Latest Updates
-
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే! -
షుగర్ కి చెక్, బరువుకు బ్రేక్..రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రాగి దోశ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు!
బీకాం చదివే కూతురిపై మూడేళ్లుగా లైంగిక దాడి చేసిన తండ్రి.. నాన్నేకదమ్మా భరించు అని చెప్పే తల్లి
వయసొచ్చిన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే.. కామంతో ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. మూడేళ్లుగా భార్య సహకారంతో.. కుమార్తెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. కన్న కూతురిపై మూడేళ్లుగా లైంగికదాడి.
వయసొచ్చిన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే.. కామంతో ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. మూడేళ్లుగా భార్య సహకారంతో.. కుమార్తెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. కన్న కూతురిపై మూడేళ్లుగా లైంగికదాడికి పాల్పడ్డాడు ఒక కిరాతకుడు.
తాజాగా ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. మూడేళ్లుగా కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ కసాయి తండ్రి. అయితే ఇందుకు అతనికి సహకరించిన తల్లిని సైతం పోలీసులు కటకటాల్లోకి పంపారు.

ఓ జీపు డ్రైవర్
చంద్రగిరి మండల ఎం.కొంగరవారిపల్లెకు చెందిన ఓ జీపు డ్రైవరుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాల్లో బీకాం కంప్యూటర్స్ తృతీయ సంవత్సరం చదువుతోంది. మూడేళ్లుగా ఆ యువతిపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. మద్యానికి బానిసైన అతను మూడేళ్ల ముందు యువతిపై తొలిసారి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

భయభ్రాంతులకు గురిచేసేవాడు
యువతి వ్యతిరేకించడంతో ఆమెపై, ఆమె తల్లిపై దాడి చేసి వారిని భయభ్రాంతులకు గురిచేసేవాడు. ఇక తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే కుటుంబ పోషణ భారమవుతుందన్న ఉద్దేశంతో భార్య కూడా ఈ పరిస్థితిని ఎవరికీ చెప్పుకోలేకపోయేది.

కొందరికి తెలుసు
అయితే ఈ విషయం గ్రామంలో ఈ విషయం కొంతమందికి తెలిసినా అతను చేసే దౌర్జన్యాలకు భయపడి, మిన్నుకుండిపోయేవారు. దీంతో అతను మూడేళ్లుగా యువతిపై అత్యాచారం చేస్తూ వచ్చాడు.

ఆత్మహత్య చేసుకునేందుకు
చివరకు తన తండ్రి చేసే అఘాయిత్యాన్ని తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయం తీసుకుంది. తన దూరపు బంధువుకు తన ఆవేదన చెప్పడంతో ఆమె సూచనల మేరకు ధైర్యం చేసి యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితులను కొన్ని రోజులు క్రితం అదుపులోకి తీసుకుని విచారించారు.

మూడేండ్ల నుంచి అత్యాచారం
ఇక విచారణలో ఆ కసాయి తండ్రి చెప్పిన మాటలు విని పోలీసులు కూడా షాక్ అయ్యారు. తన కూతురిపై మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడినట్లు అతడు అంగీకరించాడు. అయితే గత మూడేండ్ల నుంచి తనపై తండ్రి అత్యాచారం చేస్తున్నాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది.

ఇనుప కమ్మీలతో
తన తండ్రి చెప్పినట్లు వినకుంటే దారుణంగా కొట్టేవాడని బాధితురాలు కన్నీరు పెట్టుకుంది. తాగొచ్చి లైంగిక వాంఛ తీర్చాలంటూ ఇనుప కమ్మీలతో తన తండ్రి చితకబాదేవాడని, విషయం బయటకు చెబితే చంపేస్తానంటూ బెదిరించేవాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. చివరకు ఆ నీచుడి ఆగడాలను భరించలేక ధైర్యం తెచ్చుకుని పోలీసులను ఆశ్రయించానంది.

తల్లి కూడా నాన్నకే మద్దతు ఇచ్చేది
తన తల్లి కూడా నాన్నకే మద్దతుగా ఉండేదని పేర్కొంది. విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని తల్లిదండ్రులు ఇద్దరు బెదిరించే వారని బాధితురాలు పోలీసులకు చెప్పింది. ఒక వేళ విషయం బయటకు తెలిస్తే.. నాన్న జైలుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని... విషయం బయట ఎవరికీ చెప్పొద్దని తల్లి తనను బెదిరించేదని ఆమె తెలిపింది. కాగా తాను మంచి ఉద్యోగం రాగానే ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనుకున్నానంది.

నాన్నేకదమ్మా భరించు
తాను మాట వినకపోతే కొట్టేవాడని..‘మీ అవ్వను చంపినట్లు చంపేస్తాను' అంటూ బెదిరించేవాడని ఆమె చెప్పింది. ఇక కన్నతల్లికి చెప్పుకుంటే ‘నాన్నేకదమ్మా భరించు' అనేదట. ఈ ఘోరాల్ని తాను రోజూ భరించలేక పోయేదని పోలీసులతో ఏడ్చేసింది.

నిందితుడు అత్తను సైతం హతమార్చినట్లు...
నిందితుడి నుంచి తగిన సాక్ష్యాలను సేకరించారు పోలీసులు. బాధిత యువతిని మెడికల్ పరీక్షల అనంతరం తిరుపతిలోని ఓ హోంకు తరలించారు. అలాగే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు తన అత్తను సైతం హతమార్చినట్లు తెలిసింది. ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. సమాజంలో ఇలాంటి క్రూరమైన తండ్రులు కూడా ఉంటారనడానికి ఈ కథే సాక్ష్యం.

సొంత ఇంటిలోనే రక్షణ లేకుంటే ఎలా
అమ్మాయిలకు సొంత ఇంటిలో కూడా రక్షణ లేకుండా పోతే వారి జీవితం ఏం కావాలి. కొందరు అమ్మాయిలపై ఇలా కుటుంబ సభ్యులే దారుణంగా వ్యవహరిస్తున్నా కుటుంబం పరువు పోతుందని ఆ విషయాలన్ని బయటకు చెప్పకుండా దాచేస్తున్నారు. కన్నకూతురిని కంటికి రెప్పల చూసుకోవాల్సిన తండ్రి తాగిన మత్తులో వావివరసలు మరిచి ఇలా ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

సరైన శిక్ష పడాలి
సమాజంలో ఉండే ఇలాంటి చీడ పురుగులకు సరైన శిక్ష పడాల్సిన అవసరం ఉంది. వివాహేతర సంబంధాలు, ఆడవారిని హింసించడం, బాధించడం వంటి వాటిపైన అందరూ చైతన్యం కావాల్సిన అవసరం చాలా ఉంది. అత్యాచారాలు, వివాహేతర సంబంధాల వల్ల హత్యలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది.



Click it and Unblock the Notifications











