Latest Updates
-
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా? -
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.! -
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.! -
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.! -
పంద్రాగ్రస్ట్ స్పెషల్.. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ పాత్రలో చాలా ఈజీగా తిరంగా కేక్.!
OMG : ఆత్మలతో ఆ కార్యమే కాదు... పిల్లల్ని కూడా కనాలని ఉందంట ఆమెకు...
ఆమె 15 ఆత్మలతో ఆ కార్యం చేయడమే కాదు.. వాటితో పిల్లల్ని కూడా కనాలని ఉందని అంటున్న ఆమె గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మీకు రామ్ గోపాల్ వర్మ(RGV) సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన సినిమాల్లో దెయ్యాలు, ఆత్మలు, భూతాల గురించి సినిమాలు తీసి అందరినీ భయపెట్టేవాడు వర్మ.

తన సినిమాల్లో ఓ ఆత్మ అకస్మాత్తుగా రావడం.. మహిళను బలత్కారం చేస్తున్నట్లు చూపి మనందరినీ భయపెడుతుంటా వర్మ. అయితే ఇలాంటి సంఘటనలు మనకు కేవలం సినిమాల్లో మాత్రమే కనిపిస్తాయి.
నిజ జీవితంలో ఇలాంటివి ఎక్కడా కనిపించవు. అయితే అప్పుడప్పుడు పీడకలలు వస్తుంటాయి. కానీ అవి నిజంగా ఉన్నాయని తెలిస్తే మనం నిజంగా చాలా భయపడతాం.

చాలా మంది ఆత్మలు, దెయ్యాలు, భూతాలు ఉన్నాయమనే అనుమానంతో మాంత్రికుడిని లేదా భూత వైద్యుడిని తీసుకొచ్చి వాటిని బంధించే ప్రయత్నం చేస్తుంటారు.

ఇదిలా ఉండగా ఓ మహిళ మాత్రం దెయ్యాలతో సహజీవనమే చేసిందట. అది కూడా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 15 ఆత్మలతో ఏకాంతంగా గడిపినట్లు చెప్పింది.

అంతటితో ఆగకుండా వాటితోనే సంసార జీవితం గడిపేందుకు డిసైడ్ అయ్యిందట. ఇప్పటికీ ఆమె తన కోరికలను తీర్చుకునేందుకు ఆత్మలనే ఉపయోగిస్తోందట. మానవులతో పోలిస్తే ఆత్మలే ఆ కార్యంలో ఎక్కువ ఎంజాయ్ చేస్తాయని కూడా చెప్పేసింది. ఇంతకీ ఆ మహిళ ఎవరు? ఆమె ఇంకా ఏయే విషయాలు చెప్పిందో ఇప్పుడు తెలుసుకుందాం...

ఆత్మలతో పరిచయం..
మనం సినిమాల్లో దెయ్యాలు లేదా ఆత్మలు మహిళలను రేప్ చేయడం వంటివి చూస్తూనే ఉంటాం. కానీ ఓ మహిళ మాత్రం దెయ్యాలను రెచ్చగొట్టి మరీ ఆ కార్యంలో పాల్గొందట. ఇంతకీ ఆమె ఎవరంటే ఇంగ్లాండుకు చెందిన ఆమెథిస్ట్ రియల్మ్. ఆసీస్ లో ఉన్నప్పుడే ఆత్మలతో పరిచయం పెంచుకుందట.

పురుషుడి ఆత్మ..
ఐటివి ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘‘నేను 15 ఆత్మలతో సెక్సులో పాల్గొన్నాను. ఆస్ట్రేలియాలోని పార్కులో వాకింగ్ చేసే సమయంలో నన్ను ఏదో బలంగా తాకింది. అది ఓ పురుషుడి ఆత్మ అని తెలిసింది. అప్పటి నుండి తనతో చాలా సంవత్సరాలు ఆ రిలేషన్ లో ఉన్నాను'' అని చెప్పింది.

పిల్లల్ని కనాలనే కోరిక..
ఆ పురుషుడి ఆత్మతో రిలేషన్ లో ఉండటమే కాదు.. తనతో కలిసి పిలల్ని కూడా కనాలని కోరిక ఉండేదని చెప్పి ఆమె అందరికీ షాకిచ్చింది. అయితే అది సాధ్యం కాలేదని తెలిపింది.

భర్తతో విడాకులు..
తాను ఆత్మలతో అలాంటి సంబంధం పెట్టుకున్నానని తెలిసి... తన భర్త విడాకులు ఇచ్చేశాడని చెప్పింది. ‘పెళ్లైన కొత్తలో మేమిద్దరం ఓ కొత్త ఇల్లు కొన్నాం. తను ఎప్పుడూ టూర్ అంటూ తిరిగేవారు. దీంతో నేను ఇంట్లో సింగిల్ గా ఉండాల్సి వచ్చేది.

ఆ సమయంలో ఆత్మలతో..
అలాంటి సమయంలోనే నాకు ఆత్మలతో పరిచయం ఏర్పడింది. అవి నాతో పడకగదిలో కోరికలు తీర్చుకునేవి. భర్త ఇంట్లో లేకపోవడం వల్లే నాకు కూడా ఆ అనుభవం వచ్చింది. వాటిని ఆకట్టుకోవడానికి నేను కురచ దుస్తులు వేసుకుని తిరిగేదాన్ని. అయితే ఓ రోజు ఈ విషయం నా భర్తకు తెలిసింది. దీంతో తను నాకు విడాకులు ఇచ్చాడు' అని వివరించింది.

భర్త వదిలేశాడని..
తన భర్త తనను వదిలేశాడని తెలిసి తొలిసారి తనతో సంబంధం పెట్టుకున్న ఆత్మ కూడా ఆమెను వదిలిపోయిందని వెల్లడించింది. ఆ తర్వాత మరో ఆత్మ తనతో ఆ కార్యం మొదలుపెట్టిందని ఆమె పేర్కొంది.

దాదాపు 15 ఆత్మలు..
అయితే ఆ ఒక్కతోనే తాను ఆగకుండా, దాదాపు 15 ఆత్మలతో తాను ఆ కార్యంలో పాల్గొన్నట్లు వివరించింది. స్పిరిచువల్ గైడెన్స్ కౌన్సిల్స్ గా పని చేస్తున్న ఆమె ఆత్మలతో బిడ్డను ఎలా కనాలనే అంశంపై కూడా పరిశోధన చేస్తోందట.

అదెలా సాధ్యమంటే..
ఆమె మాటలు నమ్మేలా లేకపోవడంతో ఆ టివి యాంకర్ ‘అసలు దెయ్యాలు, ఆత్మలు కంటికే కనిపించవు. మీరు ఏకంగా 15 ఆత్మలతో ఆ కార్యంలో పాల్గొన్నానని చెబుతున్నారు. అదెలా సాధ్యం? అని ప్రశ్నిస్తే..

కొత్త అనుభవాలు..
ఆ ప్రశ్నలకు ఆమెథిస్ట్ స్పందిస్తూ.. ‘ఆత్మలతో ఆ కార్యంలో పాల్గొన్న ప్రతిసారీ నాకు కొత్త అనుభవాలు ఎదురయ్యేవి. ఒక్కో ఆత్మ సామర్థ్యం ఒక్కోలా ఉంటుంది. దాన్ని బట్టి నాతో ఎన్ని ఆత్మలు ఆ కార్యంలో పాల్గొన్నాయో అంచనా వేశాను' అని చెప్పింది.

ఎలా తెలిసిందంటే..
‘అసలు ఆత్మలు మీతో సెక్సులో పాల్గొన్నాయని మీకు ఎలా తెలిసింది' అని యాంకర్ అడిగిన మరో ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ.. ‘ఆ సమయంలో నాపై ఏదో బరువు పడుతున్నట్లు అనిపించేది. పురుషులు నాతో కలయికలో పాల్గొన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయో.. ఆత్మలతోనూ అదే ఫీలింగ్ వచ్చేది' అని వివరించింది.

ఎంతవరకు నిజమంటే..
అయితే ఈమె చెప్పే విషయాలు ఎంతవరకు నిజమనేది ఆమెకే తెలియాలి. ఈ విషయాన్ని మీరు నమ్ముతారో లేదో మీ ఇష్టం. కావాలంటే పూర్తి వివరాలకు పైన ఉన్న వీడియోను చూడండి.
All Images : Source



Click it and Unblock the Notifications