ఫ్యామిలీలో ఈ సమస్యలు రావడం పక్కా.! -
మన ఇంట్లో పెరిగే ఈ చెట్టు పండ్లే కాదు.. ఆకులు సైతం రోగాలతో పోరాడతాయని తెలుసా.!
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ డిన్నర్..చియా రైతా చేయండిలా..కడుపుకు హాయిగా, క్యాలరీలు తక్కువగా..
చియా సీడ్స్ (సబ్జా గింజలను పోలి ఉండే గింజలు) అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఉదయం పూట తాగే స్మూతీలు లేదా బ్రేక్ ఫాస్ ట్లో తీసుకునే పుడ్డింగ్స్. కానీ చియా సీడ్స్ కేవలం ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ గా మాత్రమే కాదు..రాత్రి పూట కూడా వీటితో అద్భుతమైన, లైట్ డిన్నర్ ని తయారు చేసుకోవచ్చు. రాత్రి పూట వంట చేసే ఓపిక లేనప్పుడు లేదా కడుపుకి హాయిగా అనిపించే ఆహారం తినాలి అనుకున్నప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్.

సాధారణంగా రాత్రి పూట భారీ ఆహారం తీసుకుంటే అరుగుదల సమస్యలు వస్తాయి. కానీ ఈ చియా రైతా చాలా తేలికైనది. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, పేగుల ఆరోగ్యానికి అత్యద్భుతంగా పని చేస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ డిన్నర్ ఆప్షన్. పొట్ట నిండిన భావన కలిగిస్తూనే, క్యాలరీలను అదుపులో ఉంచుతుంది. రాత్రి వేళ కడుపుకు చాలా తేలికగా ఉంటూనే, ఎక్కువ ప్రొటీన్, ఫైబర్ అందించే కమ్మటి చియా రైతా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
చియా రైతా తయారీకి కావాల్సిన పదార్థాలు
నానబెట్టిన చియా సీడ్స్ - 1 కప్పు
తాజా పెరుగు - 1 కప్పు
తురిమిన క్యారెట్ - కొద్దిగా
కీరదోసకాయ ముక్కలు - కొద్దిగా
కొత్తిమీర - కొద్దిగా
దంచిన అల్లం - కొద్దిగా
పచ్చిమిర్చి - మీ కారానికి తగినంత
ఉప్పు -సరిపడా
తాలింపుకి- పల్లీలు, జీడిపప్పు,నెయ్యి లేదా నూనె, ఆవాలు, జీలకర్ర.
అలంకరణ కోసం: దానిమ్మ గింజలు
చియా రైతా తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో 6-7 గంటల పాటు చియా సీడ్స్ నానబెట్టుకోవాలి.
-తర్వాత ఒక గిన్నెలో కమ్మటి పెరుగు వేసి ఉండలు లేకుండా బాగా గిలకొట్టాలి. ఇప్పుడు ఆ పెరుగులో 6-7 గంటల పాటు నానబెట్టుకున్న చియా సీడ్స్ వేసి కలపాలి. ఆ తర్వాత తురిమిన క్యారెట్, కీరదోస సన్నని ముక్కలు, దంచిన అల్లం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా ఈ దశలోనే వేసి మిక్స్ చేయాలి.
-ఇప్పుడు అసలైన రుచి కోసం తాలింపు రెడీ చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద ఒక చిన్న కడాయిలో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేడి చేసి, అందులో ఆవాలు, జీలకర్ర, పల్లీలు, జీడిపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. పల్లీలు, జీడిపప్పు రైతాలో పంటికి తగులుతూ అద్భుతమైన క్రంచీ రుచిని ఇస్తాయి.
-రెడీ అయిన తాలింపును పెరుగు మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. చివరగా పైన ఎర్రటి దానిమ్మ గింజలను చల్లి అలంకరించుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన, చల్లదనాన్నిచ్చే ఆరోగ్యకరమైన చియా రైతా డిన్నర్ కోసం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications