వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.!

గణేశుడు అంటే విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు మాత్రమే కాదు. చిట్టి ఎలుకను తన వాహనంగా మార్చుకుని ముల్లోకాలను చుడుతున్న పార్వతీపరమేశ్వరులు ముద్దుల తనయుడు. ఇక, వినాయక చవితి పండుగ వచ్చిందంటే ఉండే సందడి అంతా ఇంతా కాదు. అయితే ఈ పండుగ రోజున చంద్రుడిని చూడకూడదని ఇతిహాసాలు చెబుతున్నాయి. అయితే చిట్టి ఎలుక విషయంలోనూ శాస్త్రాలు కొన్ని విషయాలను విశదీకరిస్తున్నాయి. గణనాథుడికి వాహనంగా ఉన్న మూషికాన్ని ఈ రోజున చూస్తే కలిగే పరిణామాలేంటి తెలుసుకుందాం..

Mouse seen on Vinayaka Chavithi the significant changes will occur in your life

సాధారణంగా పొలాల్లో ఇంటి మూలల్లో తరచూ ఎలుకలు కనపడటం సహజమే. కానీ గణేశ్‌ చతుర్థి రోజున మీరు ఇంట్లో ఎలుకను చూస్తే దాని అర్థమేంటో తెలుసా.. గణపతి వాహనమైన మూషికం ఈరోజున కనిపిస్తే దేనికి సంకేతమే జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

సెప్టెంబర్‌ 17 న కన్యారాశిలోకి సూర్యుడు.. నెల రోజులపాటు మహర్జాతకులు అంటే వీరే.!సెప్టెంబర్‌ 17 న కన్యారాశిలోకి సూర్యుడు.. నెల రోజులపాటు మహర్జాతకులు అంటే వీరే.!

వినాయక చవితి రోజు గణనాథుడి పూజతో పాటు మూషిక వాహనానికి కూడా ప్రత్యేకత ఉంది. మనం చేసే ప్రతి పూజ, ప్రార్థన ఎలుక ద్వారా గణేశుడికి చేరుతుంది. ఈ క్రమంలో ఈ పండుగ రోజున ఎలుక కనిపిస్తే దాని పర్యవసానాలు కనిపించవచ్చని.. అది ఏ పరిస్థితిలో ఎలా కనిపిస్తుందనేది కూడా ముఖ్యమని పండితులు చెబుతున్నారు.

ఇంటి నుంచి బయటకు వెళ్తే..

గణేశ్‌ చతుర్థి రోజున మీ ఇంట్లో నుంచి ఎలుక బయటకు వెళ్లినట్లయితే దానిని శుభ సూచకంగా భావించాలి. దీని అర్థం ఇంట్లో నుంచి పేదరికాన్ని, కష్టాలను తొలగిస్తుందని ఇది సూచిస్తుంది. తద్వారా వినాయకుడి ఆశీస్సులతో మీ ఇంట్లో సంతోషం, శ్రేయస్సు కలుగుతాయి.

Mouse seen on Vinayaka Chavithi the significant changes will occur in your life

తెల్ల ఎలుక కంటపడితే

లంబోదరుడి పండుగ రోజున తెల్ల ఎలుకను చూసినట్లయితే దానిని శుభసూచకంగా చెబుతారు. పాజిటివిటీకి సంకేతంగా భావించే తెల్ల ఎలుకను చూస్తే త్వరలో మీ ఇంట్లోని సమస్యలన్నీ పరిష్కారమవుతాయని అర్థంగా చెబుతారు.

శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.!శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.!

గణపతి విగ్రహం చుట్టూ తిరిగితే

పండుగ రోజున గణేశ్‌ విగ్రహం చుట్టూ ఎలుక తిరుగుతూ కనిపించినట్లయితే దానిని చాలా శుభసూచకంగా భావించాలని పండితులు సూచిస్తున్నారు. మీ పూజకు గణేశుడు సంతృప్తి చెందాడని, సంతోషించాడని అర్థం. ఆయన ఆశీస్సులు మీపై ఉంటాయని సంకేతం.

స్వప్న శాస్త్రం ఏం చెబుతుందంటే..

వినాయక చవితి రోజున మీ కలలో ఎలుక కనిపించినా, ఆ ఎలుక పంజరం నుంచి తప్పించుకుంటున్నట్లు మీరు కలగన్నా అది శుభ సంకేతం. త్వరలో మీరు పెద్ద కష్టం, బాధ నుంచి విముక్తి పొందుతారని ఈ కల సూచిస్తుంది. మీ జీవితంలో ఊహించని సానుకూల మార్పు కనిపిస్తుందని చెబుతుంది. దీని ప్రకారం మీ జీవితంలో ఇలాంటి సంఘటన జరిగినట్లయితే కష్టాల నుంచి బయటపడినట్లే.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Monday, September 14, 2026, 11:25 [IST]
Desktop Bottom Promotion