ఇన్‌స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.!

ఇన్‌స్టా పరిచయాలు కాస్త ప్రేమ(కామం)కి పునాది వేస్తున్నాయి. వయసు తేడాతో సంబంధం లేకుండా, ముక్కూముఖం తెలియని వాడి మోజులో పడి కట్టుకున్న భర్తను, పిల్లలను అనాథలుగా వదిలేసి వివాహ బంధానికి మచ్చ తీసుకువస్తున్నారు కొందరు మహిళలు. ఇటీవల ఇన్‌స్టాలో పరిచయమైన తనకంటే 20 ఏళ్ల చిన్నవాడైన యువకుడి కోసం ఓ మహిళ తన ముగ్గురు పిల్లలను వదిలేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తల్లి కోసం ఆ పిల్లలు పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Insta love A 38-year-old woman abandoned her three children for an 18-year man

పదిహేనేళ్ల క్రితం వివాహం

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో ఓ విచిత్ర ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. బీహార్‌కు చెందిన సుమన్ కుమారి(38) అలియాస్ లవ్లీకి ప్రద్యుమన్‌తో సుమారు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం.. భర్త కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

ఇలాంటి బాస్‌ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్‌ప్రైజ్‌.!ఇలాంటి బాస్‌ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్‌ప్రైజ్‌.!

ఇన్‌స్టా పరిచయం

ఈ క్రమంలో ఇన్‌స్టా రీల్స్‌ చేయడంపై ఆసక్తి ఉన్న సుమన్‌కు దాదాపు ఆరు నెలల క్రితం పవన్‌(18) పరిచయం అయ్యాడు. పవన్‌ హర్యానాలోని సోనిపట్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వారి పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో సుమారు మూడు నెలల క్రితం సుమన్ తన భర్త, పిల్లలకు చెప్పకుండా బీహార్ నుంచి సోనిపట్ వెళ్లి పవన్‌ను కలిసింది. అక్కడే అతనితో సహజీవనం చేస్తోంది.

మొదలైన అనుమానం

ఇదిలా ఉండగా.. గత కొంతకాలంగా సుమన్ మరో వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతోందనే అనుమానంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో పవన్ తన స్వగ్రామానికి తిరిగి వెళ్లిపోయాడు. అతడిని వెతుక్కుంటూ సుమన్‌ కూడా లఖింపూర్ ఖేరీకి చేరింది. ఈ విషయం గ్రామంలో చర్చనీయాంశం కావడంతో పంచాయితీ కూడా జరిగింది. సుమన్‌ భర్త తన ముగ్గురు పిల్లలతో కలిసి పంచాయితీకి వెళ్లారు. తల్లిని చూడగానే పిల్లలు ఏడుస్తూ తమ దగ్గరికి రావాలని వేడుకున్నారు. కానీ ఆమె మాత్రం వారిని చూసి కరగలేదు. వారితో వెళ్లడానికి నిరాకరించింది. తన భర్త తీసుకువచ్చే సంపాదని సరిపోదని.. పిల్లలను ఆయనే పోషించాలని సుమన్‌ చెప్పింది.

నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్‌ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.!నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్‌ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.!

ఇక్కడే అసలైన ట్విస్ట్‌

అయితే సుమన్‌ బాయ్‌ఫ్రెండ్‌ పవన్‌ చెప్పిన విషయం పెద్దలను ఆశ్చర్యానికి గురిచేసింది. సుమన్‌కు అప్పటికే పెళ్లయి ముగ్గురు పిల్లలున్న విషయం తనకు తెలియదని పవన్‌ చెప్పినట్లు సమాచారం.

తన భర్త సంపాదన సరిపోదని, పిల్లలను ఆయనే చూసుకోవచ్చని సుమన్ చెప్పినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. మరోవైపు సుమన్‌కు ఇప్పటికే వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్న విషయం మొదట తనకు తెలియదని పవన్ చెప్పినట్లు సమాచారం. అయినా ఆమె తన భర్త, పిల్లల కోసం నిర్ణయం మార్చుకోకపోవడంతో ప్రద్యుమన్‌ తన ముగ్గురు పిల్లలను తీసుకుని బీహార్‌ వెళ్లిపోయాడు. ఇన్‌స్టా పరిచయం.. 20 ఏళ్ల వయసు తేడా.. ముగ్గురు పిల్లల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపించింది.

Story first published: Sunday, September 27, 2026, 5:31 [IST]
Desktop Bottom Promotion