Latest Updates
-
Father's day 2026: ఈ ఫాదర్స్ డే నాడు పిల్లల నుండి తండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు.. -
ఖర్చు లేని హెల్త్ ఇన్స్యూరెన్స్..మీ బంధుమిత్రులకు ఇలా యోగా డే విషెస్ చెప్పండి -
Happy Father's Day 2026: కనిపించే దేవుడు నాన్న..హార్ట్ టచింగ్ ఫాదర్స్ డే విషెస్, కోట్స్, స్టేటస్ లు -
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి -
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా.. -
ఈరోజు సిద్ధి యోగం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
స్లోవేకియా స్పీకర్ కు ప్రధాని మోదీ గిఫ్ట్ గా ఇచ్చిన బీహార్ స్పెషల్ థేకువా..మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
బుధాదిత్య యోగం: ఈ రాశుల వారికి జూన్ 22 వరకు తిరుగేలేదు, భారీ లాభాలు ఖాయం! -
ఆ పురాతన దేవాలయంలో 500 సంవత్సరాలుగా ఒకే పొయ్యి మీద వండుతున్న ప్రసాదం
Upasana Egg Freezing: తన ఎగ్స్ ఫ్రీజ్ చేసిన ఉపాసన.. పెళ్లైన కొత్తలోనే నిర్ణయం..
మెగా కోడలు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, వ్యాపారవేత్త అయిన ఉపాసన తన ప్రెగ్నెంట్ అని ఈ మధ్యే వెల్లడించిన విషయం తెలిసిందే. 2012 సంవత్సరంలో మెగా ఇంటికి కోడలిగా వెళ్లింది ఉపాసన కామినేని. దశాబ్దం తర్వాత వారు తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని ప్రకటించారు ఈ టాలీవుడ్ లవబుల్ కపుల్. తాజాగా తన ప్రెగ్నెన్సీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది ఉపాసన.

'పిల్లలు ఎప్పుడు కావాలో నిర్ణయించుకున్నాం'
పెళ్లికి ముందే ఉపాసన, రామ్ చరణ్ మంచి స్నేహితులు. పెళ్లిన తర్వాత పిల్లలను ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలనే విషయంలో ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఉపాసన తెలిపింది. పెళ్లైన కొత్తలోనే తన ఎగ్స్ ఫ్రీజ్ చేయాలని నిర్ణయించుకుని ఎగ్స్ ను భద్రపరిచినట్లు చెప్పింది. ఎగ్స్ ఫ్రీజ్ చేయాలన్న నిర్ణయం వెనక అసలు కారణాన్ని కూడా ఈ ఇంటర్వ్యూలో ఉపాసన వెల్లడించింది.
'స్థిరపడ్డాకే పిల్లలు కావాలనుకున్నాం'
2012 లో వివాహం అయ్యాక కొత్తలోనే పిల్లల విషయంలో ఇద్దరం కలిసి ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పింది ఉపాసన. అందుకోసం ఎగ్స్ ఫ్రీజ్ చేయాలనుకున్నట్లు వెల్లడించింది. ఎందుకంటే ఆ సమయంలో ఇద్దరం తమ తమ కెరీర్ లపై పూర్తిగా దృష్టి పెట్టాలని భావించినట్లు తెలిపింది. జీవితంలో స్థిర పడాలని, మంచి సంపాదన తర్వాతే పిల్లలు కనాలని ఇద్దరం నిర్ణయించుకున్నట్లు చెప్పింది.
ప్రస్తుతం ఇద్దరం ఎవరి ఫీల్డ్ లో వారు మంచి స్థానంలో ఉన్నామని, మంచి సంపాదన కూడా ఉండటంతో పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వగలమనే నమ్మకం వచ్చిందని చెప్పుకొచ్చింది ఉపాసన. అలా పెళ్లైన దశాబ్దం తర్వాత గర్భం దాల్చినట్లు వివరించింది.
'నేను బిడ్డను మోస్తున్నాను.. తను బాధ్యతలు మోస్తున్నాడు'
తల్లిగా నేను బిడ్డను మోస్తున్నాను.. రామ్ చరణ్ అదే స్థాయిలో బాధ్యతలు మోస్తున్నాడని ఉపాసన తెలిపింది. చెర్రీ బిడ్డను మోయకపోయినప్పటికీ.. గర్భస్థ శిశువును ఎప్పుడూ కాపాడుకుంటున్నాడని చెప్పుకొచ్చింది. తాను బిడ్డను మోస్తుంటే.. తన బాధ్యతలను చెర్రీ తీసుకుంటున్నాడని, డాక్టర్ వద్దకు తీసుకెళ్లడం, డైట్ పర్యవేక్షించడం, వ్యాయామం చేయడం, మానసికంగా ఉల్లాసంగా ఉంచడం లాంటివి చేస్తుంటాడని చెప్పుకొచ్చింది. ఓ బిడ్డకు జన్మనివ్వడంలో తల్లికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో.. తండ్రికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలంది.
'ఈ ఏడాది జులైలో ప్రసవం'
తనకు 2023 జులైలో ప్రసవం అవుతుందని వైద్యులు చెప్పినట్లు ఉపాసన తెలిపింది. ఈ జులైలో తమ జీవితంలోకి ఓ కొత్త వ్యక్తి రాబోతున్నాడని చెప్పింది. ప్రతి ఒక్క తల్లిదండ్రుల్లాగే తామిద్దరం చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నట్లు పేర్కొంది. తన సంస్థ తన ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటుందని చెప్పిన ఉపాసన.. ప్రసవం కోసం ఇన్సూరెన్స్ ను వాడుకోనున్నట్లు చెప్పుకొచ్చింది.



Click it and Unblock the Notifications