Today Rasi Phalalu :ఓ రాశి వారికి చిన్న విషయానికే పార్ట్నర్ తో గొడవలు రావొచ్చు...

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ 'శుభకృత్' నామ సంవత్సరం, ఛైత్ర మాసంలో సోమవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Today Rasi Phalalu

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే, ఈరోజు మీ భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. ఉద్యోగులకు ఈరోజు అదనపు పని కేటాయించొచ్చు. ఈరోజు మీ బాస్ వైఖరి చాలా కఠినంగా ఉంటుంది. మీరు మీ పనిపై పూర్తిగా దృష్టి పెడితే మంచిది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు కుటుంబపరంగా మంచి ఫలితాలను పొందొచ్చు. మీ ఇంటి సభ్యుల నుండి మానసిక మద్దతు ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మెరుగ్గా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ :3

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 7:55 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో ఈరోజు ఉద్యోగస్తులు మంచి ఫలితాలను పొందగలరు. మీరు ఇటీవల ఒక పెద్ద కంపెనీలో కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ చేసినట్లయితే, మీరు సానుకూల సమాధానాన్ని పొందొచ్చు. మరోవైపు, వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు మంచి లాభాలను పొందొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మీకు మంచిగా ఉంటుంది. మీ ఆదాయం పెరగొచ్చు. మీ కుటుంబం జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీరు తల్లిదండ్రుల మద్దతు పొందుతారు. మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించండి. ఈరోజు మీ ప్రియురాలి కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయడానికి ప్రయత్నించండి. ఇది మీ మధ్య ప్రేమను పెంచడంతో పాటు మీ వైవాహిక జీవితంలో సంతోషాన్ని పెంచుతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ :28

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా కొన్ని అడ్డంకులు ఉండొచ్చు. మీకు చెవి ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. మీరు ఈరోజు అనేక సమస్యలను ఎదుర్కోవలసి రావొచ్చు. ఉద్యోగాలు చేసే వ్యక్తులు టీమ్‌వర్క్‌పై దృష్టి పెట్టాలి. అనవసరమైన అహంకారం మీకు మంచిది కాదు. మరోవైపు, ఈరోజు వ్యాపార వ్యక్తులు ఏదైనా ప్రతిపాదనను అంగీకరించే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. మీ ఇంటి వాతావరణం సాధారణంగా ఉంటుంది. డబ్బు లేకపోవడం వల్ల మీ సమస్యలు పెరుగుతాయి.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ :28

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి 11 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారిలో ఫైనాన్స్‌కు సంబంధించి పని చేసే వ్యక్తులు ఈరోజు పెద్ద ఉపశమనం పొందొచ్చు. ఇటీవలి నష్టాలను భర్తీ చేయడానికి మీకు మంచి అవకాశం లభించే అవకాశం ఉంది. అదే సమయంలో, బట్టలు, సౌందర్య సాధనాలు, బొమ్మలు, ఎలక్ట్రానిక్స్ మొదలైన వాటిలో పనిచేసే వ్యక్తులు కూడా ఆశించిన ఫలితాలను పొందొచ్చు. మీ ఇంటి వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపే అవకాశాన్ని పొందొచ్చు. మీకు ఇష్టమైన ప్రదేశానికి మీరు విహారయాత్రకు కూడా వెళ్లొచ్చు. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. అయితే మీ బడ్జెట్ కు మించి ఖర్చు చేయొద్దు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు చాలా రిఫ్రెష్‌గా ఉంటారు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ :12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 3 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారు ఏదైనా ఆస్తిని కొనాలని లేదా విక్రయించాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈరోజు దానికి సరైన రోజు. మీకు మంచి అవకాశం లభించొచ్చు. మరోవైపు, మెడిసిన్‌లో పనిచేసే వ్యక్తులు తమ పనిని ముందుకు తీసుకెళ్లాలి. ఆఫీసులో అక్కడక్కడ ఎక్కువ మాట్లాడటం మానుకోవాలి. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తుల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఈరోజు మీరు డబ్బుకు సంబంధించిన చింతలను వదిలించుకోవచ్చు. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు, మీరు మీ దినచర్యలో యోగా మరియు ధ్యానాన్ని చేర్చుకోవాలి.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ :18

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వ్యాపారులు ఏదైనా పత్రంపై తొందరపడి సంతకం చేయకూడదు. లేకుంటే మీరు భారీ నష్టాన్ని చవిచూడొచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు కోరుకున్న బదిలీని పొందొచ్చు. అలాగే మీ ఆదాయం కూడా పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో చిన్న విషయానికి వాగ్వాదం జరగొచ్చు. కోపంతో అలాంటి పని చేయకపోవడమే మంచిది.భవిష్యత్తులో మీరు పశ్చాత్తాపపడాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ ఆదాయానికి మించి ఖర్చు చేయొద్దు. ఆరోగ్య పరంగా ఈరోజు బలహీనంగా ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ :5

లక్కీ టైమ్ : సాయంత్రం 6:15 నుండి రాత్రి 9 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో ఉద్యోగులకు కార్యాలయంలో ఒక ప్రాజెక్టులో పని చేయడానికి బాస్ మీకు అవకాశం ఇచ్చినట్లయితే, కొంచెం కూడా అజాగ్రత్తగా ఉండకండి. మీ పురోగతి కల త్వరలో నెరవేరుతుంది. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తుల చేతుల్లో నిరాశ ఉంటుంది. కాబట్టి మీరు సానుకూలంగా ఉండాలి. కుటుంబ పరంగా ఒత్తిడికి అవకాశం ఉంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో చాలా మంచి సమయాన్ని గడుపుతారు. ఈరోజు మీ ప్రియమైనవారి మానసిక స్థితి చాలా బాగుంటుంది. ప్రేమ విషయంలో మీరు మంచి ఫలితాలను పొందొచ్చు. మీ శృంగార జీవితంలో స్థిరత్వం ఉంటుంది. మీ భాగస్వామితో మీ అనుబంధం కూడా మెరుగుపడుతుంది. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ :30

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 8 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారిలో ఉద్యోగులకు కార్యాలయంలో ఉన్నత స్థానంలో పనిచేస్తున్నట్లయితే, మీ ప్రవర్తనపై మరింత శ్రద్ధ వహించాలి. మీరు మితిమీరిన కోపంతో ఉండటం మంచిది కాదు. వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. ఈరోజు మీరు చిన్న పొరపాటు చేసినట్లయితే, మీరు పెద్ద నష్టాన్ని ఎదుర్కోవచ్చు. పిల్లల మొండి స్వభావం ఈరోజు మీకు ఇబ్బంది కలిగించొచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు కోపంతో కాకుండా తెలివిగా వ్యవహరించాలి. ఆర్థిక పరంగా ఈజు ఖరీదైనది. గృహ ఖర్చులు పెరగొచ్చు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ :5

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 9 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు గ్రహాల ప్రతికూల ప్రభావాల వల్ల మీ మాటల్లో కఠినత్వం ఉంటుంది. ఈరోజు మీకు మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కూడా వివాదం ఉండొచ్చు. మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, మీరు మీ ప్రయత్నాలను వేగవంతం చేయాలి.మీ పాత పరిచయాల నుండి కూడా మీరు సహాయం తీసుకోవచ్చు. వ్యాపారులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మీ పనిలో సానుకూల మార్పు ఉండొచ్చు. మీ జీవిత భాగస్వామితో పరస్పర అవగాహన మెరుగ్గా ఉంటుంది. మీరు భవిష్యత్తు ప్రణాళికలను కూడా చర్చించొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ :9

లక్కీ టైమ్ : ఉదయం 7:20 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో లక్ష్య ఆధారిత పనులు చేసే వ్యక్తుల పనులన్నీ ఈరోజు సులభంగా పూర్తవుతాయి. మీరు మంచి విజయం సాధించే అవకాశం ఉంది. మరోవైపు వ్యాపారస్తులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. మీరు పెద్దల ఆశీర్వాదంతో పాటు చిన్నవారి మద్దతును పొందుతారు. మీరు వివాహం చేసుకున్నట్లయితే, ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో చాలా మరపురాని సమయాన్ని గడుపుతారు. విద్యారంగంలో పిల్లల పనితీరు మెచ్చుకోదగినదిగా ఉంటుంది. మీరు వారి గురించి గర్వంగా భావిస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు మంచి రోజు అవుతుంది. మీ బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేయడాన్ని తప్పు చేయొద్దు. మీకు ఆరోగ్యం బాగోలేకపోతే విశ్రాంతిపై దృష్టి పెట్టాలి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ :12

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి సాయంత్రం 7 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారిలో విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే, మీరు మరింత కష్టపడి పనిచేయాలి. మీరు మీ గురువుల మార్గదర్శకత్వం కూడా పొందుతారు. మీరు మీ చదువును పూర్తిచేసి, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్నట్లయితే, ఈరోజు కొన్ని శుభవార్తలు అందుకోవడానికి బలమైన అవకాశం ఉంది. వ్యాపారులు పెద్దగా బేరసారాలు చేసే అవకాశం లభిస్తుంది. మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ :16

లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 2:05 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు ఏదైనా పెద్ద పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు కార్యాలయంలో కొన్ని శుభవార్తలను అందుకుంటారు. మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీరు ఉన్నత స్థానాన్ని పొందొచ్చు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. లేకుంటే మీ ప్రియమైన వారు నిర్లక్ష్యం చేయబడతారు. ఈ సమయంలో మీరు మీ ప్రియమైన వారి పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీరు మీ బడ్జెట్ ప్రకారం ఖర్చు చేస్తారు. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ :14

లక్కీ టైమ్ : ఉదయం 4:20 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

Story first published: Monday, April 18, 2022, 5:00 [IST]
Desktop Bottom Promotion