అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో కరకరలాడే పంచ్‌ మెల్ దాల్ పకోడా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు!

Posted By:

సాధారణంగా ఇళ్లలో శనగపిండితో లేదా ఉల్లిపాయలతో పకోడాలు వేస్తుంటారు. కానీ, ఎప్పుడూ తినే రొటీన్ రుచులకు భిన్నంగా, మరింత రుచికరమైన, ఆరోగ్యకరమైన కొత్త వెరైటీని మీరు ట్రై చేయాలనుకుంటే..పంచ్‌ మెల్ దాల్ పకోడా మీకు సరైన ఎంపిక.

ఐదు రకాల పప్పుల మిశ్రమం, పాలకూర, ఘాటైన అల్లం-పచ్చిమిర్చి కలయికతో తయారయ్యే ఈ పకోడాలు పైన కరకరలాడుతూ, లోపల నోట్లో కరిగిపోయేంత మృదువుగా ఉంటాయి. పంచ్‌ మెల్ దాల్ పకోడా మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Step by Step Guide to Making the Perfect Panchmel Dal Pakoda Recipe in Telugu

కావలసిన పదార్థాలు

శనగపప్పు - పావు కప్పు
పెసరపప్పు (పొట్టులేనిది) - పావు కప్పు
కందిపప్పు - పావు కప్పు
మసూర్ దాల్ (ఎర్ర కందిపప్పు) - పావు కప్పు
మినపపప్పు - పావు కప్పు
పచ్చిమిర్చి - 2 లేదా 3
నల్ల మిరియాలు - 8 నుండి 10
అల్లం - 2 అంగుళాల ముక్క
గరం మసాలా - 1 టీస్పూన్
సన్నగా తరిగిన పాలకూర - 1 కప్పు
పచ్చి కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

ఆకు కూరల కంటే ఎక్కువ బలం: మోకాళ్లలో గుజ్జు రప్పించి, ఎముకల్ని గట్టిగా చేసే నల్లేరు రోటి పచ్చడి

తయారీ విధానం

-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని, అందులో ఐదు రకాల పప్పులను వేసి రెండుసార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి సుమారు 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టాలి. పప్పులు బాగా నానిన తర్వాత, చుక్క నీరు కూడా లేకుండా పూర్తిగా వడకట్టేయాలి.

-ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని.. నానబెట్టుకున్న పప్పుల మిశ్రమం, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, మిరియాలు వేసి బరకగా రుబ్బుకోవాలి.ఈ మిశ్రమంలో అస్సలు నీళ్లు పోయకూడదు. పకోడాలు కరకరలాడాలంటే పిండి గట్టిగా ఉండటం చాలా ముఖ్యం.

-రుబ్బుకున్న పప్పుల మిశ్రమాన్ని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. అందులో సన్నగా తరిగిన తాజా పాలకూర, కొబ్బరి తురుము, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి చేత్తో బాగా కలుపుకోవాలి. ఈ పిండిని కనీసం 2 నిమిషాల పాటు చేత్తో బాగా గిలకొట్టినట్లుగా కలపాలి. ఇలా చేయడం వల్ల పిండిలో గాలి చేరి, పకోడాలు లోపల గుల్లగా, సాఫ్ట్ గా వస్తాయి.

-ఇప్పుడు స్టవ్ వెలిగించి, డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత, మంటను మీడియం ఫ్లేమ్‌ లో ఉంచి.. పిండిని చిన్న చిన్న పకోడాలుగా నూనెలో వేయాలి. ఇవి అన్ని వైపులా అందమైన బంగారు రంగులోకి మారి, కరకరలాడేలా వేయించుకోవాలి.

-ఎంతో రుచికరమైన పంచ్‌ మెల్ దాల్ పకోడాలు రెడీ.

[ of 5 - Users]
Story first published: Sunday, September 27, 2026, 22:23 [IST]
Desktop Bottom Promotion