Jana Gana Mana : జనగణమణ గురించి మీకు ఇది తెలుసా..?

జనగనమణ అధినాయక జయహే భారత భాగ్య విధాతా.. పంజాబ సింధ గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల బంగా.. అని జాతీయ గీతాన్ని మనందరమూ చిన్న వయసులో స్కూల్లో పాడి ఉంటాము. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న ఈ భారతంలో రాష్ట్రాలకతీతంగా, భాషలకతీతంగా ఈ పాటను మనము పాడాము. మే8న విశ్వకవి రబీంద్రనాథ్ ఠాగూర్ మనకు ఈ అద్భుతమైన గీతాన్ని అందించారు. ఈరోజు మే8న ఆయన జయంతి సంధర్భంగా ఆ జాతీయ గీతంపై అనేక విషయాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయ్. వీటిలో రబీంద్రనాథ్ స్వహస్తాలతో రచించిన జనగనమణకు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయ్.

జనగనమణ గీతానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు :

జనగనమణను రబీంద్రనాథ్ ఠాగూర్ ముందుగా బెంగాళీలో రచించారు. తరువాత దీనిని జాతీయ గీతంగా మార్చడానికి విశ్వకవే స్వయంగా దానిని ఆంగ్లంలోకి తర్జుమా చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు షోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.

Rabindranath Tagores written janaganamana song s handwritten english translation gets viral meaning of janaganamana

జనగణమణ గీతాన్ని పాడటానికి మనం మొత్తం 52 సెకండ్ల సమయాన్ని తీసుకుంటాం.

విశ్వకవి రాసిన జాతీయ గీతం నిజానికి ఒక పాటలోని కొన్ని వాక్యాలన్న విషయం మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. భారతో భాగ్యో భిదాతా అని బెంగాల్‌లో పాట ఉంటుంది. దీని నుంచి జాతీయ గీతం జనగనమన అధినాయక జయహే భారత భాగ్య విధాతా అనే గీతం పుట్టింది.

జనగనమణ మొత్తం గీతాన్ని మొట్టమొదటగా 1905లో తత్వబోధిని పత్రికలో ప్రచురితమైంది.

ఈ గీతాన్ని మొదటగా 1911లో డిసెంబర్ 27న జరిగిన కాంగ్రెస్ సభల్లో రబీంద్రనాథ్ ఠాగూర్ స్వయంగా ప్రజల ముందు పాడారు.

1919 ఫిబ్రవరీ 28న జాతీయగీతాన్ని "ద మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా టైటిల్‌ పేరుతో ఆంగ్లంలోకి తర్జుమా చేశారు.

1950 జనవరి 24న ఈ భారత భాగ్యో భిదాతా గీతాన్ని జాతీయ గీతంగా భారత ప్రభుత్వం ప్రకటంచింది.

జాతీయ గీతాన్ని ఎంచుకునే సమయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కీలకంగా వ్యవహరించారు.

జాతీయ గీతాన్ని మొత్తం ఒక పెయింటింగ్‌లో వచ్చేలా ప్రముఖ కళాకారుడు మక్బూల్ ఫిదా హుసేన్ పెయింటింగ్ వేసారు.

జనగణమణ గీతం

జన గణ మన అధినాయక జయహే,
భారత భాగ్య విధాతా!
పంజాబ, సింధు, గుజరాత, మరాఠా,
ద్రావిడ, ఉత్కళ, వంగ!
వింధ్య, హిమాచల, యమునా, గంగ,
ఉచ్చల జలధితరంగ!
తవ శుభనామే జాగే!
తవ శుభ ఆశిష మాగే!
గాహే తవ జయ గాథా!
జనగణ మంగళదాయక జయహే భారత భాగ్యవిధాతా!
జయహే! జయహే! జయహే! జయ జయ జయ జయహే!

జనగణమన గీతం అర్థం

దేశంలోని పంజాబ్, సింధు, గుజరాత్ మహారాష్రకు చెందిన పశ్చిమ తీర ప్రాంతాలు, ద్రావిడ ప్రాంతానికి చెందిన తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, తుళు భాషలకు చెందిన ప్రాంతాలు, తూర్పు తీరంలో ఉన్న ఒడిస్సా ప్రాంతం, ఈశాన్య రాష్ట్రాలతో ఉన్న బెంగాళ్ ప్రాంతం.. యమున గంగా నదులు, ఎగిసి పడే సముద్రాలు, ఇవన్నీ తమ పేరును తలచుకుంటున్నాయ్.. తమ ఆశిస్సులనే కోరుకుంటున్నాయ్.. తమ విజయం గురించే పాడుకుంటున్నాయ్. ఓ ప్రజల మనసులను గెలిచిన అధినాయక. మీకు జయము, మీకు జయు.. ఓ భారత భాగ్య విధాత, మీకు జయము, జయము... అని జనగనమన పాట సారాంశం.

Story first published: Wednesday, May 8, 2024, 14:55 [IST]
Desktop Bottom Promotion