Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Maha Shivratri 2022:శివరాత్రి వేళ ఈ 5 రాశుల వారికి శివుని అనుగ్రహం లభిస్తుందట...!
మహాశివరాత్రి 2022 సందర్భంగా ఈ రాశుల వారికి అద్భుత ఫలితాలొస్తాయట.
హిందువులు పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. హిందూ క్యాలెండర్ ప్రకారం, 2022 సంవత్సరంలో మార్చి 1వ తేదీన అంటే మంగళవారం మహా శివరాత్రి పండుగ వచ్చింది.

ఈ పవిత్రమైన రోజున దేశ వ్యాప్తంగా శివ నామస్మరణతో శివాలయాలు మారుమోగిపోతాయి. శివ భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ మహా పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈరోజున ఈశ్వరుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే, కోరిన కోరికలన్నీ తీరుస్తాడని భక్తులందరి నమ్మకం.

ఇదిలా ఉండగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ ఏడాది శివరాత్రి వేళ ద్వాదశ రాశులలోని కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి.

ముఖ్యంగా ఆ శివుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందట. వీరు కోరుకున్న కోరికలన్నీ త్వరలోనే నెరవేరే అవకాశం ఉందట. ఈ సందర్భంగా శివుని నుండి ప్రత్యేక ఆశీస్సులు పొందే ఐదు రాశిచక్రాలేవో తెలుసుకోండి...

మేష రాశి..
ఈ రాశి వారికి ఈ ఏడాది మహా శివరాత్రి చాలా ప్రత్యేకమైనది. ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఈసారి మీకు కచ్చితంగా ఉండబోతుంది. ఈ నేపథ్యంలోనే మీరు కోరిన కోరికలన్నీ నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

వృషభ రాశి..
ఈ రాశి వారికి ఈ ఏడాది మహా శివరాత్రి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన ఆలుమగలకు సంతానం గురించి ఓ శుభవార్త వినిపించొచ్చు. మీరిద్దరూ ఆ మహా పరమేశ్వరుని అనుగ్రహం పొందడానికి శివలింగంపై స్వచ్ఛమైన నెయ్యి మరియు శమీ ఆకులను సమర్పిస్తే.. శుభ ఫలితాలొస్తాయి.

మిధున రాశి..
ఈ రాశి వారికి ఈ ఏడాది మహాశివరాత్రి వేళ జీవితంలో సానుకూలతలతో పాటు ఆనందాన్ని కూడా తీసుకొస్తుంది. ఈ కాలంలో మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు కొన్ని శుభవార్తలను వినే అవకాశం బలంగా ఉంది. ఆ పరమేశ్వరుని ప్రత్యేక అనుగ్రహం మీకు పుష్కలంగా ఉంటుంది.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు జీవితంలో వచ్చే కష్టాల నుండి విముక్తి పొందాలంటే మహా శివరాత్రి రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుడిని పూజించాలి. ఇలా చేయడం వల్ల మీరు కచ్చితంగా ప్రయోజనం పొందుతారు. త్వరలో మీ కోరిక నెరవేరుతుంది.

సింహ రాశి..
ఈ రాశి వారికి ఈ ఏడాది మహా శివరాత్రి చాలా ప్రత్యేకమైనది. ఈ పవిత్రమైన రోజున శివుని అనుగ్రహం పొందడానికి, మీరు శివలింగానికి నెయ్యి మరియు కుంకుమ కలిపిన ఆవు పాలను సమర్పించాలి.



Click it and Unblock the Notifications