Latest Updates
-
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.!
కోల్‌కతా ఫేమస్ టాంగ్రా' డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే..
టాంగ్రా అనేది కోల్ కతాలోని చైనాటౌన్ ప్రాంతం. ఇక్కడి ఇండో-చైనీస్ వంటకాల రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయడానికి లేదా డ్రింక్స్ టైమ్‌లో తినడానికి ఒక అదిరిపోయే స్పైసీ రెసిపీ కోసం చూస్తున్నారా?
అయితే టాంగ్రా స్టైల్ డ్రై చిల్లీ చికెన్ మీకోసమే. ఒక్కసారి రుచి చూశారంటే మళ్లీ మళ్లీ తినాలనిపించేంత అద్భుతంగా ఉంటుంది. దీనిని మీ ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
చికెన్ మ్యారినేషన్ కోసం
బోన్‌లెస్ చికెన్ థైస్ (తొడ మాంసం) - 500 గ్రా
ఉప్పు - 1 టీస్పూన్
గుడ్డు - 1
మైదా - 3 టేబుల్ స్పూన్లు
కార్న్‌ఫ్లోర్ - 5 టేబుల్ స్పూన్లు
వెనిగర్ - 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి రసం - 1 టీస్పూన్
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
సాస్ మిశ్రమం కోసం
డార్క్ సోయా సాస్ - 1 టేబుల్ స్పూన్
రెడ్ చిల్లీ సాస్ - 2 టేబుల్ స్పూన్లు
టొమాటో కెచప్ - ఒకటిన్నర టేబుల్ స్పూన్
ఆయిస్టర్ సాస్ - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - పావు టీస్పూన్
కూరగాయలు, పోపు కోసం
సన్నగా తరిగిన వెల్లుల్లి - ఒకటిన్నర టేబుల్ స్పూన్
సన్నగా తరిగిన అల్లం - 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - 3 లేదా 4
ఉల్లిపాయ - 1
గ్రీన్ క్యాప్సికమ్ - 1
చికెన్ బ్రోత్ పౌడర్ లేదా చికెన్ మసాలా - అర టీస్పూన్
స్ప్రింగ్ ఆనియన్స్ (ఉల్లికాడలు) - 2 టేబుల్ స్పూన్లు
చికెన్ వేయించిన నూనె - 2 టేబుల్ స్పూన్లు
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది!
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో చికెన్ ముక్కలు, ఉప్పు, గుడ్డు, వెనిగర్, వెల్లుల్లి రసం వేసి బాగా కలపండి. ఆ తర్వాత అందులోనే మైదా, కార్న్‌ఫ్లోర్ వేసి ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోండి. పిండి చికెన్ కు కాస్త మందంగా అంటుకుని ఉండాలి.
-స్టవ్ మీద కడాయి పెట్టి, డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేయండి. చికెన్ ముక్కలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి కరకరలాడే వరకు వేయించి పక్కన పెట్టుకోండి. చికెన్ ఎక్స్‌ట్రా క్రిస్పీగా కావాలంటే, వేయించిన ముక్కలను మరోసారి 40 సెకన్ల పాటు నూనెలో వేయించండి.
-ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో సోయా సాస్, చిల్లీ సాస్, కెచప్, ఆయిస్టర్ సాస్ వేసి కలుపుకోండి. రుచి చూసి అవసరమైతే కొద్దిగా ఉప్పు కలుపుకోండి.
-ఇప్పుడు ఒక పెద్ద పాన్ తీసుకుని, అందులో చికెన్ వేయించిన నూనెనే రెండు స్పూన్లు వేసి మంటను హై ఫ్లేమ్ లో ఉంచండి. నూనె వేడెక్కాక అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి 15 సెకన్ల పాటు వేయించండి. వెంటనే ఉల్లిపాయ, క్యాప్సికమ్ ముక్కలు వేసి 45 సెకన్ల పాటు వేగంగా కలుపుతూ వేయించండి. ముక్కలు మెత్తబడకూడదు.
-ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న సాస్ మిశ్రమాన్ని, చికెన్ బ్రోత్ పౌడర్ ను పాన్ లో వేసి కలపండి. వెంటనే వేయించి పెట్టుకున్న క్రిస్పీ చికెన్ ముక్కలను వేసి, సాస్ మొత్తం ముక్కలకు పట్టేలా మంటను హై ఫ్లేమ్‌లో ఉంచి నిమిషం పాటు బాగా టాస్ చేయండి.
-చివరగా సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
