National Technology Day 2020 : టెక్నాలజీలో మనోళ్లే టాపర్లు...

ప్రస్తుత స్మార్ట్ యుగంలో ప్రపంచంలోని చాలా దేశాలతో పోటీ పడుతోంది. కొన్ని విషయాల్లో ఈ విశ్వానికే మార్గదర్శకంగా కూడా నిలుస్తోంది.

మన దేశంలో ఉన్న వనరులతో.. ప్రపంచంలోని టెక్నాలజీతో కలిపి కరోనా వైరస్ ను కట్టడి చేయొచ్చని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు.

National Technology Day 2020 : History,Significance, Theme and Celebrations

మే 11వ తేదీ జాతీయ సాంకేతిక దినోత్సవంగా ప్రధాని మోడీ భారత శాస్త్రవేత్తలను, ఇంజనీర్లను అభినందించారు. అంతేకాదు షోఖ్రాన్ అణ్వస్త్ర పరీక్షల్లో దేశ చరిత్రలో మరచిపోలేని విజయం సాధించామని గుర్తు చేశారు.

టెక్నాలజీ దినోత్సవం సందర్భంగా ఆ సాంకేతికతను అందించిన వారికి దేశం మొత్తం సెల్యూట్ చేస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా మన దేశానికి చెందిన ఎప్పుడెప్పుడు.. ఎక్కడెక్కడా టెక్నాలజీ పరంగా ఎలాంటి విజయాలు సాధించారో ఇప్పుడు తెలుసుకుందాం...

నాటి ఆనవాళ్లు..

నాటి ఆనవాళ్లు..

భారత భూభాగంలో శాస్త్ర సాంకేతికత గుజరాత్ ప్రాంతంలోని సింధూలోయ నాగరికత నాటి రిజర్వాయర్ల ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తాయి. క్రీస్తు పూర్వం దాదాపు 3 వేళ్ల నాటి తొలి నీటిపారుదల అవశేషాలు కూడా మనకు అక్కడ కనిపిస్తాయి. ప్రపంచంలోనే నీటి పారుదల టెక్నాలజీతో పత్తి, చెరకుతో పాటు కొన్ని పంటలను సాగు చేసింది సింధూ నాగరికత ప్రజలే కచ్చితంగా చెప్పొచ్చు.

అప్పటి టెక్నాలజీ..

అప్పటి టెక్నాలజీ..

సింధూలోయ నాగరికత అంతరించిన తర్వాత కూడా భారత భూభాగంలో ఏర్పడిన వివిధ రాజ్యాలలోని ప్రజలు అప్పటి కాలానికే అసాధారణమై టెక్నాలజీని వాడేవారు. క్రీస్తు శకం నాలుగో శతాబ్దం నుండే వెదురు బొంగులతో వంతెనలు నిర్మించుకునేవారు. చంద్రగుప్త, విక్రమాదిత్యుని కాలంలో అయితే రాతి స్థూపాలను, ఇనుప స్తంభాలను నిర్మించుకునేవారు. ఇది ప్రస్తుతం ఢిల్లీలో ఉండగా, దీన్ని చూసిన సైంటిస్టులు ఇప్పటికీ ఆశ్చర్యపోతుంటారు.

మెట్ల బావులు సైతం..

మెట్ల బావులు సైతం..

అంతేకాదు క్రీస్తు శకం రెండో శతాబ్దం నుండి నాలుగో శతాబ్దం మెట్ల బావులను కూడా భారతీయులు నిర్మించుకున్నారు. సాంకేతిక నైపుణ్యం ద్వారా వజ్రాలను ప్రపంచానికి పరిచయం చేసింది కూడా మన భారతీయులేనట.

తెలుగు రాష్ట్రాల్లోని నదుల్లో..

తెలుగు రాష్ట్రాల్లోని నదుల్లో..

5 వేల ఏళ్ల క్రితమే గోదావరి, క్రిష్ణా, పెన్నా పరివాహక ప్రాంతాల్లో వజ్రాలను వెలికి తీశారనేందుకు ఆధారాలు కూడా ఉన్నాయి. క్రీస్తు శకం 16 శతాబ్దం సమయంలో వజ్రాల గనులకు గోల్కొండ ప్రధాన కేంద్రంగా ఉండేదట. అలాగే నూలు వడికే రాట్నం, పొలం దున్నే నాగలి వంటి పరికరాల తొలిసారిగా రూపొందించిన వారు మన ప్రాచీన భారతీయులేనట. ఇక ‘సున్నా‘ కనుగొన్న భారతీయుడి గురించి మనందరికి తెలిసిందే.

ఆధునిక సాంకేతికత..

ఆధునిక సాంకేతికత..

అయితే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జవహార్ లాల్ నెహ్రూ సారథ్యంలో ఏర్పడిన తొలి ప్రభుత్వం కూడా టెక్నాలజీ ఎడ్యుకేషన్ పై ఎక్కువ శ్రద్ధ చూపింది. అందులో భాగంగానే బెంగాల్ లోని ఖరగ్ పూర్ లో 1951 ఆగస్టు 18న తొలి ఐఐటీని ఏర్పాటు చేశారు. ఆ వెంటనే బాంబే, మద్రాస్, ఢిల్లీ, కాన్పూర్ లలో కూడా ఐఐటీలను ఏర్పాటు చేశారు. అలాగే అప్పట్లో రష్యాతో ఉన్న సత్సంబంధాలతో అంతరిక్ష పరిశోధనల కోసం 1969లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)ను సైతం స్థాపించారు.

ఇస్రో ఇంతింతై..

ఇస్రో ఇంతింతై..

అప్పటి నుండి ఇస్రో ఇంతింతై.. వటుడింతై అన్న చందంగా నాటి నుండి నేటి వరకు ఎంతో మెరుగయ్యింది. 1975లో సాధించిన తొలి ప్రయోగంలోనే విజయం సాధించింది. ప్రస్తుతం ప్రపంచస్థాయి అంతరిక్ష పరిశోధన సంస్థలకు ధీటుగా నిలుస్తోంది. ఇప్పటికే విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపగలిగింది.

అరచేతిలో ప్రపంచాన్ని..

అరచేతిలో ప్రపంచాన్ని..

ఇక అంతర్జాలం ఎప్పుడైతే వచ్చిందో.. అప్పుడే మనకు అరచేతిలో ప్రపంచాన్ని వచ్చేసినట్టయ్యింది. అంతర్జాల విస్తరణతో ఈ విశ్వమే చిన్న గ్రామంగా మారిపోయింది. అయితే అది పని చేయడానికి అత్యంత కీలకమైన ఫైబర్ ఆప్టిక్స్ ను రూపొందించిన వ్యక్తి కూడా మన భారతీయుడే. అమెరికాలో స్థిరపడిన భారత శాస్త్రవేత్త నరీందర్ సింగ్ కపానీ ఆఫ్టికల్ ఫైబర్ కేబుల్స్ ను రూపొందించారు.

ఇంకా ఎన్నో..

ఇంకా ఎన్నో..

అంతే కాదండోయ్.. ప్రస్తుతం మనం డెస్క్ టాప్, ల్యాప్ టాప్, ట్యాబ్, స్మార్ట్ ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్లలో విరివిగా వాడుతున్న యూనివర్సల్ సీరియల్ బస్( యూఎస్ బి) రూపకర్త కూడా మన భారతీయుడే. అజయ్ భట్ అనే భారత శాస్త్రవేత్త అమెరికాలో 1996లో యూఎస్ బీని రూపొందించారు. తర్వాతి కాలంలో ఇది అప్ డేట్ అవుతూ వస్తోంది. వీటితో పాటు హాట్ మెయిల్ , కంప్యూటర్ టెక్నాలజీలో విప్లవాత్మకమైన మార్పుల కోసం భారతీయులు ఎంతగానో దోహదపడ్డారు.

Desktop Bottom Promotion