For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Christmas Special : ఈ క్రిస్మస్ కు ఇంట్లోనే ఈజీగా కేక్ ప్రిపేర్ చేసేద్దామా...?

Posted By:
|

మరికొద్ది రోజుల్లో క్రిస్మస్ పండుగ.. నూతన సంవత్సరం వచ్చేస్తోంది.. మనమంతా 2020కి గుడ్ బై చెప్పేసి.. 2021 కొత్త సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాం. అయితే ఈ టైమ్ వస్తుందంటే మనలో ఏదో తెలియని కొత్త ఉత్సాహం అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది.ఈ పండుగను కేవలం క్రైస్తవ సోదరులే కాదు అందరూ ఆనందంగా జరుపుకుంటారు. ముఖ్యంగా క్రీస్తు పుట్టాడని నమ్మే వారంతా క్రిస్మస్ రోజున కేక్ కట్ చేసి ఈ పండుగ వేడుకలను జరుపుకుంటారు. ఈ సమయంలో బేకరీలలో కేక్ ధరలు విపరీతంగా పెరిగిపోతుంటాయి.

అంతేకాదు వీటికి ఒక్కసారిగా డిమాండ్ అనేది పెరిగిపోతుంది.మరోవైపు కరోనా మహమ్మారి భయం ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉంది. ఇలాంటి సమయంలో బయటి నుండి కేక్ తెచ్చి కట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారా? మీకు బయటినుండి వచ్చే కేకుపై ఏ మాత్రం అనుమానం ఉన్నా.. మీరు ఇంట్లోనే చాలా ఈజీగా కేకును తయారు చేసుకోవచ్చు. అది కూడా అతి తక్కువ ఖర్చుతోనే. అదెలాగో.. ఆ కేకు తయారీ విధానమేంటో మేము మీకు తెలియజేస్తాం. ఇంకెందుకు ఆలస్యంగా మీ ఇంట్లో మీరే ఓవెన్ లేకుండానే రుచికరమైన కేక్ ను తయారు చేయండి.. మీకు నచ్చిన వారితో ఈ వేడుకలను జరుపుకోండి...

క్రిస్మస్ స్పెషల్: స్పైసీ మొరాకో చికెన్ రెసిపీ

కావాల్సిన పదార్థాలు

కావాల్సిన పదార్థాలు

* ఒక కప్పు మైదాపిండి

* మూడు గుడ్లు

* చక్కెర 3/4 కప్పులు

* బేకింగ్ పౌడర్ - అర స్పూన్

* వంట సోడా - అరస్పూన్

* ఉప్పు - అర స్పూన్

* నూనె - అర కప్పు

* వెనిలా ఎసెన్స్ - అర టీస్పూన్

* పాలు - అర కప్పు

* డ్రై ఫ్రూట్స్ - ఒక కప్పు

* టూటీ ఫ్రూటీస్ - ఒక కప్పు

కేకు తయారీకి..

కేకు తయారీకి..

కేకు తయారీకి ఈ పదార్థాలన్నీ ముందుగా తెచ్చుకోవాలి. దీని ద్వారా మనం ఇంట్లోనే కేకును చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.

కేక్ తయారీ పద్ధతి..

కేక్ తయారీ పద్ధతి..

ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని.. అందులో 1/4 ఉప్పును వేసి లోపలి భాగం మొత్తం వేయాలి. అలా వేసుకున్న తర్వాత.. ఆ కుక్కర్ ను దాదాపు 10 నుండి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ పైన ఉంచాలి.

శిల్పాశెట్టి హెల్దీ క్రిస్మస్ కేక్ ఎలా తయారు చేసిందో చూడండి...

బాగా కలపాలి..

బాగా కలపాలి..

మరోవైపు ఇంకొక బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు మైదాపిండి, ఒకటిన్నర టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అర టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఈ మూడు ఒకదానితో మరొకటి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది.

గుడ్లను పగులగొట్టి..

గుడ్లను పగులగొట్టి..

ఆ తర్వాత మరో బౌల్ తీసుకుని.. దానిలో మూడు గుడ్లను పగులగొట్టి అందులో వేసుకోవాలి. దానిలోకి అర టీ స్పూన్ ఉప్పు.. అరకప్పు నూనె, 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, ఒక కప్పు చక్కెర, అర కప్పు పాలు వేసుకుని ఆ మిశ్రమాన్ని అంతా బాగా కలపాలి. దీన్నంతటిని మిక్స్ జార్ లో వేసుకుని ఒకసారి గ్రైండ్ చేస్తే.. చక్కని పేస్టులా మారిపోతుంది.

ముద్దలుగా ఉండకూడదు..

ముద్దలుగా ఉండకూడదు..

ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా, బేకింగ్ పౌడర్, వంట సోడాల మిశ్రమాన్ని నెమ్మదిగా వేసుకుంటూ వెళ్లాలి. ఆ తర్వాత మొత్తం బాగా కలపాలి. చివరికి ఈ రెండింటి మిశ్రమం పూర్తిగా చిక్కగా వచ్చేలా చూసుకోవాలి. ఎక్కడా ముద్దలుగా ఉండకూడదు. దీనినే Cake Butter అంటారు.

అవి వేసుకుని..

అవి వేసుకుని..

ఇలా తయారైన కేక్ బ్యాటర్ లోకి టూటీ ఫ్రూటీస్ వేసుకుని కలుపుకుంటే మరింత టేస్ట్ పెరుగుతుంది. ఒకసారి కేక్ ప్రిపరేషన్ పూర్తయ్యాక దాన్ని చూస్తే.. అదంతా టూటీ ఫ్రూటీస్ తో నిండిపోయి చాలా కలర్ ఫుల్ గా కనబడుతుంది.

హోల్స్ లేకుండా..

హోల్స్ లేకుండా..

ఆ తర్వాత ఆ కేక్ బ్యాటర్ ని తీసుకుని ఒక పాత్రలో ఉంచాలి. బ్యాటర్ మొత్తాన్ని కేక్ పాత్రలో పోసుకున్న తర్వాత ఎక్కడా కూడా చిన్న హోల్స్ కూడా లేకుండా చూసుకోవాలి. ఇక ఆ బ్యాటర్ పై రకరకాల డ్రై ఫ్రూట్స్ ముక్కలను టాపింగ్స్ గా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇదివరకే వేడి చేసిన ఉంచిన కుక్కర్ లోపలున్న ఉప్పు పైన ఒక ప్లేట్ పెట్టుకుని దానిపైన ఈ కేక్ పాత్రను ఉంచాలి.

పది నిమిషాల పాటు..

పది నిమిషాల పాటు..

దాన్ని లోపల ఉంచిత తర్వాత.. కుక్కర్ మూతను మూసేయాలి. అయితే మీ కుక్కర్ విజిల్ మాత్రం ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుక్కర్ మూత పెట్టిన తర్వాత సరిగ్గా పది నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో మంటను ఉంచాలి. ఆ తర్వాత మరో అరగంట మీడియం ఫ్లేములో బేక్ చేసుకోవాల్సి ఉంటుంది.

కేక్ రెడీ...

కేక్ రెడీ...

తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని.. కుక్కర్ మూత తీసి చూస్తే.. మనం తినాల్సిన కేక్ రెడీ అయ్యుంటుంది. తర్వాత ఆ కేక్ పాత్రని జాగ్రత్తగా కుక్కర్ నుండి బయటకు తీసి.. ముఖ్యంగా ఆ కేక్ పాత్ర నుండి మరింత జాగ్రత్తగా ఒక ప్లేటులో బోర్లిస్తే.. మనకి సర్వ్ చేయడానికి కేక్ రెడీ అయినట్టే..

చూశారు కదా.. ఇంట్లో ఎలాంటి ఈజీగా కేక్ ప్రిపరేషన్ పద్ధతిని. కాబట్టి ఈ క్రిస్మస్, న్యూఇయర్ కు స్వయంగా మీ చేతులతో చేసిన కేక్ ని కట్ చేసి ఆనందంగా వేడుకలను జరుపుకోండి.

[ of 5 - Users]