Latest Updates
-
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.?
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా..
వేడి వేడి అన్నం, పప్పులోకైనా.. లేదా సాయంత్రం వేళ టీ తాగుతున్నప్పుడైనా కరకరలాడే పాపడాలు ఉంటే ఆ మజాయే వేరు కదూ. భోజనం రుచిని రెట్టింపు చేయడంలో వీటికి సాటి మరొకటి లేదు. కానీ మనకు మార్కెట్లో దొరికే రెడీమేడ్ పాపడాలు మన ఆరోగ్యానికి ఎంతవరకు మేలు చేస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఆకర్షణీయమైన రంగుల కోసం వాడే రసాయనాలు, ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ఉపయోగించే ప్రిజర్వేటివ్స్, నాసిరకమైన నూనె.. ఇవన్నీ మన ఆరోగ్యానికి హాని చేస్తాయి.
అత్యంత తక్కువ ఖర్చుతో, ఎంతో శుచిగా మన ఇంట్లోనే బంగాళదుంప పాపడ్(ఆలూ పాపడ్) తయారు చేసుకోవచ్చు. ఇవి స్వచ్ఛమైన తెలుపు రంగులో, నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత కరకరలాడుతూ ఉంటాయి. రుచికరమైన బంగాళదుం పాపడాలను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
లేత తెల్లని బంగాళాదుంపలు: 1 కిలో
ఉప్పు: 1 టేబుల్ స్పూన్
బేకింగ్ సోడా: అర టీస్పూన్
చిల్లీ ఫ్లేక్స్: 1 టీస్పూన్
జీలకర్ర: 1 టీస్పూన్
కొత్తిమీర: 2 టేబుల్ స్పూన్లు
నూనె: 1 టేబుల్ స్పూన్
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు!
తయారీ విధానం
-ముందుగా బంగాళదుంపలను శుభ్రంగా కడిగి, మెత్తగా ఉడికించుకోవాలి. అవి చల్లారిన తర్వాత తొక్క తీసేయాలి. ఇప్పుడు ఆ బంగాళదుంపలను ఎక్కడా చిన్న చిన్న ముక్కలు లేదా ఉండలు లేకుండా మెత్తగా తురుముకోవాలి.
-మెత్తగా తురుముకున్న బంగాళాదుంపల మిశ్రమంలో ఉప్పు, జీలకర్ర, దంచిన ఎండు మిరపకాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర వేయాలి. కొద్దిగా నూనెను చేతులకు రాసుకుని, ఈ మిశ్రమాన్ని చపాతీ పిండిలా బాగా కలుపుకోవాలి.
-ఇప్పుడు కలుపుకున్న పిండిని చిన్న చిన్న నిమ్మకాయ సైజు ఉండలుగా చేసుకోవాలి. ఒక మందపాటి పాలిథీన్ కవర్ తీసుకుని దానికి కాస్త నూనె రాయాలి. ఒక ఉండను కవర్ మధ్యలో పెట్టి, కవర్‌ను మడిచి.. పైనుంచి ఏదైనా బరువైన పల్లెం లేదా చపాతీ కర్రతో గుండ్రంగా, పలచగా ఒత్తాలి.
-ఇలా ఒత్తుకున్న పాపడాలను ఒక శుభ్రమైన వస్త్రం లేదా కవర్ పై ఎండలో ఆరబెట్టాలి. మంచి ఎండ ఉంటే ఒక్క రోజులోనే ఇవి చక్కగా ఎండిపోతాయి.
-బాగా ఎండిన పాపడాలను ఒక గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకుంటే, ఏకంగా ఏడాది పాటు నిల్వ ఉంటాయి. మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వేడి వేడి నూనెలో వేయించుకుని ఆస్వాదించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
