Latest Updates
-
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.!
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.!
హిందూత్వ గొప్పదనం ఒక్క భారత్‌లోనే కాదు విదేశాల్లోనూ అక్కడ ప్రజల మనసులకు దగ్గరైపోయింది. ఎంతలా అంటే వారు హిందూ పురాణ, ఇతిహాసాల ప్రాముఖ్యతను తెలుసుకుని సంప్రదాయ పండుగలను సైతం జరుపుకొంటున్నారు. కట్టుబొట్టు, ఆచారవ్యవహారాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంకా ఇక్కడి భాషలను సైతం నేర్చుకుని భారతీయులనే ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని ఇలాంటి ఎన్నో ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ విదేశీయుడి వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

జై హనుమాన్ అనగానే మనకు గుర్తొచ్చేది ఆయన బలం, ధైర్యం, శక్తిసామర్థ్యాలే. రామదూత, పవనసుత నామ ఆంజనేయుడిని తలచుకుంటేనే చాలు ఒళ్లు పులకరిస్తుంది. ఆయన పాటలు మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఇక హనుమాన్ చాలీసా వింటే చాలు ధైర్యం పుట్టుకొచ్చేస్తుంది. కానీ చాలీసా పాడమంటే.. ఆ పదాలు మనకు కంఠస్తం కావడం కొంచెం కష్టమే. చాలా ప్రాక్టీస్ చేయాలి. మరి అలా అంటే విదేశీయుల పరిస్థితి ఏంటి అంటే దానికి ఈ విదేశీ భక్తుడే సమాధానం. హనుమాన్‌కి పరమ భక్తుడైన ఇతను గొంతు వణకకుండా హనుమాన్ చాలీసా పఠించిన తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వీడియో వైరల్ అవుతోంది.

హనుమాన్ చాలీసాను ఎలాంటి సంకోచం లేకుండా, పుస్తకం చూడకుండా, ఎంతో స్పష్టంగా, వేగంగా, ఏకాగ్రతతో ఈ విదేశీయుడు పఠిస్తున్న వీడియో సోషల్ మీడియాలో నెటిజన్ల మనసు దోచుకుంటోంది. సంస్కృత పదాల ఉచ్చారణ ఎంత కష్టమో తెలియనిది కాదు. కానీ అసలు కొంచెం కష్టం కూడా కనబడకుండా పూర్తి ఆత్మవిశ్వాసంతో అతను తన గాత్రాన్ని ప్రదర్శించిన తీరు ఆకట్టుకుంటోంది. ఆంజనేయుడి పట్ల భక్తికి నివ్వెరపోతున్నారు.
కేవలం పదాలను బట్టీపడుతూ వల్లె వేయకుండా, పూర్తిగా భక్తి శ్రద్ధలతో పఠిస్తూ, ముఖ కవళికలు మారుస్తూ ఎంతో ఆసక్తికరంగా పాడటం భారతీయ సంప్రదాయాల పట్ల అతనికి ఉన్న గౌరవానికి అద్దం పడుతోంది. ఈ వీడియోను న్యూరోడైవర్జెంట్_నిక్ అనే ఖాతా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పటికే లక్షల వ్యూస్, లైక్‌లతో దూసుకుపోతోంది. 11వేలకు పైగా కామెంట్లతో నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వీడియోలో అతని పర్ఫామెన్స్ మీరూ చూసేయండి.

ఇక, విదేశాల్లో తెలుగు భాషకూ ఎంతో క్రేజ్ ఉంది. కొందరు విదేశీయులు తెలుగు నేర్చుకుని మాట్లాడటం, తెలుగు సినిమా డైలాగ్స్ చెప్పడం, మన సినిమాల పాటలకు డ్యాన్స్‌లు వేయడం ఇలా ఒక్కటేమిటి వీరు మన తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేస్తే మనకే పోటీ వస్తారు, సినీ ఇండస్ట్రీని ఏలేస్తారు అనేలా నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నారు.



Click it and Unblock the Notifications
