Latest Updates
-
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.!
Viral Video: సాఫ్ట్ వేర్ జాబ్ దండగ..ఈ ఐడియా సూపర్!..పెట్టుబడి లేకుండా 3 గంటల పనితో నెలకు రూ. 70 వేల ఆదాయం
సోషల్ మీడియా పుణ్యమా అని రోజూ ఎన్నో విచిత్రమైన వీడియోలు మన కంట పడుతుంటాయి. వ్యూస్, లైక్స్ కోసం కంటెంట్ క్రియేటర్లు చేసే ప్రయోగాలు ఒక్కోసారి మన మైండ్ బ్లాక్ చేస్తుంటాయి. తాజాగా తానీ ఠాకూర్ అనే ఓ యూట్యూబర్ ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం రిషికేశ్ లో చేసిన ఓ సోషల్ ఎక్స్ పెరిమెంట్ ఇప్పుడు నెట్టింట సెన్సేషన్ గా మారింది. ఎలాంటి పెట్టుబడి లేకుండా, కేవలం భక్తిని ఆధారంగా చేసుకుని ఎంత ఈజీగా డబ్బు సంపాదించవచ్చో ఈ వీడియో కళ్లకు కట్టింది.

అసలేం జరిగిందంటే..
తానీ ఠాకూర్ పక్కా సాంప్రదాయ దుస్తులు ధరించి, చేతిలో పసుపు, కుంకుమ ఉన్న పళ్లెం పట్టుకుని రిషికేశ్ వీధుల్లోకి వెళ్లాడు. దారిన పోయే పర్యాటకులకు, భక్తులకు నుదుటిన ఎంతో భక్తిశ్రద్ధలతో తిలకం దిద్దడం ప్రారంభించాడు. అయితే మొదట్లో అతనికి పెద్దగా స్పందన రాలేదు. చాలామంది బొట్టు పెట్టుకునేందుకు ఆసక్తి చూపలేదు. తొలి గంటలో కేవలం 20 మందికి మాత్రమే బొట్టు పెట్టగలిగాడు. పళ్లెంలో ఒక్క రూపాయి కూడా పడలేదు. దీంతో మహా అయితే ఓ 50, 60 రూపాయలు వస్తాయేమో అని అతను నిరాశపడ్డాడు.
గంగా హారతితో మారిన సీన్..
కానీ, సాయంత్రం ప్రసిద్ధ గంగా హారతి సమయానికి సీన్ మొత్తం రివర్స్ అయింది. హారతి జరిగే ఘాట్ వద్దకు అతను వెళ్లగానే భక్తులు బారులు తీరారు. ఎంతో ఇష్టంగా తమ నుదుటిన తిలకం పెట్టించుకోవడానికి ముందుకొచ్చారు. అతను దేవుడి సేవలో ఉన్నాడని భావించిన భక్తులు.. బొట్టు పెట్టిన తర్వాత ఎవరూ అడగకుండానే తమకు తోచినంత విరాళంగా పళ్లెంలో వేయడం మొదలుపెట్టారు. కొందరు పది, ఇరవై రూపాయలు ఇస్తే.. మరికొందరు ఏకంగా యాభై, వంద రూపాయల నోట్లు సమర్పించారు. ఇలా కేవలం మూడు గంటల వ్యవధిలో దాదాపు 400 మందికి పైగా బొట్టు పెట్టాడు.
మూడు గంటలకే నెల జీతం అంతా?
ఆ తర్వాత కెమెరా ముందుకొచ్చి తానీ ఠాకూర్ తను సంపాదించిన డబ్బులు లెక్కపెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. ఎలాంటి పెట్టుబడి లేకుండా, కేవలం మూడు గంటల్లో అతను ఏకంగా రూ. 2,350 సంపాదించాడు. దీన్ని నెలవారీ ఆదాయంగా లెక్కవేసుకుంటే.. రోజుకు కేవలం 3 గంటలు పనిచేసినా నెలకు దాదాపు రూ. 70,000 వరకు సంపాదించవచ్చని అతను వివరించాడు. ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ప్రజలు ఎంత సులభంగా డబ్బులు ఇస్తారో నిరూపించడానికే తాను ఈ ప్రయోగం చేసినట్లు చెప్పాడు.
నెటిజన్ల రియాక్షన్ ఇదే..
ప్రస్తుతం ఈ వీడియోకు 4 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు దీన్ని ఫన్నీగా తీసుకుని, ఈ సమ్మర్ ఇంటర్న్ షిప్ కు నేను కూడా అప్లై చేస్తా బాస్?..ఇది సూపర్ బిజినెస్ ఐడియా అని జోకులు పేలుస్తున్నారు. మరికొందరు మాత్రం ఘాటుగా విమర్శిస్తున్నారు. మతం అనేది ఇప్పుడు ఒక లాభదాయకమైన వ్యాపారం, అమాయక ప్రజల భక్తిని కూడా ఇలా ఆదాయ మార్గంగా మార్చేస్తున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా, ఈ వీడియో మాత్రం ఇప్పుడు ఇంటర్నెట్ వేదికగా పెద్ద చర్చకే దారి తీసింది.



Click it and Unblock the Notifications
