పుచ్చకాయ తింటూ ఈ 3 తప్పులు చేస్తే మీ ప్రాణాలకే ముప్పు!

మండుతున్న వేసవి కాలం వచ్చేసింది. ఈ ఎండల నుంచి ఉపశమనం పొందడానికి, శరీరాన్ని చల్లగా, హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి మనం సహజంగానే నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్ల వైపు మొగ్గు చూపుతాం. ముఖ్యంగా పుచ్చకాయ ఈ సీజన్‌ లో ఎక్కువగా తింటుంటాం. అయితే ఇటీవల ఓ కుటుంబం బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని తెల్లవారేసరికి మరణించిన ఘటన అనేక సందేహాలకు బీజం వేసింది. దీంతో అప్పటి నుంచి పుచ్చకాయ తినాలంటేనే కొందరు భయపడే పరిస్థితి కూడా నెలకొంది.

Summer Alert 3 Deadly Mistakes You Are Making While Eating Watermelon

హైడ్రేషన్ కోసం పుచ్చకాయ ఎంత అద్భుతమైన పండు అయినప్పటికీ, దానిని తినే సమయంలో మనం చేసే కొన్ని చిన్న పొరపాట్లు ఆరోగ్యానికి తీవ్ర ముప్పును తెచ్చిపెడతాయి. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం, విరుద్ధ ఆహారాలు (తప్పు ఆహార కలయికలు) శరీరానికి మేలుకు బదులు కీడు చేస్తాయి. వీటివల్ల కాలేయం, మూత్రపిండాలు, జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి పుచ్చకాయ తినేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏయే తప్పులు చేయకూడదో ఇక్కడ చూడండి.

పుచ్చకాయ + పాల ఉత్పత్తులు = డేంజర్
చాలామంది ఫ్రూట్ సలాడ్స్ లేదా స్మూతీస్ పేరుతో పండ్లను పాలతో కలిపి తీసుకుంటారు. కానీ పుచ్చకాయతో ఇలా చేయడం చాలా ప్రమాదకరం. పుచ్చకాయ తిన్న వెంటనే పాలు తాగడం, పెరుగు తినడం లేదా జున్ను (చీజ్) వంటి పాల ఉత్పత్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు.

పుచ్చకాయ చాలా త్వరగా జీర్ణమవుతుంది, కానీ పాలు జీర్ణం కావడానికి సమయం పడుతుంది. పుచ్చకాయలో ఉండే ఆమ్ల స్వభావం, పాలతో కలిసినప్పుడు కడుపులో గ్యాస్, బ్లోటింగ్ వంటి సమస్యలను సృష్టిస్తుంది. ఈ కలయిక కడుపులో సరిపడని విషపూరిత పదార్థాలుగా మారి, తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు లేదా జీర్ణ సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది.

Summer Alert 3 Deadly Mistakes You Are Making While Eating Watermelon

కోసిన పుచ్చకాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?

మన ఇళ్లలో తరచుగా జరిగే పొరపాటు ఇది. పుచ్చకాయ పరిమాణంలో పెద్దగా ఉంటుంది కాబట్టి, సగం కోసి తిన్న తర్వాత మిగిలిన సగాన్ని అలాగే ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటారు. కానీ మీరు ఎప్పటికీ చేయకూడని పని ఇదే. పుచ్చకాయను కోసి ఫ్రిజ్‌ లో ఓపెన్‌ గా ఉంచడం అంటే వ్యాధులను ఆహ్వానించడమే. ఆ పండులోని తేమ వాతావరణాన్ని బ్యాక్టీరియా వేగంగా గ్రహిస్తుంది.

ఇలా వృద్ధి చెందిన బ్యాక్టీరియాతో కూడిన పండును తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవ్వడమే కాకుండా, టైఫాయిడ్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే ముప్పు ఏకంగా 200 శాతం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు తాజా కాయను కోసుకుని తినడం మంచిది.

పరగడుపున పుచ్చకాయ తినొచ్చా?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే కదా అని చాలామంది పరగడుపున పుచ్చకాయను లాగించేస్తుంటారు. కానీ పుచ్చకాయను ఇలా ఎక్కువగా తినడం హానికరం. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు పరగడుపున పుచ్చకాయను అస్సలు తినకూడదు.

దీన్ని ఖాళీ కడుపుతో తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోతాయి. ఆరోగ్యవంతులు కూడా ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత లేదా మధ్యాహ్నం స్నాక్ సమయంలో పుచ్చకాయను తినడం ఉత్తమమైన పద్ధతి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Saturday, May 2, 2026, 8:00 [IST]
Desktop Bottom Promotion