Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
Today Rasi Phalalu :ఓ రాశి నిరుద్యోగులకు ఈరోజు పెద్ద కంపెనీ ఆఫర్ రావొచ్చు...!
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ 'శుభకృత' నామ సంవత్సరం, వైశాఖ మాసంలో ఆదివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారిలో వ్యాపారులు ఆర్థిక లావాదేవీలలో పూర్తి పారదర్శకతను పాటించాలి. ఈరోజు మీకు లాభం పొందే అవకాశం లభిస్తే, తొందరపడకుండా ఉండాలి, లేకుంటే లాభం స్థానంలో నష్టం రావచ్చు. ఉద్యోగులకు ఆఫీసులో పోటీ చాలా పెరుగుతుంది. ఈ సందర్భంలో, మీరు మరింత కష్టపడాలి. మీరు ఉన్నత స్థానానికి చేరుకోవడానికి మీ వంతు కృషి చేయాలి. ఈరోజు మీకు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మరోవైపు మీకు మతపరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు కుటుంబ సభ్యుల నుండి మానసిక మద్దతు పొందుతారు. ఆరోగ్యం విషయానికొస్తే, మీకు గ్యాస్, అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలు ఉండొచ్చు.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ :26
లక్కీ టైమ్ : సాయంత్రం 7 నుండి రాత్రి 8:20 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈరోజు మీ తండ్రి లేదా అన్నయ్య నుండి కొన్ని శుభవార్తలను వింటారు. దీంతో మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీ ప్రియమైన వారితో అద్భుతమైన రోజు అవుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు గొప్పగా ఉంటుంది. కొత్త అవకాశాలొస్తాయి. మీ మూలధనం పెరిగే బలమైన అవకాశం ఉంది. వ్యాపారవేత్తలు తమ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు, ఉద్యోగస్తులు కార్యాలయంలోని సహోద్యోగులతో ఎక్కువగా మాట్లాడటం లేదా సరదాగా మాట్లాడటం మానుకోవాలి. మీ ఆరోగ్యం మెరుగుపడేందుకు బలమైన అవకాశం ఉంది.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ :19
లక్కీ టైమ్ :మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారిలో ఉద్యోగులు కార్యాలయంలో మీ ప్రవర్తన మరియు మాటల పట్ల మరింత శ్రద్ధ వహించాలి. పై అధికారులతో మాట్లాడేటప్పుడు తప్పుడు పదాలు వాడటం మానుకోండి, లేకుంటే అది మీ పురోగతిపై చెడు ప్రభావం చూపుతుంది, అలాగే మీ ఇమేజ్ కూడా చెడిపోతుంది. వ్యాపారస్తులు అనవసరంగా పరుగులు పెట్టాల్సి రావచ్చు. మీరు ఆశించిన ఫలితం రాకపోతే మీరు చాలా నిరాశ చెందుతారు. మరోవైపు మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ :10
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:20 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21
ఈ రాశి వారిలో విదేశీ కంపెనీలో ఉద్యోగం చేసే వారు, మీ పని పట్ల ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దు. ఈరోజు ఒక చిన్న పొరపాటు మీకు చాలా నష్టాన్ని కలిగిస్తుంది. కలప, ఇనుము, ప్లాస్టిక్, పాడి, మందులు మొదలైన వాటికి సంబంధించిన పనులు చేసే వ్యక్తులు మంచి లాభాలను పొందుతారు. మీ వ్యాపారం పుంజుకుంటుంది. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ తండ్రికి ఆరోగ్య సమస్యలు రావచ్చు. చిన్నపాటి సమస్య వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. మరోవైపు ఈరోజు మీరు మీ బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఖర్చు చేయాలి. ఇంకోవైపు గర్భిణీ స్త్రీలు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు మెట్లు దిగేటప్పుడు మరియు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ :6
లక్కీ టైమ్ :ఉదయం 7:50 నుండి రాత్రి 8:18 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):
ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. ఉద్యోగులకు ఆఫీసులో ప్రతికూలంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో, మీ చిన్న పనిని కూడా జాగ్రత్తగా చేయండి. వ్యాపారస్తులు ఏదైనా పేపర్ వర్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ చిన్న పొరపాటు మీకు పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. మీ ఇంటి వాతావరణం చక్కగా ఉంటుంది. మీరు మీ పిల్లలతో ఎక్కువ సమయం గడపాల్సి ఉంటుంది. ఈ సమయంలో వారికి మీ మార్గదర్శకత్వం అవసరం. ఈరోజు మీరు వారి విద్య మొదలైనవాటికి చాలా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామికి మానసిక మద్దతు లభిస్తుంది. మీరు చాలా కాలంగా ఏదైనా శారీరక సమస్యతో బాధపడుతున్నట్లయితే, మీరు వైద్యుడిని సంప్రదించాలి.
లక్కీ కలర్ : రోజ్
లక్కీ నంబర్ :4
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12:55 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారిలో వ్యాపారవేత్తలు మీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి బ్యాంకు నుండి రుణం తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈరోజు దానికి మంచిగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మీ కృషి ఫలించి విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మీకు మంచిగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో శృంగారపరంగా మంచిగా ఉంటుంది. మీ ప్రియమైన వారు మీ కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయగలరు. ఆరోగ్యంగా ఉండాలంటే, ఆందోళనకు దూరంగా ఉండాలి.
లక్కీ కలర్ : డార్క్ రెడ్
లక్కీ నంబర్ :17
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారు చాలా కాలంగా వెన్నునొప్పితో బాధపడుతుంటే, మీ దినచర్యలో వ్యాయామాన్ని చేర్చుకోవడం మంచిది. రోజూ తేలికపాటి వ్యాయామం చేయండి. దీని వల్ల మీరు కచ్చితంగా ఉపశమనం పొందుతారు. ఈ సమయంలో ఉద్యోగులు ఓపికగా పని చేయాలి. మీరు ఎంత కష్టపడి పనిచేసినా ఆశించిన ఫలితం రాకపోతే, తొందరపడకండి. సరైన సమయం వచ్చినప్పుడు మీరు కచ్చితంగా పురోగమిస్తారు. వ్యాపారస్తులకు పెద్ద ఒప్పందాలు చేసుకునే అవకాశం లభిస్తుంది. మీరు త్వరలో మీ వ్యాపారంలో సానుకూల మార్పులను చూస్తారు. ఆర్థిక సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. ఈరోజు మీరు మానసికంగా మెరుగ్గా ఉంటారు. మీ ఇంటి వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. మీరు పిల్లలతో మంచి సమయం గడుపుతారు.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ :29
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:20 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారిలో నిరుద్యోగులకు ఉద్యోగం గురించి కొన్ని శుభవార్తలు వినిపించొచ్చు. మీరు పెద్ద కంపెనీకి ఇంటర్వ్యూ కోసం వెళ్లొచ్చు. మీ సన్నాహాల్లో ఎలాంటి గ్యాప్ వదలకండి. మీరు విజయం సాధించే అవకాశం ఉంది. మరోవైపు, ఈరోజు వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులకు కొంత సవాలుగా ఉంటుంది. మీ వ్యాపార ప్రణాళికలలో ఏదైనా పెద్ద అడ్డంకి ఉండొచ్చు. మరోవైపు మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో చాలా మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 40
లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు చాలా అదృష్టకరమైన రోజు, ముఖ్యంగా మీరు ఇంజనీరింగ్ చదువుతున్నట్లయితే, మీరు కొంత పెద్ద విజయాన్ని పొందొచ్చు. మరోవైపు, వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులు ఈరోజు మంచి లాభాలను పొందొచ్చు. మీరు బంగారం మరియు వెండి వ్యాపారం చేస్తే, అకస్మాత్తుగా మీరు పెద్ద లాభం పొందే అవకాశం ఉంది. ఇది కాకుండా, వస్త్ర వ్యాపారులు కూడా ఆశించిన ఫలితాలను పొందొచ్చు. ఈరోజు, మీరు మీ జీవిత భాగస్వామితో ఒక చిన్న విషయానికి విబేధించొచ్చు. మీరు మీ కోపాన్ని నియంత్రించుకోకపోతే, మీ మధ్య ద్వేషం పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మీకు మంచిగా ఉంటుంది. మీకు కాలేయానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే, జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 10
లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి రాత్రి 10 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు కోపం మరియు ఒత్తిడికి దూరంగా ఉండాలి. చిన్న విషయాలతో మీ మానసిక స్థితిని చెడగొట్టడం మానుకోండి. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. వ్యాపారులు డబ్బు విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండాలి. మీ శృంగార జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. మరోవైపు మూడవ వ్యక్తి జోక్యం కారణంగా మీ భాగస్వామితో మీ సంబంధం క్షీణించవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది.
లక్కీ కలర్ : లైట్ రోజ్
లక్కీ నంబర్ : 34
లక్కీ టైమ్ : ఉదయం 5:25 నుండి మధ్యాహ్నం 2:15 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారికి ఈరోజు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందొచ్చు. గ్రహాల యొక్క శుభ స్థానం మీకు కొంత గొప్ప ప్రయోజనాలను ఇస్తుంది. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే, మీరు మంచి ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంది. అదే సమయంలో ఉద్యోగస్తుల ఆదాయాన్ని కూడా పెరిగే అవకాశం ఉంది. మీరు ఇటీవల పదోన్నతి పొందినట్లయితే, మీరు మరింత కష్టపడాలి. ఆర్థిక పరంగా ఈరోజు బలంగా ఉంటుంది. మీరు షాపింగ్ మొదలైనవాటి కోసం ప్లాన్ చేస్తుంటే, ఈరోజు దానికి సరైన రోజు. మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీ తల్లి ఆరోగ్యం మెరుగుపడటం వల్ల మీ ఆందోళనలు దూరమవుతాయి. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, ఈరోజు మీరు చాలా ఫ్రెష్‌గా మరియు రిలాక్స్‌గా ఉంటారు.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ :10
లక్కీ టైమ్ :మధ్యాహ్నం 1:55 నుండి సాయంత్రం 6:50 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారిలో ఫైనాన్స్‌కు సంబంధించి పని చేసే వ్యక్తులకు ఈరోజు శుభవార్తలు రావొచ్చు. ఉద్యోగులు ఆఫీసులో, మీ పనిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. అంతే కాకుండా మీరు ఎక్కువ టెన్షన్ పడకుండా ఉండాలి. లేదంటే మీ ఆరోగ్యం క్షీణించొచ్చు. ఈరోజు మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. తల్లిదండ్రుల మద్దతు ఉంటుంది. పిల్లల వైపు నుండి ఆనందం ఉంటుంది. డబ్బు విషయంలో ఎక్కువగా తొందరపడకండి. ప్రత్యేకించి ఎవరికైనా అప్పు ఇచ్చే ముందు, మీరు జాగ్రత్తగా ఆలోచించాలి, లేకుంటే మీ డబ్బు చాలా కాలం పాటు నిలిచిపోవచ్చు. ఈరోజు మీరు కీళ్లనొప్పుల వంటి సమస్యలతో ఇబ్బంది పడొచ్చు.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ :12
లక్కీ టైమ్ :ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 12:50 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











