Latest Updates
-
చికెన్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్.. కేరళ మలబార్ పరోటా ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుంది! -
అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో కరకరలాడే పంచ్ మెల్ దాల్ పకోడా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా! -
ఆకు కూరల కంటే ఎక్కువ బలం: మోకాళ్లలో గుజ్జు రప్పించి, ఎముకల్ని గట్టిగా చేసే నల్లేరు రోటి పచ్చడి -
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే! -
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.!
ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
హిందూ సంప్రదాయాలు, జ్యోతిషం, వాస్తు శాస్త్రాల ప్రకారం..మన చుట్టూ తిరిగే పక్షులు, జంతువుల కదలికలు మన భవిష్యత్తులో జరగబోయే శుభ, అశుభాలకు సంకేతాలుగా భావిస్తారు. ముఖ్యంగా రాత్రివేళ లేదా సంధ్యా సమయంలో ఇంట్లోకి గబ్బిలం వస్తే.. చాలామందిలో భయం, ఆందోళన మొదలవుతాయి. అసలు ఇంట్లోకి గబ్బిలం రావడం దేనికి సంకేతం? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? శాస్త్రీయ కోణం ఏంటి?
ప్రతికూల శక్తులకు ప్రతీక
వాస్తు శాస్త్రం ప్రకారం గబ్బిలం ఇంట్లోకి ప్రవేశించడాన్ని అశుభ శకునంగా పరిగణిస్తారు. గబ్బిలాలను నెగెటివ్ ఎనర్జీకి నిలయంగా భావిస్తారు. గబ్బిలం ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో సానుకూల వాతావరణం దెబ్బతింటుందని, కుటుంబ సభ్యుల మానసిక ప్రశాంతత దూరమై అశాంతి నెలకొంటుందని పెద్దలు చెబుతుంటారు.

ఆర్థిక నష్టాలు - అనారోగ్య సమస్యలు
గబ్బిలం పదే పదే ఇంట్లోకి రావడం లేదా ఇంట్లోనే ఏదైనా మూల గూడు కట్టుకోవడం తీవ్రమైన దోషంగా భావిస్తారు. దీనివల్ల ఆ ఇంటికి ఆర్థిక నష్టాలు తప్పవని నమ్మకం. చేతికి వచ్చిన డబ్బు ఇట్టే ఖర్చయిపోతుంది, అప్పుల బాధలు పెరుగుతాయి. అంతేకాకుండా, కుటుంబ సభ్యులను ఊహించని ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి.కారణం లేకుండానే ఇంట్లో తరచుగా గొడవలు, విభేదాలు తలెత్తి కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరిగే ప్రమాదం కూడా ఉంది.

శాస్త్రీయ కోణం..
శాస్త్రీయ కోణంలో చూస్తే గబ్బిలాలు చీకటిని అమితంగా ఇష్టపడే ప్రాణులు. కీటకాలను వేటాడే క్రమంలో లేదా బయటి వాతావరణం నుంచి రక్షణ పొందేందుకు.. చీకటిగా, సురక్షితంగా ఉండే ఇళ్లలోకి అవి పొరపాటున వస్తుంటాయి. కాబట్టి దీన్ని చూసి ప్రాణభయంతో వణికిపోవాల్సిన అవసరం లేదు.
ఇలా చేస్తే సరి..!
ఒకవేళ గబ్బిలం మీ ఇంట్లోకి వస్తే.. కంగారుపడి దాన్ని కొట్టడం, చంపడం లాంటివి అస్సలు చేయకూడదు. దానికి బదులుగా వెంటనే తలుపులు, కిటికీలు బార్లా తెరిచి ఉంచితే దానంతట అదే బయటకు వెళ్లిపోతుంది. ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చూసుకుంటే ఇలాంటి జీవులు లోపలికి రావు.
ఇల్లు ఎలా శుద్ధి చేసుకోవాలి?
గబ్బిలం బయటకు వెళ్లాక, ఇల్లంతా ఒకసారి శుభ్రం చేసుకోవడం ఉత్తమం. గంగాజలం లేదా పసుపు కలిపిన నీటిని ఇంటి మూలల్లో చల్లాలి. ఆ తర్వాత దేవుడి గదిలో దీపారాధన చేసి, అగరబత్తులు వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో పేరుకుపోయిన నెగెటివ్ ఎనర్జీ దూరమై.. తిరిగి పాజిటివ్ ఎనర్జీ, సుఖశాంతులు నెలకొంటాయి
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
