శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.!

విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు, మూషిక వాహనుడు, వినాయకుడి పూజకి సమయం ఆసన్నమైంది. ప్రతియేటా భాద్రపద మాసంలో శుక్ల పక్ష చతుర్థి తిథి నాడు హిందూ సంప్రదాయం ప్రకారం గణేష్‌ చతుర్థిని అత్యంత వైభవంగా, కోలాహలంగా జరుపుతారు. ఈ రోజు ప్రత్యేకంగా గణనాథుడిని ఇంట్లోనే ప్రతిష్ఠించి మూడు, ఐదు, ఏడు ఇలా కొన్ని రోజుల పాటు పూజలు చేసి, నైవేద్యాలు సమర్పించి నిమజ్జనంతో గంగమ్మ ఒడికి సాగనంపుతారు. అయితే ఇంట్లో గణపతిని ప్రతిష్ఠించేటప్పుడు పూజ విధానం కాకుండా స్వామిని ఏ దిశలో ఉంచాలనేది కూడా ముఖ్యం.

According to shastras Lord Ganesha installed at home good direction and timings

వినాయక చవితి రోజు గణేశుడిని ఇంటికి తీసుకువచ్చేటప్పుడు పిల్లలూ, పెద్దలూ చేసే కోలాహలం అంతా ఇంతా కాదు. ఎంతో సంతోషంగా, ఉల్లాసంగా ఇంటికి తీసుకువస్తారు. అయితే గణపతిని ఎక్కడ పడితే అక్కడ ప్రతిష్ఠించకూడదు. శాస్త్రాల ప్రకారం విగ్రహాన్ని పూజించడనికి ఇంట్లో నిర్దిష్టమైన మూల, ప్రదేశాన్ని ఎంచుకోవాలి. శుభ సమయమూ చూసుకోవాలి. మరి ఆ ప్రదేశమూ, శుభప్రదమైన సమయమూ వివరాలు తెలుసుకుందాం.

ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.!ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.!

శుభ ముహూర్తం

గణేశ్‌ చతుర్థి రోజున గణపతి ప్రతిష్ఠాపన, పూజకు సరైన సమయం ఉదయం 11.02 నుంచి మధ్యాహ్నం 1.31 వరకు అనువైనదిగా పండితులు చెబుతున్నారు. మొత్తం శుభ సమయం 2 గంటల 28 నిమిషాలు కాగా.. ఈ సమయంలో ఆచారాల ప్రకారం ప్రతిష్ఠాపన, పూజలు చేయవచ్చు.

శుభప్రదమైన ప్రదేశం, మూల

ఇంట్లో గణనాథుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఈశాన్య దిశను అత్యంత శుభప్రదం, పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ దిశను దేవతలకి నివాస కేంద్రంగా, సానుకూల శక్తి అందించే ప్రదేశంగా విశ్వసిస్తారు. ఈ ప్రదేశంలో విగ్రహం ప్రతిష్ఠించడం ఉత్తమం.

According to shastras Lord Ganesha installed at home good direction and timings

ఒకవేళ మీ ఇంట్లో ఈ దిశలో స్థలం అందుబాటులో లేకపోతే ఉత్తరం, లేదా తూర్పున కూడా విగ్రహ ప్రతిష్ఠాపన చేయవచ్చు. ఈ రెండు దిశలను గణేశుడి పూజలకు శుభప్రదమైనవిగా పరిగణిస్తారు. వినాయకుడిని సరైన దిశలో ఉంచడం ద్వారా ఇంట్లో ప్రతికూలత తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. శాంతి, శ్రేయస్సు నెలకొంటాయి.

మూషిక వాహనంపై బొజ్జ గణపయ్య.. గణేశ్‌ పూజలో ఎలుక ప్రాముఖ్యత, సందేశం ఇదే.!మూషిక వాహనంపై బొజ్జ గణపయ్య.. గణేశ్‌ పూజలో ఎలుక ప్రాముఖ్యత, సందేశం ఇదే.!

ముఖం, పీఠం ఎలా ఉండాలి..

విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో గణేశుడు ముఖం తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలి. అంతేకాకుండా విగ్రహాన్ని నేరుగా నేలపై ఉంచడం పొరపాటు. చెక్క పీఠంపైన ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాన్ని కప్పాలి. తర్వాత దానిపైన కొన్ని బియ్యం పోసి గణపతి బప్పా మోరియా అంటూ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలి. ఇలాంటి సంప్రదాయ పద్ధతులను పాటించినట్లయితే గణనాథుడికి పూర్తిగా గౌరవం ఇచ్చినట్లు. పూజ ఫలితాలు పూర్తిగా అందుతాయి.

వినాయుకిడి విగ్రహాన్ని ఇంట్లో కొన్ని ప్రదేశాలకు దూరంగా ఉంచాలి. బెడ్‌ రూమ్‌, వంటగది, మెట్ల కింద, బాత్‌ రూమ్‌ సమీపాల్లో ఉంచకూడదు. గణనాథుడిని ప్రతిష్ఠించిన ప్రదేశం అత్యంత శుభ్రంగా ఉండాలి. వెలుతురు మంచిగా రావాలి. ఇలాంటి నియమాలను పాటిస్తూ గణపతిని ఇంట్లో ప్రతిష్ఠించి మనసారా భక్తితో పూజించడం ద్వారా పూజలో పరిపూర్ణత ఏర్పడుతుంది.

Story first published: Monday, September 14, 2026, 7:04 [IST]
Desktop Bottom Promotion