Mass Extinction: ఆరో యుగాంతంపై హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు, ఏం చెబుతున్నారంటే..

భూమిపై ఉన్న జీవరాశి ప్రతి కొన్ని సంవత్సారలకు ఒకసారి దాదాపు 90 శాతం అంతరించిపోతుంది. దీనినే మాస్ ఎక్స్‌టిన్షన్ అంటారు. ఇప్పుడు ఆరోసారి అలా జరగబోతోందని ప్రస్తుతం ఆరో యుగాంతం మధ్యలో ఉన్నామని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు

ఏ సంవత్సరంలో మానవ జనాభా భూమి నిలదొక్కుకోలేనంతగా పెరుగుతుంది? దానికి సమాధానం 1970. ఆ సంవత్సరంలో ప్రపంచ జనాభా 3.5 బిలియన్లు ఉంటుంది ప్రపంచ వన్యప్రాణి నిధి పరిశోధన అంచనా వేసింది. ప్రస్తుతం మనం 2023 సంవత్సరంలో ఉన్నాం. 2023 నాటికి ప్రపంచ జనాభా 8 బిలియన్లు. నేడు అడవి మొక్కలు, జంతువులు నివసించడానికి స్థలాలు లేకుండా పోతున్నాయి.

Scientists saying about sixth mass extinction, earths wildlife running out of places to live

(image: New Scientist)

భూమిపై ఉన్న జీవరాశి ప్రతి కొన్ని సంవత్సారలకు ఒకసారి దాదాపు 90 శాతం అంతరించిపోతుంది. దీనినే మాస్ ఎక్స్‌టింక్షన్ అంటారు. మళ్లీ కొత్తగా జీవరాశి పుట్టుకువస్తుంది. ఇలా ఇప్పటి వరకు 5 సార్లు జరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పుడు మళ్లీ ఆరోసారి అలా జరగబోతోందని ప్రస్తుతం ఆరో యుగాంతం మధ్యలో ఉన్నామని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

డైనోసార్ల ఎలా అంతరించిపోయాయో అచ్చం అలాగే..

డైనోసార్ల ఎలా అంతరించిపోయాయో అచ్చం అలాగే..

(image: Earth Archives)

భూమిపై మనుషుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఎంతలా అంటే అడవులను నాశనం చేసి మరీ నివాసాలు ఏర్పాటు చేస్తున్నారు. దీని వల్ల ఇతర ప్రాణులకు నివాస ప్రాంతాలు లేకుండా పోతున్నాయి. చెట్లను కూడా కొట్టేస్తుండటంతో చాలా జాతులు అంతరించిపోయాయి. ఉన్నవాటికి కూడా భూమిపై మంచి స్థలం దొరకడం లేదు. 1970 నాటికి భూమి భరించలేనంత మంది మనుషులు ఉంటారని అప్పట్లో శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అంటే 350 కోట్ల మంది మనుషులు ఉంటేనే భూమి తట్టుకోలేదని చెప్పారు.

అలాంటి 2023 లో ఉన్నాం మనం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల మందికి పైగా మనుషులు ఉన్నారు. 50 ఏళ్లల్లో రెట్టింపు కంటే ఎక్కువే పెరిగారు. ఇంత మంది మనుషులు ఉండటం వల్ల వన్యప్రాణులకు, చెట్లకు భూమిపై స్థలం లేకుండా పోతోంది.

ఆరున్నర కోట్ల సంవత్సరాల క్రితం ఇలాగే జరిగింది. అప్పట్లో ఉండే రాక్షస బల్లులన్నీ అంతరించిపోయాయి. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

5 భూములు కావాలి:

5 భూములు కావాలి:

(image: The Independent)

ప్రస్తుతం భూమిపై 800 కోట్లకు పైగా మనుషులు ఉన్నారు. జనాభా పెరుగుతున్న కొద్దీ అడవులు, చెరువులు, నదులు అన్నీ కనుమరుగు అవుతున్నాయి. అడవుల్లో జీవించే జీవులకు సరిపడా అడవి ఉండటం లేదు. అడవులను ఆక్రమించే వెలుస్తున్న గ్రామాల్లోకి తరచూ వన్య ప్రాణాలు వచ్చేది అందుకే.

వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ప్రకారం గత 50 సంవత్సరాల్లో భూమిపై 69శాతం జీవులు అంతరించిపోయాయి.

భూమిపై మనుషులతో పాటు వన్యప్రాణాలు, చెట్లు అన్నీ సక్రమంగా జీవనం సాగించాలంటే ఇప్పుడు జనాభాకు కనీసం 5 భూములు కావాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఒకవంతులో 70శాతం మనుషులే ఆక్రమించారు:

ఒకవంతులో 70శాతం మనుషులే ఆక్రమించారు:

భూమిపై దాదాపు మూడో వంతు సముద్రమే ఉంటుంది. మిగిలిన ఒక వంతు మాత్రమే భూమి ఉంటుంది. ఆ భూమిపై దాదాపు 70శాతానికి పైగా మనుషులే ఆక్రమించారు. కానీ ఈ భూమిపై కేవలం మనుషులే కాకుండా వేలాది ప్రాణులు, చెట్లు ఉన్నాయి. కానీ కేవలం మనుషులే 70శాతానికి పైగా భూభాగాన్ని ఆక్రమించడంతో మిగిలిన వన్యప్రాణులకు, చెట్లకు నిలువ నీడ లేకుండా పోతోంది.

అలాగే తాగే నీటిలోనూ 70 శాతానికి పైగా మనుషులే వాడుతున్నారు. వన్యప్రాణులకు ఉండేందుకు నీడ లేక, తాగేందుకు నీరు లేక చాలా జాతులు అంతరించిపోతున్నాయి.

అడవులేవి, వన్యప్రాణులేవి:

అడవులేవి, వన్యప్రాణులేవి:

పక్షులు, జంతువులూ క్రమంగా తగ్గిపోతున్నాయి. అడవులను ఆక్రమిస్తుండటంతో అడవులూ మాయం అవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో అటవీ విస్తీర్ణం నానాటికీ తగ్గిపోతూ వస్తోంది. అడవులు తగ్గుతున్నాయంటే అందులో ఉండే వన్యప్రాణాలు అంతరించిపోతున్నట్లు అర్థం.

అడవులు, అమెజాన్ నది ఉన్న దక్షిణ అమెరికాలో పరిస్థితి దారుణంగా మారింది. 1970 నుండి ఇప్పటి వరకు 94 శాతం జీవులు అంతరించిపోయాయి.

ఆరో యుగాంతానికి మనుషులే కారణం:

ఆరో యుగాంతానికి మనుషులే కారణం:

ఇప్పటివరకు భూమిపై 5 యుగాంతాలు జరిగాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అగ్నిపర్వతాలు పేలడం, గ్రహశకలాలు పడటం లాంటి కారణాల వల్ల యుగాంతాలు జరగ్గా.. ఆరో యుగాంతానికి మాత్రం మనుషులే కారణమని సైంటిస్టులు చెబుతున్నారు.

Story first published: Wednesday, January 4, 2023, 15:16 [IST]
Desktop Bottom Promotion