Latest Updates
-
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.!
నోట్లో నీళ్లు ఊరించే టమాటా నిల్వ పచ్చడి.. నెలల పాటు నిల్వ ఉండేలా చేసుకోండిలా..
టమాటా పచ్చడి అనగానే నోట్లో నీళ్లు ఊరడం ఖాయం. అందులోనూ ఇంట్లో చేసిన నిల్వ పచ్చడి అయితే వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు. అన్నంలోకే కాకుండా ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా లాంటి ఉదయం పూట చేసుకునే ఏ టిఫిన్స్ లోకైనా ఈ పచ్చడి అద్భుతమైన కాంబినేషన్. కేవలం అర కేజీ టమాటాలతో, నెలల తరబడి నిల్వ ఉండేలా, ఎంతో రుచికరమైన టమాటా పచ్చడిని సులభంగా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

టమాటో నిల్వ పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు
-టమాటాలు
-చింతపండు
-కారం
-పసుపు
-ఉప్పు
-ఆవాలు
-జీలకర్ర
-వెల్లుల్లి
-వేయించిన మెంతుల పొడి
-వేయించిన ఆవాల పొడి
-నూనె
-ఎండుమిర్చి
-కరివేపాకు
-ఇంగువ

టమాటో నిల్వ పచ్చడి తయారీ విధానం
-ముందుగా ఒక బౌల్ లో నిమ్మకాయ సైజు చింతపండు వేసి అది మునిగే వరకు నీళ్లు పోసి నానబెట్టుకోండి. 10 నిమిషాల పాటు చింతపండుని నాననివ్వాలి.
-చింతపండు నానేలోగా బాగా పండి, పట్టుకుంటే కొంచెం గట్టిగా ఉండే టమాటోలను అరకేజీ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఓ గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు నానిన చింతపండుని బాగా చేత్తో పిసకాలి. పిప్పిని పడేయండి. చిక్కగా వచ్చిన గుజ్జుని పక్కన పెట్టకోండి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో ముప్పావు కప్పు పల్లీ నూనె లేదా నువ్వు పప్పు నూనె వేసి వేడి చేయాలి. వేడెక్కిన ఆయిల్ 1 టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర వేసి ఆవాలు చిటపటలాడేవరకు వేగనివ్వాలి. తర్వాత అందులో కచ్చాపచ్చాగ దంచిన 15 పొట్టు తీయని వెల్లుల్లి రెమ్మలు, 2 రెమ్మల కరివేపాకు, 5 ఎండు మిరపకాయలు, పావు టీస్పూన్ ఇంగువ వేసి కలుపుకుంటూ బాగా వేగనివ్వాలి.
-బాండీలోనివి కొంచెం వేగిన తర్వాత అందులో కట్ చేసుకున్న టమాటో ముక్కలు, చింతపండు రసం వేసి బాగా కలిపి మూతపెట్టి మీడియం మంట మీద ఉడికించాలి.
-టమాటో ముక్కలు మెత్తగా మగ్గిపోయి ఆయిల్ సపరేట్ అవుతున్న సమయంలో గరిటతో టమాటో ముక్కలను మెదిపినట్లు చేయండి. దీంతో అవి మెత్తగా అయ్యి గుజ్జులాగా వస్తుంది. టమాటో ముక్కలను గరిటతో లైట్ గా నలిపిన తర్వాత అందులో 3 టీస్పూన్ల ఉప్పు వేసి బాగా కలుపుకున్నాక ఇందులోనే అర టీస్పూన్ పసుపు, 3 టీస్పూన్ల కారం వేసి మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకోవాలి.
-ఆయిల్ సపరేట్ అయ్యేవరకు తక్కువ మంట మీద కలుపుతూ ఉడికించాలి. పూర్తిగా ఆయిల్ సపరేట్ అయ్యి కొద్దిగా చిక్కబడిందన్నప్పుడు అందులో వేయించి పొడి చేసుకున్న మెంతుల పొడి, అర టీస్పూన్ వేయించి పొడి చేసుకున్న ఆవాల పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకోవాలి.
-ఇప్పుడు పచ్చడి రుచి చూసి ఉప్పు, కారం చెక్ చేసి కావాలి అనుకుంటే కలుపుకోండి. పచ్చడి చిక్కగా వచ్చి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి.
-పచ్చడి బాగా చల్లారిన తర్వాత తడి లేని గాజు సీసాలో లేదా డబ్బాలో పెట్టుకోవాలి. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు లేదా బయట పెట్టుకున్నా నెల రోజుల పైనే నిల్వ ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications