For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుధవారం మీ రాశిఫలాలు (13-05-2020)

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, వైశాఖ మాసం, బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope May 13, 2020

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

శని మకరంలోకి ప్రవేశించే సమయంలో ఏయే రాశుల వారికి లాభమంటే...!శని మకరంలోకి ప్రవేశించే సమయంలో ఏయే రాశుల వారికి లాభమంటే...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. చిరునవ్వుతో ఈరోజు ప్రారంభించండి. మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నించండి. కుటుంబ జీవితంలో శాంతిని నెలకొల్పడానికి మీరు మీ ప్రవర్తనను చక్కగా ఉంచుకోవాలి. ఎటువంటి కారణం లేకుండా మీ కుటుంబంపై కోపం పెంచుకోకుండా ఉండాలి. ఆర్థిక పరంగా అదనపు ఆదాయం పొందేందుకు ఎక్కువగా కష్టపడాలి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : ఉదయం 9:45 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత తగ్గుతుంది. మీరు ఏకాగ్రతను పొందేందుకు ప్రతిరోజూ ధ్యానం చేయాలి. ప్రశాంతమైన మనస్సుతో అధ్యయనం చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారులు తమ భాగస్వాములతో మంచి సంబంధాలు పెట్టుకోవాలి. లేదంటే ఇబ్బందులు ఎదురై నష్టపోతారు. మరోవైపు వైవాహిక జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి ప్రేమ మరియు మద్దతు లభిస్తుంది. మీ ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ :రెడ్

లక్కీ నంబర్ : 35

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 7 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి కెరీర్ ఏదైనా సమస్య ఉంటే, ఈ రోజు అది దూరమవుతున్నట్లు అనిపిస్తుంది. మీకు ఈరోజు పని భారం ఎక్కువగా ఉంటుంది. అయితే, మీరు మీ తెలివితేటలు మరియు కృషితో మీ పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇందుకు మీకు ప్రశంసలు కూడా లభిస్తాయి. ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. మీరు మీ ఆనందాన్ని మీ ప్రియమైన వారితో పంచుకుంటారు. ఆర్థిక పరంగా ప్రయోజనాలు లభిస్తాయి. మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : సాయంత్రం 4:20 నుండి రాత్రి 10 గంటల వరకు

ఈ రాశిచక్రాల వారు డబ్బు ఆదా చేయడంలో ఎందుకు ఫెయిల్ అవుతారో తెలుసా...ఈ రాశిచక్రాల వారు డబ్బు ఆదా చేయడంలో ఎందుకు ఫెయిల్ అవుతారో తెలుసా...

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. మీరు మతపరమైన పనిలో ఎక్కువ అనుభూతి చెందుతారు. ఎక్కువ సమయం పూజా పారాయణాలు, విరాళాలు మొదలైన పనులకు వెళ్తుంది. ఉద్యోగులకు ఏదైనా పని ఒత్తిడిగా ఉంటే ఓపికగా ఉండాలి. మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి సమయం అనుకూలంగా లేదు. వ్యాపారులు ఆలోచనాత్మకంగా ముందుకు సాగాలి. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : ఉదయం 4:15 నుండి ఉదయం 10:10 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు పరిస్థితులు కొంత కష్టంగా ఉంటాయి. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, మీకు విజయం దక్కకపోవడం వల్ల మీరు కొంత నిరాశ చెందవచ్చు. అయితే అవన్నీ తాత్కాలికమే. మీకు త్వరలో సరైన ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు వారి యజమాని యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది. అయితే మీరు ఈ రోజు కొంత అదనపు పని చేయవలసి ఉంటుంది. ఈ రోజు మీరు కుటుంబంతో చాలా మంచి సమయాన్ని గడపడానికి అవకాశం పొందవచ్చు. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి యొక్క మానసిక మద్దతు మీ ప్రేమను పెంచుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య పరంగా మరింత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా కూల్ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఆర్థిక పరంగా మీకు మెరుగుదల కావాలంటే, మీరు ఆలోచించకుండా ఖర్చు చేసే అలవాటును మార్చుకోవాలి. శ్రామిక ప్రజలకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. వ్యాపారులు మంచి ప్రయోజనం పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. మీరు ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతుంటే, ఈ రోజు కుటుంబ సహాయంతో, మీ సమస్యలు అధిగమించవచ్చు.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

డబ్బు ఎక్కువగా ఖర్చు చేసే రాశిచక్రాల వారు: పూర్తి ఖర్చుతో కూడిన రాశిచక్రాలు..డబ్బు ఎక్కువగా ఖర్చు చేసే రాశిచక్రాల వారు: పూర్తి ఖర్చుతో కూడిన రాశిచక్రాలు..

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు మీరు ఏదైనా పాత రుణాన్ని తిరిగి చెల్లించగలుగుతారు. దీని వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. మీరు చాలా రిలాక్స్ అవుతారు. ఈ సమయంలో పెండింగు పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. ఉద్యోగులు ఈరోజు సానుకూల ఫలితాలను పొందొచ్చు. స్టాక్ మార్కెట్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు మంచి ప్రయోజనాలను పొందవచ్చు. విద్యార్థులు చదువులో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు కొంచెం ఎక్కువ ప్రయత్నిస్తే, మీ సమస్యను అధిగమించవచ్చు. ఆరోగ్య విషయాలు మిశ్రమంగా ఉంటాయి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : ఉదయం 4:25 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు వ్యక్తిగత జీవితంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. భావోద్వేగ సంబంధాల గురించి మీ మనస్సులోని గందరగోళాన్ని శాంతపరచడానికి మీరు ప్రయత్నిస్తారు. ఈ రోజు మీరు మీ మొత్తం కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. ఇంట్లో కొంతమంది వ్యక్తుల ప్రవర్తన మీకు నచ్చకపోవచ్చు. అయితే అలాంటి సమయంలో మీరు ప్రశాంతంగా ఉండాలి. ఆర్థిక విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించకండి. ఉద్యోగులు జాగ్రత్తగా పని చేయాలి. మీ ఆరోగ్యంలో కూడా కొంత ఇబ్బంది ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 29

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు స్నేహితులతో సుదీర్ఘ సంభాషణ చేయవచ్చు. మీ పాత జ్ఞాపకాలు కొన్ని రిఫ్రెష్ అవుతాయి. మీరు చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపారులకు ఈరోజు చాలా ముఖ్యమైనది. మీరు గొప్ప వ్యాపార ఆఫర్ పొందవచ్చు. మీరు తెలివిగా పనిచేస్తే, మీరు మంచి విజయాన్ని పొందవచ్చు. ఉద్యోగులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా బలంగా ఉంటుంది. మీరు పెద్ద ఆర్థిక నిర్ణయం తీసుకోవచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు జాగ్రత్తగా పని చేయాలి. మీరు చేసిన ఏ పని అయినా, జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే ఉన్నతాధికారులు అప్పగించండి. లేదంటే మీరు పెద్ద సమస్యలను ఎదుర్కోవచ్చు. లాక్ డౌన్ కారణంగా మీరు ఎక్కువ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు కుటుంబం విషయంలో ఆందోళన చెందుతారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీరు వారి ఆశీర్వాదం కూడా పొందుతారు. మీ ఆరోగ్యం కూడా మంచిగానే ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : సాయంత్రం 6:20 నుండి రాత్రి 10 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. సాధ్యమైనంత వరకు లైట్ ఫుడ్ తీసుకోవాలి. మరోవైపు మీ జీవిత భాగస్వామితో ఈరోజు సక్రమంగా ప్రవర్తించాలి. లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మీరు నిరాశ చెందవచ్చు. అయితే మీరు దేవున్ని ప్రార్థించి ప్రయత్నిస్తే, మీకు కచ్చితంగా విజయం లభిస్తుంది. వ్యాపారులు ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయాలి.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : ఉదయం 4:05 నుండి రాత్రి 11 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు ఎవ్వరినీ ఎక్కువగా నమ్మకూడదు. ఎందుకంటే మీరు మోసపోవచ్చు. మీ ముఖ్యమైన నిర్ణయాలు మీరే సొంతంగా తీసుకోండి. ఇతరుల మాటలతో ప్రభావితం అవ్వకండి. ఆర్థిక పరంగా పెద్ద ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. మీరు ఆర్థిక విషయాలలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తల్లిదండ్రులతో సమయం గడపడానికి ప్రయత్నించండి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 34

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి రాత్రి 7 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope May 13, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Tuesday, May 12, 2020, 19:29 [IST]
Desktop Bottom Promotion