For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెక్షన్ 377 గురించి తెలుసా? ఎల్.జి.బి.టి వర్గం పై ప్రభావం..!

సెక్షన్ 377 గురించి తెలుసా? ఎల్.జి.బి.టి వర్గం పై ప్రభావం..!

|

అసలేమిటీ ఎల్.జి.బి.టి: లెస్బియన్.గే.బైసెక్సువల్.ట్రాన్స్జెండర్ వర్గాన్ని ఎల్.జి.బి.టి వర్గంగా వ్యవహరిస్తారు. వారి హక్కుల మీద సెక్షన్ 377చూపే ప్రభావం గురించిన అవగాహన ఇవ్వడం కోసమే ఈవ్యాసం.

లైంగికస్వేచ్చ లేని దేశం మన భారతదేశం. విచ్చలవిడి శృంగార కార్యకలాపాలకు, పర్యవసాన సమస్యలకు జీవితాలు బలి కాకూడదన్న ఆలోచనతో పాతకాలం నుండే కొన్ని విధివిధానాలు పొందుపరచబడ్డాయి.

కానీ లైంగికస్వేచ్చ లేదు అంటూనే, మీ ఇష్టానుసారం అత్యాచారాలకు తెగబడొచ్చు అన్న చందాన పరిస్థితులు తయారయ్యాయి. గాంధీజీ చెప్పినట్లు అర్ధరాత్రి మహిళ స్వేచ్చ సంగతేమో కానీ, పట్టపగలు కూడా ఒంటరిగా వెళ్ళలేని స్థితిలో దేశం ఉంది అనడం భాదాకరమైన, కొందరు ఒప్పుకోలేని నిజం. అనేక అత్యాచారాలకు ఒడిగట్టినవారు స్వేచ్చగానే కాలం వెళ్లదీస్తున్నారు. కోర్టుల్లో సరైన సాక్ష్యాలు లభించక, లేదా కోర్టు మెట్లెక్కే లోపే సమస్యలను డబ్బుతో లేదా బెదిరింపులతో పరిష్కరించుకోవడం మూలంగా. ఇటువంటి అనేక చర్యలను స్వచ్చంద మరియు మహిళా సంఘాలు ఖండిస్తున్నప్పటికీ, రోజుకో దారుణం లేకుండా న్యూస్ పేపర్ కనపడడం లేదు.

Home »Insync »Pulse »Know About Section 377 And How It Is Affecting The LGBT Community

కానీ అలాంటి వారికి పరోక్ష స్వేచ్చని ఇస్తున్న మన సమాజం, ఇష్టానుసారంగా సంబంధాలను కలిగి ఉన్న లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్జెండర్ల స్వేచ్చపై ఉక్కుపాదం వేస్తుంది.

ఎల్.జి.బి.టి వర్గాలు గత అనేక సంవత్సరాలుగా వారి హక్కుల కోసం పోరాడుతోంది, అయితే భారత ప్రభుత్వం చట్టాల ప్రకారం వీరి భాగస్వామి ఎంపికలో మాత్రం వారికి తక్కువ స్వేచ్చను కలిగిస్తుంది.

ఇక్కడ సమస్య చట్టం కాదు, మనం నివసిస్తున్న సమాజం మరియు ప్రజల మనస్తత్వంతో. భారతదేశాన్ని అత్యాచార-రహిత దేశంగా మార్పుతీసుకుని రావడంలో తీసుకునే చట్టాలతో సమానంగా, వ్యక్తుల భాగస్వామి ఎంపికలో కూడా స్వేచ్చని కలిగి ఉండేలా చట్టాలు తీసుకుని రావాలి. నిజానికి మేజర్లయిన యువతీ యువకులు సైతం నిర్ణయాలు తీసుకోనీకుండా, కులాలు మతాలూ అంతస్తులు వంటివి అడ్డు పడుతున్నా అనేక విషయాలలో కోర్టులు సైతం జోక్యం చేసుకోని కారణంగా, జంటలు విడిపోయి జీవితాంతం మానసికక్షోభలకు గురవడం లేదా ఆత్మహత్యలకు పాల్పడడం వంటివి మనం చూస్తూనే ఉన్నాము. ఇక్కడ కేవలం యువతీ యువకులకే కాదు ఎల్.జి.బి.టి వర్గాలకు సైతం వారి స్వేచ్చలను కాపాడే హక్కులు ఉంటాయని సమాజం, చట్టాలు కూడా గుర్తించాలి.

కానీ ఒక్కటి నిజం, మనస్పూర్తిగా ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్న పక్షంలో వారి భాగస్వాములను ఎంచుకునే హక్కు ఎల్.జి.బి.టి వర్గాలకు కూడా ఉంది. అదేమీ అత్యాచారమంత తప్పైతే కాదు. కానీ ఎంపికలో కూడా బలవంతం ఉండకూడదు. అది ఏ వర్గంలో అయినా.

భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 377 ఏమిటో అర్థంకాని వారికి, అవగాహన కల్పించే క్రమంలో భాగంగా ఈ వ్యాసం సహాయపడుతుంది.

సెక్షన్ 377 ఇలా ఉంది:

ఇండియన్ పీనల్ కోడ్ అధ్యాయం XVI లో సెక్షన్ 377, బాక్ టూ 1861 చట్టం ప్రకారం. ఈ చట్టం భారతదేశపు బ్రిటీష్ పాలన నాటిది. ఇది 1533 యొక్క బగ్గరీ చట్టం ఆధారితంగా రూపొందించబడింది. దీనిలో ప్రకృతివిరుద్దంగా స్వలింగసంపర్క కార్యకలాపాలను కలిగి ఉన్న వ్యక్తులను నేరస్తులుగా పరిగణించింది. ప్రకృతిసిద్దం అని మాట్లాడేవారు కూడా ఆ విధివిధానాలను కూడా మనమే నిర్ణయించుకున్నామని తెలుసుకోవాలని అనేకమంది సూచిస్తుంటారు.

సెక్షన్ 377 ఏం చెప్తుందంటే :

ఐపిసి సెక్షన్ 377 ఇలా చెబుతుంది: "ఎవరైతే ప్రకృతివిరుద్దంగా పురుషుడు, స్త్రీ లేదా జంతువుతో స్వచ్ఛందంగా లేదా బలవంతంగా లైంగిక సంపర్కాన్ని కలిగి ఉంటే, వారు శిక్షించబడాలి” ఆ శిక్షలు వరుసగా జీవితఖైదు, పరిస్థితులను బట్టి 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష, మరియు జరిమానా. ఇంకా నయం ఉరెయ్యలేదు.

ఈ చట్టాన్ని ఎందుకు తొలగించాలి:

నేరస్థులని తగ్గించాలి అంటే, శిక్షలు వేయడం కాదు, మార్పులు తీసుకొచ్చే విధానం మీద, నేరాలకు కారణమయ్యే పరిస్థితుల మీద, వ్యక్తిగత స్వేచ్చల మీద దృష్టి సారించాలి.

English summary

Home »Insync »Pulse »Know About Section 377 And How It Is Affecting The LGBT Community

We live in a country where sexual freedom is not allowed, but raping anybody of your choice is acceptable. While the rapists roam around free or on bail, there are those individuals who are suppressed for their choices as being a gay or a lesbian can make the society judge your character.
Story first published:Sunday, July 15, 2018, 11:46 [IST]
Desktop Bottom Promotion