మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్‌ రైస్‌.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.!

వినాయక చవితి పండుగ పూట ప్రసాదాలు, పూజలతో గడిపేసుంటారు. ఈ లోపే మధ్యాహ్నం అయిపోతుంది. ఇక లంచ్‌లో ఏం చేయాలా అనే హైరానా మొదలవుతుంది. రెండేసి కూరల చొప్పున చేసే టైం, ఓపిక రెండూ ఉండవు. రిస్క్‌ తీసుకోకండి. లంచ్‌లో సులభంగా, టేస్టీగా చేసుకునేలా ఈ కాలీఫ్లవర్‌ రైస్‌ ట్రై చేయండి. మీ ఎనర్జీకి కావాల్సిన పోషకాలు అందడంతో పాటు ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు. కాలీఫ్లవర్‌ రైస్‌ ఎలా చేయాలో చూద్దాం..

Healthy and tasty cauliflower rice for lunch know the ingredients and easy process

కాలీఫ్లవర్‌ రైస్‌ తయారీకి కావాల్సిన పదార్థాలు

కాలీఫ్లవర్‌- 500 గ్రాములు
బాస్మతి బియ్యం- పావు కేజీ
జీలకర్ర- రెండు టీస్పూన్లు
నువ్వులు- టీస్పూన్లు
చింతపండు- కొద్దిగా
కారం- రెండు టీస్పూన్లు
ధనియాల పొడి- రెండు టీస్పూన్లు
వెల్లుల్లి- ఆరు రెబ్బలు
నూనె- మూడు టేబుల్‌ స్పూన్లు
మినప్పప్పు- టీస్పూన్‌
ఆవాలు- టీస్పూన్‌
జీలకర్ర- టీస్పూన్‌
ఉల్లిపాయలు- రెండు
పచ్చిమిర్చి- రెండు
కరివేపాకు- రెండు రెబ్బలు
టమాటాలు- రెండు
ఉప్పు- టీస్పూన్‌
నీళ్లు- కప్పు

ముందుగా తాజా కాలీఫ్లవర్‌ను తీసుకుని పురుగులు లేకుండా కట్‌ చేసుకుని పెట్టుకోవాలి. వేడినీళ్లలో కాస్త ఉప్పు వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత నీళ్లను వడగట్టుకుని కాలీఫ్లవర్‌ ముక్కలను పక్కన పెట్టుకోవాలి. బాస్మతి బియ్యాన్ని కడిగి గంటపాటు నానబెట్టిన తర్వాత అన్నం వండుకోండి.

వినాయక చవితి స్పెషల్‌: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.!

ఇప్పుడు మసాలా సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఇందుకోసం మిక్సీ జార్‌లో నువ్వులు, జీలకర్ర, చింతపండు, కారం, ధనియాల పొడి, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా పొడిలాగా చేసుకోవాలి.

Healthy and tasty cauliflower rice for lunch know the ingredients and easy process

స్టవ్‌పైన పాన్‌ పెట్టుకుని అందులో రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత ఉడికించిన కాలీఫ్లవర్‌ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఐదు నిమిషాల పాటు చిన్న మంటపైన వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి.

అదే పాన్‌లో మిగిలిన నూనె వేసి మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత చిన్నగా కట్‌ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి రంగు మారేవరకు వేయించాలి. తర్వాత చిన్నగా కట్‌ చేసిన కరివేపాకు, రెండు టమాటాలు వేసి మెత్తగా మగ్గించుకోవాలి.

గణేశ్‌ చతుర్థి స్పెషల్‌: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.!

టమాటాలు మగ్గిన తర్వాత సిద్ధం చేసుకున్న మసాలా పొడి వేసి ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి. రుచికి సరిపడా ఉప్పు, కప్పు నీళ్లు వేసి కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో వేయించుకున్న కాలీఫ్లవర్‌ ముక్కలు వేసి మరో ఐదు నిమిషాల పాటు చిన్న మంటపైన ఉడకనివ్వండి.

కాలీఫ్లవర్‌ మసాలా మంచిగా ఉడికిన తర్వాత ఉడికించిన అన్నం వేసుకుని మొత్తం కలగలిపి మరో రెండు లేదా మూడు నిమిషాల పాటు చిన్న మంటపైన మూత పెట్టి ఉంచండి. తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవడమే. టేస్టీ కాలీఫ్లవర్‌ రైస్‌ రెడీ.

[ of 5 - Users]
Story first published: Monday, September 14, 2026, 12:07 [IST]
Desktop Bottom Promotion