For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విష వాయువులతో విలవిలలాడిపోయిన నగరాలు... పిట్టల్లా రాలిపోయిన జనాలు.. మూగజీవాలు...

విశాఖతో పాటు ఒకే రోజు ఇతర రాష్ట్రాల్లో గ్యాస్ లీకైంది. దీంతో అందరూ ప్రాణాలు అరచేతిన పెట్టుకుని పరుగులు అందుకున్నారు.

|

ఓ వైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కలవరపెడుతుంటే.. మరోవైపు విశాలమైన విశాఖ నగరంతో పాటు ఇతర రాష్ట్రాలలో విషవాయువులు విలయతాండవం చేశాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా, ఫార్మా హబ్ గా చెప్పుకునే విశాఖలో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఎల్ జి పాలిమర్స్ అనే రసాయన కర్మాగారం నుండి గురువారం తెల్లవారు జామున స్టెరిన్ గ్యాల్ లీకయ్యింది.

Major industrial Gas Leak

దీని ప్రభావంతో పది మంది పిట్టల్లా రాలిపోయారు. మూగజీవాలు కూడా ఈ కాలుష్యం దెబ్బకు తట్టుకోలేక ఊపిరిని వదిలేశాయి. అయితే పరిశ్రమల నుండి ప్రమాదకర రసాయనాలు, గ్యాస్ లు లీకైన సమయంలో వాటి తీవ్రత ఎంతలా ఉంటుందో ఇలాంటి ఘటనలు చూస్తే మనకు ఇట్టే తెలిసిపోతోంది. అత్యంత ప్రమాదకరమైన రసాయనాల వాడకంలో నిర్లక్ష్యం వహిస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఇప్పటికే విశాఖ సంఘటనతో పాటు, గతంలో జరిగిన భోపాల్ వంటి ఘటనలను చూస్తే మనకు అర్థమవుతుంది.

విశాఖలో గ్యాస్ లీక్,ఘోర ప్రమాధం స్టైరిన్ అంటే ఏమిటి మరియు ఇది మీఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?విశాఖలో గ్యాస్ లీక్,ఘోర ప్రమాధం స్టైరిన్ అంటే ఏమిటి మరియు ఇది మీఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

విశాఖ తరహాలోనే ఛత్తీస్ ఘడ్ లో..

విశాఖ తరహాలోనే ఛత్తీస్ ఘడ్ లో..

విశాఖ సంఘటనను మరువకముందే ఛత్తీస్ ఘడ్ రాజధాని రాయ్ ఢ్ ప్రాంతంలోని ఓ పేపర్ మిల్లులో గ్యాస్ లీకయ్యింది. దీంతో అందరూ గ్యాస్ లీకేజీ సంఘటనలపై ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అక్కడ ట్యాంకును క్లీన్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయ్యిందట. అయితే ఆ సమయంలో అక్కడ పని చేస్తున్న ఏడుగురు కార్మికులు మాత్రం అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురి పరిస్థితి ప్రమాదకరంగా ఉందట.

తమిళనాడులోనూ..

తమిళనాడులోనూ..

ఈ రెండు ఘటనల నుండి మరువకముందే తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్ ఎల్ సీ) ప్లాంటులో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్ ఎల్ సి) నవరత్నాల్లో ఒకటిగా ఉన్న ఈ థర్మల్ పవర్ ప్లాంటులో బాయిలర్ పేలడంతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్లాంటును దట్టమైన పొగలు కూడా ఎగిసి పడ్డాయి. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. షార్ట్ సర్క్యూట్ లేదా అధిక వేడి వల్ల ఒత్తిడికి గురై బాయిలర్ పేలి ఉంటుందని అక్కడి అధికారులు చెప్పారు.

భోపాల్ దుర్ఘటన..

భోపాల్ దుర్ఘటన..

దేశంలో సంభవించిన అతిపెద్ద ప్రమాద సంఘటనల్లో మధ్యప్రదేశ్ రాజధానిలోని భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఒకటి. అక్కడ 1984 సంవత్సరం డిసెంబర్ 2వ తేదీ రాత్రి ఇలాంటి ప్రమాదకర సంఘటన సంభవించింది. అక్కడ యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) పురుగుమందుల ప్లాంటులో మిథైల్ ఐసోసైనేట్ గ్యాస్ (MIC) లీక్ అయ్యింది. దీంతో ఆ విష వాయువు పీల్చిన వారిలో సుమారు 3,787 మంది మరణించారని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు సుమారు ఐదున్నర లక్షల మంది ఈ గ్యాస్ ప్రభావానికి గురైనట్లు 2006లో ప్రభుత్వం తన అఫిడవిట్ లో పేర్కొనడం విచారకరం.

వాయువు ఆయువు తీయొచ్చు..

వాయువు ఆయువు తీయొచ్చు..

ఇలా విషవాయువులు విడుదలైన సమయంలో కళ్లలో మంటలు.. చర్మంపై దద్దర్ల రావడం, ముక్కు ద్వారా శ్వాస పీల్చుకునేందుకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అంతేకాదు అకస్మాత్తుగా బలహీనంగా మారిపోయి.. అలసిపోయి ఎక్కడికక్కడూ మూర్ఛవచ్చి పడిపోవచ్చు.

English summary

Major industrial Gas Leak incidents in India

Here are the major industrial gas leak incidents in India. Take a look
Story first published:Friday, May 8, 2020, 21:02 [IST]
Desktop Bottom Promotion