For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా కాలంలోనూ క్రిస్మస్ సెలబ్రేషన్లు హ్యాపీగా చేసుకోవాలంటే.. ఈ పనులు చేయడం మరచిపోకండి...

కరోనా నేపథ్యంలో క్రిస్మస్ వేడుకలను ఎలా జరుపుకోవాలో తెలుసుకుందాం.

|

మన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందని అందరికీ తెలుసు. ఎందుకంటే ఇక్కడ నివసించే వారందరూ అన్ని పండుగలను కలిసిమెలసి జరుపుకుంటారు. అందుకే మన దేశాన్ని ఇతర దేశాలు ఆదర్శంగా తీసుకుంటాయి.

Ways to celebrate christmas during coronavirus in Telugu

మనలో ఎంతో మందికి క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉండే ఉంటారు. ఈ సందర్భంగా వారికి క్రిస్మస్ విషెస్ చెప్పడంతో పాటు.. ఆ పండుగ యొక్క ఆనందాన్ని వారితో మీరు కూడా పంచుకోవచ్చు. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం పండుగలన్నీ కొంచెం మసకబారిపోయినప్పటికీ.. ఇప్పుడిప్పుడే కోవిద్ కేసులు తగ్గుతూ ఉండటంతో..

Ways to celebrate christmas during coronavirus in Telugu

అదేవిధంగా ఈ సీజన్ ల్లో వచ్చే పండుగల ద్వారా కొంత నిరాశను అధిగమించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కరోనా కాలంలో పండుగ వేళ మనందం కాస్త ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడిపేందుకు వచ్చే ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలి.

Ways to celebrate christmas during coronavirus in Telugu

అయితే అదెలా అని ఆలోచిస్తున్నారా? దీని కోసం మీరు ఎక్కువగా చింతించాల్సిన పనిలేదు. అందుకోసం ఏమి చేయాలో మేము మీకు తెలియజేస్తాం.. వాటిలో మీకు నచ్చినవాటితో క్రిస్మస్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు...

Christmas Special : ఈ క్రిస్మస్ కు ఇంట్లోనే ఈజీగా కేక్ ప్రిపేర్ చేసేద్దామా...?

క్రిస్మస్ హౌస్ పార్టీ..

క్రిస్మస్ హౌస్ పార్టీ..

ఈసారి కరోనా మహమ్మారి కారణంగా, ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో ప్రజలందరూ ఎక్కువ సంఖ్యలో బయటకు రావడానికి.. వేడుకలు జరుపుకోవడానికి అనేక ఆంక్షలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ మందితో హాయిగా పార్టీ చేసుకోవడం మంచిది. ఇంట్లోని కుటుంబసభ్యులు, తక్కువ మంది బంధువులతో కలిసి మంచి పాటలు పాడటం, జింగిల్ సాంగ్స్, మంచి ఆహార మెనూ, మీ ప్రత్యేక వ్యక్తులతో కొంచెం సేపు డ్యాన్సు మరియు గాసిప్స్ కుకీలను కాల్చడం వంటివి చేయడం వల్ల మీ క్రిస్మస్ హౌస్ పార్టీని గొప్పగా చేస్తాయి. అలాగే మీరు థీమ్ ఆధారంగా ఈ హౌస్ పార్టీని కూడా గొప్పగా చేసుకోవచ్చు. ఇది పార్టీ యొక్క సరదాను మరింత పెంచుతుంది.

చలి మంటలు..

చలి మంటలు..

క్రిస్మస్ కాలంలో సహజంగా వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి.. మీరు మీ ఇంటి వెనుక లేదా మీ ఇంటి పార్టీలో టెర్రస్ పై చలి మంటలను కాచుకోవచ్చు. దీని ద్వారా కూడా మీరు మీ పార్టీ యొక్క సరదాను రెట్టింపు చేయొచ్చు. అయితే ఈ పార్టీలో కొంతమంది మరియు చాలా ప్రత్యేకమైన వ్యక్తులను మాత్రమే చేర్చాలి. ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాలను ఏ మాత్రం అతిక్రమించకూడదని గమనించాలి.

ఆన్ లైన్ పార్టీ..

ఆన్ లైన్ పార్టీ..

కరోనా కాలంలో మన దగ్గరి స్నేహితులు మరియు బంధువులతో సన్నిహితంగా ఉండేవారందరికీ మనమెంతగానో దూరమయ్యామని తెలుసు. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా అందరూ ఆన్ లైన్ సహాయంతో అందరూ కలిసేందుకు ఓ వేదికను కనుగొన్నాం. అదే ఆన్ లైన్ వేదిక. ఇప్పుడు కూడా మీరు దీన్ని ఉపయోగించుకుని క్రిస్మస్ వేడుకలను నిర్వహించవచ్చు. క్రిస్మస్ జింగిల్స్ మరియు పాటలను ఆస్వాదించడం, కొన్ని ఆన్ లైన్ గేమ్స్ ఆడటం మరియు డ్యాన్స్ పోటీ వంటి వాటి సహాయంతో, ఆన్ లైన్ పార్టీని కూడా ఉత్తేజకరమైన మరియు సరదాగా చేయొచ్చు.

కానుకల పండుగ..

కానుకల పండుగ..

క్రిస్మస్ అంటేనే బహుమతుల పండుగ. శాంటా అందరికీ బహుమతులు అందిస్తారని చాలా మందికి నమ్మకం. చాలా మంది ఈ ఫెస్టివల్ టైమ్ లో తమ బహుమతుల కోసం వేచి చూస్తుంటారు. అందుకే ఈసారి మీరే శాంటా క్లాజ్ గా మారిపోండి. మీ కుటుంబసభ్యులు, స్నేహితులకే కాదు.. రాత్రిళ్లు మురికివాడలకు వెళ్లి అక్కడి పిల్లలకు కానుకలను అందించండి. దీని వల్ల మీకు హ్యాపీగా అనిపిస్తుంది.

అందంగా అలంకరణ..

అందంగా అలంకరణ..

మనలో చాలా మంది ఏ పండుగ వచ్చినా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుని.. మన ఇంట్లోని గదులను అలంకరించుకుంటూ ఉంటాం. అలాగే ఈ క్రిస్మస్ సమయంలో మీరు డెకరేషన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. అయితే ఎప్పటిలాగా కాకుండా.. ఈసారి కొంచెం కొత్తగా.. విభిన్నంగా ప్రయత్నించండి. దీనికోసం క్రాఫ్ట్ స్కిల్స్ ని ఉపయోగించండి.

డిన్నర్ అలా..

డిన్నర్ అలా..

మీరు క్రిస్మస్ కాలంలో పార్టీ చేసుకున్న తర్వాత, మీ మనసుకు ఎవరైతే ఎక్కువగా ఇష్టంగా అనిపిస్తారో.. అలాంటి వారితో కలిసి రొమాంటిక్ క్యాండిల్ లైట్ డిన్నర్ చేయండి. అందులో ఎక్కువగా క్రిస్మస్ స్పెషల్ రెసీపీలు ఉండేలా చూసుకోండి. ఇవన్నీ ఇంట్లో కుదరకపోతే.. మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ రెస్టారెంటుకు వెళ్లినా పర్వాలేదు.

క్రియేటివ్ ఐడియాలతో..

క్రియేటివ్ ఐడియాలతో..

మనలో చాలా మందికి క్రిస్మస్ అనగానే గుర్తుకొచ్చేవి మూడు విషయాలు. అవి ఒకటి క్రిస్మస్ ట్రీ, రెండు శాంటా క్లాజ్.. ముచ్చటగా మూడోది.. అందరికీ ఇష్టమైనది క్రిస్మస్ కేక్. కాబట్టి ఈ క్రిస్మస్ టైమ్ లో మీరు క్రియేటివ్ ఐడియాలతో మీ ఇంట్లోని క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేయండి. దాని కింద కొన్ని గిఫ్టులను కూడా పెట్టండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారిని కూడా ఈ పనిలో భాగం చేయండి. ఇలా చేయడం వల్ల వారికి చాలా ఆనందాన్ని అందించిన వారవుతారు. దీని వల్ల వారి క్రియెటివిటీ కూడా పెరుగుతుంది.

English summary

Ways to celebrate christmas during coronavirus in Telugu

Covid19 Christmas plans: How to celebrate the holidays during Covid-19.
Story first published:Sunday, December 13, 2020, 23:49 [IST]
Desktop Bottom Promotion