For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్య జాతకం 2020 : కొత్త సంవత్సరంలో 12 రాశుల వారి ఆరోగ్యం ఎలా ఉండబోతుందంటే..

|

ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ అందుకు తగిన జాగ్రత్తలను మాత్రం పాటించాడు. ఎక్కువ మంది ఆరోగ్యం పట్ల అత్యంత నిర్లక్ష్యంగా ఉంటారు. కొందరు మాత్రం ఆరోగ్యానికి సంబంధించి అనేక జాగ్రత్తలు తీసుకుంటారు.

అయితే ఆంగ్ల నూతన సంవత్సరంలో మీకు ఆరోగ్య పరంగా అద్భుతంగా ఉంటుందా? లేదా 2020లోనూ ఆరోగ్యపరమైన ఇబ్బందులు తప్పవా? మీ ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ద్వాదశ రాశి చక్రాల సమాచారాన్ని చూడండి. జ్యోతిషశాస్త్రం ప్రకారం 2020లో మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలుసుకోండి.. ఆరోగ్యానికి సంబంధించిన జాతకఫలాల మేరకు తగిన జాగ్రత్తలు పాటించి హాయిగా జీవించండి...

1) మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

1) మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు కొత్త సంవత్సరంలో ఆరోగ్య పరంగా కొంచెం అప్రమత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రారంభ నెలల్లో మీరు అనారోగ్యానికి గురయ్యే అవకాశం కనబడుతోంది. ఈ కాలంలో అధిక పని ఒత్తిడి కారణంగా మీరు ఆరోగ్యంపై అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ కొత్త సంవత్సరంలో ఆరోగ్యవంతంగా ఉండేందుకు ప్రతిరోజూ వ్యాయామం, యోగా, ధ్యానం వంటివి చేయాల్సి ఉంటుంది.

Rashi Phalalu 2020 : ఏమి జరగబోతుందో తెలుసా.. మీ వార్షిక భవిష్యత్తు ద్వారా తెలుసుకోండి..

2) వృషభ రాశి : ఏప్రిల్ 20 - మే 20

2) వృషభ రాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి కొత్త సంవత్సరం 2020లో ఆరోగ్య పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అయితే కొన్ని సార్లు మీ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుంది.

అయితే వాటి పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఎప్పటికప్పుడు వైద్య నిపుణులను సందర్శించాలి. పెద్దల సలహాలను పాటించాలి. ఆరోగ్య విషయంలో మార్చి నుండి జూన్ మధ్య వరకు బాగా ఉంటుంది. ఈ సమయంలో మీరు మానసికంగా బలంగా కూడా ఉంటారు.

3) మిధున రాశి : మే 21 - జూన్ 20

3) మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి 2020 కొత్త సంవత్సరంలో ఆరోగ్యం విషయంలో బాగానే ఉంటుంది. ప్రారంభంలోని నెలల్లో ఎలాంటి పెద్ద సమ్యలు ఉండవు. కానీ సంవత్సరం మధ్యలో మీకు కొంత ఇబ్బందిగా ఉంటుంది. అంటే జూన్ తర్వాత కొన్ని వ్యాధులు అకస్మాత్తుగా మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. అంతేకాదు శారీరకంగా మరియు మానసికంగా మిమ్మల్ని బాగా కలవరపెడతాయి. కాబట్టి మీరు మీ ఆహారం మరియు కూల్ డ్రింక్స్ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బయట తినడం దాదాపు తగ్గించాలి.

4) కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

4) కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు కొత్త సంవత్సరంలో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటే మంచి ఆహారం మరియు మంచి పానీయాలను తీసుకోవడంతో నిత్యం ఉదయం లేదా సాయంత్రం వ్యాయామం చేయాలి. మీరు ఏదైనా చిన్న ఆరోగ్య సమస్యను ఎదుర్కొన్నా కూడా దాన్ని అస్సలు విస్మరించవద్దు. వ్యాధి తీవ్రం కాకముందే దానికి తగిన చికిత్సను తీసుకోవాలి. మార్చి నుండి జులై మధ్య నెలల్లో మీ ఆరోగ్యం విషయాల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. మీరు నిర్లక్ష్యం వహించకూడదు. ఎందుకంటే ఆ సమయంలో మీకు టైఫాయిడ్ లేదా ఏదైనా చర్మానికి సంబంధించిన వ్యాధి వస్తుంది.

5) సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

5) సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఆరోగ్య పరంగా కొత్త సంవత్సరంలో అనుకూలంగా ఉంటుంది. మీ ఫిట్ నెస్ గురించి మీకు మంచి అవగాహన ఉంటుంది.

ఆరోగ్యవంతంగా ఉండేందుకు ఆహారంతో పాటు, మీరు వ్యాయామంపై కూడా దృష్టి పెడతారు. మీరు జిమ్ కు కూడా వెళ్లవచ్చు. సంవత్సరం మధ్యలో మీకు చిన్న సమస్యలు రావచ్చు. మీరు డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు అయితే మీరు ఎక్కువ ఒత్తిడి తీసుకోకుండా ఉండాలని పెద్దలు సలహా ఇస్తారు.

ఈ వారం మీ రాశి ఫలాలు నవంబర్ 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు

6) కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

6) కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

ఈ రాశి వారు కొత్త సంవత్సరాన్ని మంచి ఆరోగ్యం మరియు పూర్తి ఉత్సాహంతో ప్రారంభిస్తారు. ఆరోగ్య పరంగా ఈ రాశి వారికి కొత్త సంవత్సరం బాగా కలసి వస్తుంది. అంతేకాదు ఈ కొత్త ఏడాదిలో మీరు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి నుండి బయటపడవచ్చు. మీరు కూడా మానసికంగా బలంగా ఉంటారు. ప్రతి పనిని బాధ్యతతో పూర్తి చేయగలుగుతారు. మీ శక్తి స్థాయిని మించి పనులు చేయడం ద్వారా అన్ని పనులు వేగంగా పూర్తి చేయగలరు. యోగా మరియు ధ్యానం పట్ల మీ ఆసక్తి కూడా పెరుగుతుంది.

7) తులా రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

7) తులా రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఆరోగ్య పరంగా కొత్త సంవత్సరం ప్రత్యేకంగా ఏమి ఉండదు. అయితే ప్రారంభ నెలల్లో మీకు మంచిగా అనిపిస్తుంది. మీ రాశి గ్రహాల యొక్క శుభ స్థానం వల్ల మీరు వ్యాధులపై పోరాడటానికి సహాయపడుతుంది. కానీ కొంచెం నిర్లక్ష్యం వల్ల ఏదైనా హాని జరగొచ్చు. అలాగే జూన్ తర్వాత మీరు చర్మానికి సంబంధించిన వ్యాధి, కండరాల నొప్పులు, జీర్ణ సమస్యలు మొదలై చిన్న శారీరక సమస్యలను ఎదుర్కొంటారు.

8) వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

8) వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు కొత్త సంవత్సరంలో సాధారణం కంటే కొంత మెరుగైన ఆరోగ్యాన్ని పొందుతారు. మీరు 2020లో ఎలాంటి పెద్ద సమస్యలను ఎదుర్కోరు. అయితే కొత్త ఏడాది ప్రారంభోత్సవంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. కానీ ఆ తరువాత, మీరు మీ ఆరోగ్యంలో మంచి మెరుగుదల చూస్తారు. మీరు మరింత ఆరోగ్యంగా ఉండేందుకు యోగా, ధ్యానం వంటివి చేర్చి మీ దినచర్యలో కూడా కొంత మార్పులు చేయాలి. సంవత్సరం మధ్యలో అంటే జూన్ తర్వాత మీరు కొంత మానసికంగా బాధపడతారు. కానీ మీ బలమైన విశ్వాసం మరియు ధైర్యంతో, మీరు అలాంటి సవాళ్లను గట్టిగానే ఎదుర్కొంటారు.

9) ధనస్సు రాశి : సెప్టెంబర్ 22 - డిసెంబర్ 21

9) ధనస్సు రాశి : సెప్టెంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు కొత్త ఏడాదిలో మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. చిన్న సమస్యలను పక్కన పెడితే, ఆరోగ్యం విషయంలో కొత్త సంవత్సరం అంతా మంచిగా ఉంటుంది. మీరు శారీరకంగా మరియు మానసికంగా చాలా బలంగా ఉంటారు. అన్ని పనులను ఉత్సాహంతో పూర్తి చేస్తారు. సంవత్సరం మధ్యలో, పని ఒత్తిడి ఉంటుంది. ఈ సంవత్సరం మీరు మీ లక్ష్యాన్ని సాధించడానికి చాలా కష్టపడతారు.

10) మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

10) మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఆరోగ్య పరంగా కొత్త సంవత్సరం చాలా బాగుంటుంది. మీరు చాలా కాలంగా ఒక వ్యాధితో పోరాడుతుంటే ఈ సంవత్సరం ఆ వ్యాధి నుండి ఉపశమనం పొందొచ్చు. అయితే ప్రారంభ నెలల్లో మాత్రం చాలా కష్టపడాల్సి ఉంటుంది. అపుడు మీకు శారీరకంగా బలహీనంగా ఉంటుంది. అలాంటి సమయంలో మీరు పనితో పాటు విశ్రాంతిపైన ఎక్కువ శ్రద్ధ చూపాలి. మార్చి తరువాత నెల నుండి మీ ఆరోగ్యం బాగా ఉంటుంది.

11) కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

11) కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి కొత్త సంవత్సరం ఆరోగ్య పరంగా ప్రతికూలంగా ఉంటుంది. అందుకే మీరు ఆరోగ్యంపై అదనపు శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా మే నెల తరువాత ఆరోగ్య సమస్యలు ఎక్కువ కావచ్చు. ఈ కాలంలో, మీకు పెరుగుతున్న ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ కాలంలో మీకు కళ్ళు, కడుపు లేదా నిద్రలేమికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే, వ్యాధి తీవ్రమైన రూపాన్ని తీసుకునే అవకాశం ఉన్నందున మీరు అప్రమత్తంగా ఉండాలి.

12) మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

12) మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఆరోగ్య పరంగా కొత్త సంవత్సరం 2020లో మంచిగా ఉంటుంది. తీవ్రమైన సమస్యలు లేకున్నప్పటికీ నిర్లక్ష్యాన్ని నివారించాలి. మే నెల నుండి సెప్టెంబర్ మధ్య వరకు మీకు కొంత కష్టంగా ఉంటుంది. పెరుగుతున్న పని భారం మరియు మానసిక ఆందోళన కారణంగా మీరు చాలా కలత చెందుతారు. ఈ సందర్భంలో మీరు మీ గురించి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో మీరు ప్రార్థనలు మరియు ఆచారాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి.

English summary

Health Horoscope 2020 in Telugu | Arogyam Rashipalalu

How will the year 2020 be for you in terms of health? If you want to know, then we have brought every tiny to big information related to your health. Let's have a look at your yearly health horoscope.
Story first published: Tuesday, November 26, 2019, 16:16 [IST]