Latest Updates
-
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్‌కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.!
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..!
ఆయన పెద్ద కోటీశ్వరుడు..వేల కోట్ల ఆస్తులు, కోరుకుంటే కొండమీద కోతి కూడా దిగి వచ్చే రేంజ్.. సీన్ కట్ చేస్తే రోడ్ల మీద మురికి బట్టలతో భిక్షమెత్తుకుంటూ కనిపించాడు. తన హోదాను, వేల కోట్ల సంపదను, కనీసం సెక్యూరిటీని కూడా పక్కనపెట్టి మురికి బట్టలతో ముంబై వీధుల్లో బిచ్చగాడిలా యాచించారు.
ఇదంతా చదివాక మీకు బిచ్చగాడు సినిమా గుర్తుకు రావచ్చు..కానీ ఇది నిజంగానే ఇప్పుడు జరిగింది. ప్రస్తుతం ఆయన భిక్షాటన చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఆ కోటీశ్వరుడు ఎవరు, ఎందుకు ఆయన రోడ్ల మీద భిక్షమెత్తుకోవాల్సి వచ్చిందనే పూర్తి వివరాలను ఇక్కడ చూడండి.

ముంబైలోని ఘట్కోపర్ ఈస్ట్ బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా.. జైనుల పవిత్ర మాసమైన చాతుర్మాస దీక్షల సందర్భంగా తన గురువు నమ్రముని మహారాజ్ ఇచ్చిన సూచన మేరకు పేదల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలనుకున్నారు. అందుకోసం మేకప్ సాయంతో తన రూపురేఖలను పూర్తిగా మార్చుకున్నారు. చిరిగిన, మురికిగా ఉన్న బట్టలు వేసుకుని, తన ఖరీదైన వస్తువులను ఇంటొలే వదిలేసి.. ఎవరికీ గుర్తుపట్టడానికి వీలులేని విధంగా ఘట్కోపర్ వీధుల్లోకి సాధారణ బిచ్చగాడిలా అడుగుపెట్టారు.
తనలో ఉన్న అహంకారాన్ని పూర్తిగా వీడాలని, పేదవారు రోజూ ఎదుర్కొనే సవాళ్లను, ఆకలి బాధలను స్వయంగా అనుభవించి తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ఒక్కరోజు ఈ సాహసం చేశారు. తన రాజకీయ అధికారం, ధనబలం ఏమీ లేకుండా కేవలం ఇతరుల దయపై ఆధారపడి బతకడం ఎలా ఉంటుందో ఆయన అనుభూతి చెందారు.

గంటల తరబడి ఘట్కోపర్ రోడ్లపై తిరిగిన ఆయనను సుప్రసిద్ధ నాయకుడైనప్పటికీ ఎవరూ గుర్తుపట్టలేదు. ఈ క్రమంలో ఆయనకు హృదయాన్ని హత్తుకునే అనుభవాలు ఎదురయ్యాయి. భిక్షాటన చేయగా ఆయనకు రూ. 20 దొరికాయి. అలాగే, ఆకలితో ఉన్నానని అడగగానే ఓ చిరు వ్యాపారి ఆయనకు ఉచితంగా ఒక సమోసాను ఇచ్చారు. ఈ సంఘటన పరాగ్ షాను ఎంతగానో కదిలించింది. ముంబై ప్రజల మంచి మనసును, పేదల పట్ల వారికున్న దయను ఆయన కొనియాడారు.
వాళ్లను కలిశాక..
భిక్షాటన పూర్తయిన తర్వాత పరాగ్ షా తన మేకప్ తొలగించి, తిరిగి తన ఎమ్మెల్యే రూపంలోకి వచ్చారు. మారువేషంలో ఉన్నప్పుడు తనకు ఎవరైతే సాయం చేశారో, భిక్షం వేశారో అదే ప్రదేశాలకు నేరుగా వెళ్లి వారిని కలిశారు. తన అసలు గుర్తింపును వెల్లడించి వారిని ఆశ్చర్యానికి గురిచేశారు.
వేల కోట్ల ఆస్తులు
2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం పరాగ్ షా ఆస్తుల విలువ అక్షరాలా రూ. 3,383 కోట్లకు పైమాటే. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అగ్రగామిగా ఉన్న ఆయన గతంలో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కార్పొరేటర్‌గా కూడా పనిచేశారు. వేల కోట్ల అధిపతి అయి ఉండి కూడా, ఏమాత్రం ఇగో లేకుండా పేదల కష్టాలను అర్థం చేసుకోవడానికి ఒక ఎమ్మెల్యే స్వయంగా బిచ్చగాడిగా మారడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయన వినయాన్ని, గొప్ప మనసును ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.



Click it and Unblock the Notifications
