For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Teacher's Day 2021 : టీచర్స్ మరియు స్టూడెంట్స్ మధ్య బంధాన్ని ఎలా బలోపేతం చేయాలి..

దేర్ ఈజ్ నో నాలెడ్జ్ వితవుట్ టీచర్స్.. టీచర్స్ ఆర్ ప్రొవైడర్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్ డమ్.. జ్ఞాన సముపార్జనలో భవిష్యత్ నిర్మాణంలో గురువులకు ఉన్న ప్రాధాన్యతను తెలిపేందుకు ఇంతకన్నా అద్భుత పదాలు అవసరం లే

|

భవిష్యత్ నిర్మాతలు ఉపాధ్యాయులు..
భావి భారత పౌరులు విద్యార్థులు..
వీరే మన దేశ ప్రగతి రథ సారథులు..

టీచర్-స్టూడెంట్ రిలేషన్ షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే మన దేశంలో తల్లిదండ్రుల తర్వాత ఓనమాలు నేర్పించిన గురువులకే ఆ స్థానం లభించింది. గురువులను సాక్షాత్తు దైవంగా భావించారు. అందుకే శతాబ్దాల నాటి గురుకులాలైనా.. ఆన్ లైన్ పాఠాలు విపరీతంగా పెరుగుతున్న నేటి ఆధునిక యుగంలో అయినా బోధన ఒక పవిత్రమైన వృత్తిగా విరాజిల్లుతోంది. అందుకే గురువుకు సమాజంలో ఎనలేని గౌరవం ఉంటుంది.

Teachers Day

దేర్ ఈజ్ నో నాలెడ్జ్ వితవుట్ టీచర్స్.. టీచర్స్ ఆర్ ప్రొవైడర్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్ డమ్.. జ్ఞాన సముపార్జనలో భవిష్యత్ నిర్మాణంలో గురువులకు ఉన్న ప్రాధాన్యతను తెలిపేందుకు ఇంతకన్నా అద్భుత పదాలు అవసరం లేదు. అందుకే మన దేశంలో పేరేంట్స్ తర్వాత టీచర్లకు ఆ స్థానం దక్కింది. తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే.. గురువులు వారికి బంగారు భవిష్యత్తుకు మార్గదర్శకులవుతుంటారు.

కానీ ప్రస్తుతం పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని టీచర్-స్టూడెంట్ మధ్య ఆరోగ్యకరమైన సంబంధాన్ని పెంపొందించడానికి ప్రయత్నాలు చేయండి. విద్యార్థి-ఉపాధ్యాయుడు మధ్య బలమైన మరియు ఆరోగ్యకరమైన బంధాన్ని పెంపొందించే కొన్ని చిట్కాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

విద్యార్థులు చేయాల్సినవి..

1) గురువును నమ్మండి..

1) గురువును నమ్మండి..

ఒక విద్యార్థిగా మీరు మీ గురువును అంగీకరించాలి మరియు విశ్వసించాలి. మీకు సహాయపడేందుకు మరియు మీకు ఉత్తమ మార్గదర్శకత్వం ఇవ్వడానికి మీ గురువుకు తగినంత అనుభవం ఉందని మీరు గుర్తించాలి. మీరు మీ గురువును నమ్మకపోతే, మీరు మీ గురువు నుండి ఎటువంటి ప్రయోజనాన్ని పొందలేరు.

2) మీ గురువును గౌరవించండి..

2) మీ గురువును గౌరవించండి..

మీ గురువు మీకు జ్ఞానాన్ని అందించేవాడు. మీ జీవిత లక్ష్యాలను సాధించడానికి మీకు అవసరమైన నైపుణ్యాలను పొందడంలో మీకు సహాయపడతాడు. వారు మీ కోసం కొంత సమయాన్ని త్యాగం చేస్తారు. మీకు ఎలాంటి సందేహాలు వచ్చినా వాటిని తొలగించేందుకు ప్రయత్నిస్తారు. కాబట్టి మీరు మీ గురువును గౌరవించాలి. లేకపోతే మీ గురువు మీకు సహాయం చేయలేకపోవచ్చు. దీని వల్ల మీరు మంచి ప్రదర్శనను ఇవ్వలేరు.

3) గురువు నుండి సహాయం పొందండి..

3) గురువు నుండి సహాయం పొందండి..

మీరు ఏదైనా సమస్యను పదే పదే అడగడంలో తప్పులేదు. మీ గురువుకు మీరు ఎన్నిసార్లు అడిగినా అది ప్రశ్న విషయానికి సంబంధించింది, కాబట్టి సమస్యను అర్థం చేసుకోవడానికి, మరియు దానికి పరిష్కారం కనుగొనేందుకు మీ ఆసక్తి చూసిన గురువు మీకు స్పష్టత ఇచ్చేందుకు, సమస్యకు పరిష్కారం కనుగొనడంలో కచ్చితంగా సహాయపడతారు. కానీ మీరు మీ సందేహాలను మరియు సమస్యలను గురువును అడగకపోతే, మీ గురువు మీరు ఏమి చేస్తున్నారో తెలుసుకోలేరు.

4) మీ గురువుకు సహాయం చేయండి..

4) మీ గురువుకు సహాయం చేయండి..

మీ గురువు పాఠశాల/కళాశాలలో కొత్తగా ఉండొచ్చు. అతను/ఆమె అన్ని విషయాల గురించి మరియు మీ ఎక్సర్ సైజుల అలవాటు గురించి కూడా తెలియకపోవచ్చు. అలాగే అతను/ఆమె కొన్ని ఇతర సమస్యలు ఉండొచ్చు. అలాంటి సమయంలో మీరు మీ గురువును ఎగతాళి చేయడానికి బదులుగా, మీరు మీ గురుకు సహాయం చేయాలి. మీరు మీ గురువును అంగీకరించకపోతే, వారు కొత్త వాతావరణానికి అడ్జస్ట్ అవడానికి మీరు వారికి సహాయం చేయకపోతే మీరు ఆరోగ్యకరమైన టీచర్-స్టూడెంట్ రిలేషన్ షిప్ ను కోల్పోతారు. మీ గురువుకు సహాయం చేయడం అంటే మీ ఎక్సర్ సైజు అనుభవాల మెరుగుదల కోసం మీ గురువు నిర్దేశించిన నియమాలు మరియు మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి.

టీచర్లు చేయాల్సినవి..

5) ఇంటరాక్టివ్ వాతావరణాన్ని సృష్టించాలి..

5) ఇంటరాక్టివ్ వాతావరణాన్ని సృష్టించాలి..

కఠినమైన లేదా భయపెట్టే ఉపాధ్యయుడిగా ఉండటం వల్ల మీ విద్యార్థులలో మిమ్మల్ని మంచి టీచర్ గా చేయదు. మీ విద్యార్థులు మీతో మాట్లాడే మరియు వారి ఆలోచనలను మీ ముందు ఉంచే వాతావరణాన్ని మీరు సృష్టించాలి మరియు ప్రోత్సహించాలి. వారి ఆలోచనలను ఎగతాళి చేయడానికి లేదా వారిని తిట్టడానికి బదులు, మీరు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి. విషయాలను ఆసక్తికరంగా వివరించాలి. బోధించేటప్పుడు, ప్రశ్నలు అడగడం ద్వారా వారిని పాఠాల్లో నిమగ్నం చేయాలి. మీ ప్రశ్నలకు సమాధానం కనుక్కోమని, అందుకు తగ్గ హింట్ లేదా క్లూలు ఇచ్చి వారిని ప్రోత్సహించాలి.

6) వారి సందేహాలను అనుమతించాలి..

6) వారి సందేహాలను అనుమతించాలి..

ఉపాధ్యాయునిగా మీ విద్యార్థులు ఎటువంటి సందేహాలు లేకుండా వారి సందేహాలను మిమ్మల్ని అడిగేందుకు మీరు అనుమతించాలి. మీరు బోధించే వాటిని మీ విద్యార్థులు అర్థం చేసుకోగలరో లేదో తెలుసుకోవడానికి మీరు వారితో స్నేహపూర్వకంగా మెలగాలి. ఈ విధంగా మీరు ప్రతి విద్యార్థితో కనెక్ట్ అవ్వగలుగుతారు. అప్పుడే మీ బోధనా శైలిని కూడా మెరుగుపరుచుకుంటారు.

7) విద్యార్థులకు అందుబాటులో ఉండిండి..

7) విద్యార్థులకు అందుబాటులో ఉండిండి..

మీ విద్యార్థులు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగడానికి ఇష్టపడుతున్నారని మరియు మరికొంత సమయం అడుగుతున్నారని మీరు భావిస్తే

అలాంటి సమయంలో మీరు విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. మీరు నిర్లక్ష్యం చేస్తే మీ పాఠాలపై అంతగా ఆసక్తి చూపరు. మీరెప్పుడైతే విద్యార్థులకు అందుబాటులోకి వచ్చి ఉంటారో అప్పుడే టీచర్-స్టూడెంట్ రిలేషన్ షిప్ బాగా కనెక్ట్ అవుతుంది. అప్పుడే మీరు వారికి సహాయం చేసిన వారవుతారు. అదే సమయంలో మీ మధ్య ఎల్లప్పుడూ సానుకూల వాతావరణం ఉంటుంది.

8) ప్రతి విద్యార్థిని ప్రత్యేక వ్యక్తిగా చూడండి..

8) ప్రతి విద్యార్థిని ప్రత్యేక వ్యక్తిగా చూడండి..

మనుషులు అనే వారు ఎవరూ సమానంగా ఉండరు. ప్రతి ఒక్కరూ తమదైన మార్గాల్లో భిన్నంగా ఉంటారు. విద్యార్థుల విషయంలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులంతా ఒకేరకంగా ఉండరని మీరు అంగీకరించాలి. వారిలో కొందరు తెలివైనవారు మరియు కష్టపడి పనిచేసేవారు, మరికొందరు చురుకుగా ఉండరు, ఇంకొందరు కష్టపడి పనిచేయడానికి ఇష్టపడకపోవచ్చు. అలాంటప్పుడే ప్రతి విద్యార్థి తన లక్ష్యాలను సాధించడంలో వారికి మీరు సహాయం చేయాలి. ఇందుకోసం మీరు ఒక ప్రత్యేక ప్రణాళికను కలిగి ఉండాలి. దీని వల్ల విద్యార్థులు వారి తర్వాతి కాలంలో మంచి ప్రొఫెషనల్స్ గా మారడానికి సహాయపడుతుంది. అదొక్కటే కాదు, టీచర్లలో, విద్యార్థులలో తమ ఉనికిని చాటుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

English summary

Teachers Day 2019: How Students And Teachers Can Develop A Healthy Student-Teacher Relationship

Being a strict and intimidating teacher won't make you a good teacher among your students. You need to create and promote an environment where your students can interact with you and put their ideas in front of you. Instead of making fun of their ideas or scolding them, you need to be polite and explain the things in a better way. While teaching, engage them by asking questions and encourage them to find a solution to your questions.
Desktop Bottom Promotion