Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
సమీరా రెడ్డి చేసిన గోవా స్పెషల్ మ్యాంగో కొబ్బరి కర్రీ..అన్నంలోకి అమృతమే..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
ఎప్పుడూ తినేలా కాకుండా, ఈ వేసవిలో పండిన మామిడి పండ్లతో ఒక అద్భుతమైన వంటకాన్ని రుచి చూస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి ఒక అద్భుతమైన వంటకమే గోవా కొంకణి సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ఘోటాచె ససావ్. దీనిని మామాడికాయ కొబ్బరి కర్రీ అని కూడా పిలుస్తారు. కొంకణి భాషలో ఘోటా అంటే అడవిలో దొరికే చిన్న సైజులో ఉండే పండిన మామిడి పండ్లు (రసాలు). ససావ్ అంటే ఆవాలు. ఆవాలు, కొబ్బరి ప్రధానంగా వాడతారు కాబట్టే దీనికి ఆ పేరు వచ్చింది. ఉల్లి, వెల్లుల్లి వాడకుండా కేవలం 30 నిమిషాల్లో దీన్ని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ నోరూరించే వంటకాన్ని ప్రముఖ నటి సమీరా రెడ్డి తన ఇన్ ప్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు.

బాలీవుడ్ తో పాటు దక్షిణాది సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమీరా రెడ్డి.. ప్రస్తుతం గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉంటున్నారు. తన కుటుంబంతో కలిసి గోవాలో స్థిరపడిన ఆమె, ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సమీరా, బాడీ పాజిటివిటీ, మహిళల ఆత్మవిశ్వాసం పెంపొందించే మెసేజ్ లు ఇస్తుంటారు. అంతేకాకుండా, గోవా స్థానిక సంస్కృతిని, ఇలాంటి అద్భుతమైన వంటకాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలా ఆమె పరిచయం చేసిన వంటకమే ఈ ఘోటాచె ససావ్.
మామిడికాయ కొబ్బరి కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు
-చిన్న సైజు పండిన మామిడి పండ్లు లేదా రసాలు
-పచ్చి కొబ్బరి
-ధనియాలు
-కరివేపాకు
-పసుపు
-కారం పొడి
-ఉప్పు
-ఆవాలు
-వంట నూనె
-నీళ్లు
మామిడికాయ కొబ్బరి కర్రీ తయారీ విధానం
-ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా ధనియాలు, చిటికెడు పసుపు, తగినంత కారం వేయండి. కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి బాండీ పెట్టి, కొద్దిగా నూనె వేడి చేయండి. నూనె వేడెక్కాక ఆవాలు వేసి చిటపటలాడనివ్వండి. ఆవాలు వేగిన తర్వాత కరివేపాకు వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించండి.
-ఇప్పుడు ముందుగానే తొక్క తీసి పెట్టుకున్న పండిన మామిడి పండ్లను అందులో వేయాలి. ఒక నిమిషం పాటు నూనెలో వాటిని మెల్లగా కలుపుతూ వేయించండి. ఆ తర్వాత అందులో పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. కొద్దిగా నీళ్లు పోసి, మూతపెట్టి మామిడి పండ్లు మెత్తబడే వరకు ఉడికించాలి.
-మామిడి పండ్లు ఉడికిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి పేస్ట్ ను అందులో వేసి బాగా కలపండి. తక్కువ మంట మీద మరో ఐదు నిమిషాల పాటు ఉడకనిస్తే చాలు.
-అంతే ఘుమఘుమలాడే గోవా స్పెషల్ మామిడికాయ కొబ్బరి కర్రీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications