Latest Updates
-
ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
చికెన్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్.. కేరళ మలబార్ పరోటా ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుంది! -
అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో కరకరలాడే పంచ్ మెల్ దాల్ పకోడా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా! -
ఆకు కూరల కంటే ఎక్కువ బలం: మోకాళ్లలో గుజ్జు రప్పించి, ఎముకల్ని గట్టిగా చేసే నల్లేరు రోటి పచ్చడి -
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే! -
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా..
వారి పిల్లలకు పెళ్లి ఫిక్స్ చేశారు.. వరసలు మారతాయనే భయంతో.. లేటు వయసులోనే లేచిపోయారు...!
వారు గాఢమైన ప్రేమలో ఉన్న సమయంలో అనుకోని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చిందట. అయితే తమ పిల్లల పెళ్లి వల్ల తాము మళ్లీ ఒక్కటవుతున్నామని భావించారట.
మరి కొద్ది రోజుల్లో తమ పిల్లల జరగబోతోంది. పెళ్లి పనుల్లో అందరూ హడావిడిగా ఉన్నారు. అయితే ఈ పెళ్లి జరగడానికి ముందే ఒక పెద్ద ట్విస్ట్ జరిగింది. ట్విస్ట్ అంటే ఈరోజుల్లో పెళ్లికి ముందే పెళ్లికుమారుడు పారిపోవడం లేదా పెళ్లి కూతురు మరొకరితో వెళ్లిపోవడం వంటి సంఘటనలను ఎన్నో చూసే ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పే సంఘటన గురించి మీరు ఇప్పటిదాకా అస్సలు విని ఉండరు. ఎందుకంటే ఏ తల్లిదండ్రులు అయినా తమ పిల్లల పెళ్లిని ఘనంగా చేయాలనుకుంటారు.

అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే వారి తల్లిదండ్రులే తమ పిల్లల పెళ్లికి విలన్లు అయ్యారు. ఇదంతా మామూలే అనుకుంటే పొరపాటే.. వారు ఆ పెళ్లిని ఆపాలనుకున్నా అది సాధ్యపడకపోవడంతో ఏకంగా వారే పెళ్లికి సిద్ధమయ్యారు.

వరుడి తండ్రి.. వధువు తల్లి కలిసి జంప్ జిలానీ అయ్యారు. ఇదంతా గుజరాత్ రాష్ట్రంలో ఇటీవలే చోటు చేసుకుంది. ఈ సంఘటన కాస్త ఆలస్యంగా వచ్చింది. అయితే ఈ విషయాన్ని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది తెగ వైరల్ అయిపోయింది. ఇంతకీ లేటు వయసులో వారు ఎందుకు లేచిపోయారు? తమ పిల్లల జరిగిందా లేదా అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకోండి...

పిల్లల పెళ్లికి ముందే...
గుజరాత్ లోని సూరత్ లో తమ పిల్లల పెళ్లికి ముందే పెళ్లి కుమారుడి తండ్రి, పెళ్లికూతురు తల్లి ఇద్దరు చిన్ననాటి నుండే ప్రేమలో ఉన్నారట.

కొన్ని కారణాల వల్ల..
వారు గాఢమైన ప్రేమలో ఉన్న సమయంలో అనుకోని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చిందట. అయితే తమ పిల్లల పెళ్లి వల్ల తాము మళ్లీ ఒక్కటవుతున్నామని భావించారట.

ప్రేమ పావురాల్లా..
అంతే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా.. ఎవ్వరు ఏమనుకున్నా.. ఈ సమాజంతో మనకు పని లేదు అనుకొని తమ ప్రేమ ప్రపంచంలోని విహరించడానికి ప్రేమ పావురాల్లాగా ఎగిరిపోయారంట.

ఇద్దరికీ 40+
అయితే పెళ్లకొడుకు తండ్రి వయసు 48 ఏళ్లు కాగా.. పెళ్లి కూతురు తల్లి వయసు 40 ఏళ్లు. వీరిద్దరూ సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించడానికి పది రోజుల ముందు మళ్లీ ప్రేమాయణం మొదలెట్టారట. అయితే ఇప్పటికీ వీరిద్దరి జాడ తెలియకపోవడం గమనార్హం.

పెటాకులైన పిల్లల పెళ్లి...
మరి కొద్ది రోజుల్లో ఒక్కటవ్వాల్సిన జంటకు పెద్ద ఆటంకమే వచ్చి పడింద. వారిద్దరూ ఎవ్వరు చేయకూడని పని చేయడంతో పిల్లల పెళ్లి పెటాకులైపోయింది.

ఎవ్వరికీ చెప్పకుండా...
వీరి కుటుంబాలకు ఇంతకుముందే మంచి పరిచయం ఉండటంతో సంవత్సరం క్రితమే వారి పిల్లలకు పెళ్లిళ్లను నిర్ణయించారు. పిల్లలు పెళ్లి చేసుకుంటే తమ వరసలు ఎక్కడ మారతాయనే భయంతో వారిద్దరూ ఎవ్వరికీ చెప్పకుండా పారిపోయారు.

ఆలస్యంగా తెలిసింది..
వారిద్దరూ కలిసి లేచిపోయారన్న సంఘటన ఈ రెండు కుటుంబాల వారికి చాలా ఆలస్యంగానే తెలిసింది. ఎందుకంటే పెళ్లి పనులు మొదలెట్టిన నాటి నుండే వారిద్దరూ కనబడకుండా పోయారు.

సోషల్ మీడియాలో వైరల్..
ఈ విషయం తెలుసుకున్న రెండు కుటుంబాలు ఇప్పటికీ ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నాయట. ఇక పెళ్లికొడుకు, పెళ్లికూతురు పరిస్థితి అయితే వర్ణనాతీతంగా ఉంది. ఇదే విషయాన్ని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విపరీతంగా వైరల్ అవుతుండటం విశేషం.



Click it and Unblock the Notifications
