Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
ఈ రాశుల వారు రహస్యాలను దాచుకోలేరు, వీళ్లతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిందే
రహస్యం అనే పదం వినగానే కొంత మంది చాలా ఆసక్తి చూపిస్తారు. అది ఏ రహస్యమైనా కానీ కొంత మందిలో ఉత్సుకత ఉంటుంది. రహస్యాలు తెలుసుకుని ఏమీ తెలియనట్టు ఉండే వారు కొందరైతే.. రహస్యం తెలుసుకుని దానిని దాచుకోలేక ఇతరులతో పంచుకునే వారు
రహస్యం అనే పదం వినగానే కొంత మంది చాలా ఆసక్తి చూపిస్తారు. అది ఏ రహస్యమైనా కానీ కొంత మందిలో ఉత్సుకత ఉంటుంది. రహస్యాలు తెలుసుకుని ఏమీ తెలియనట్టు ఉండే వారు కొందరైతే.. రహస్యం తెలుసుకుని దానిని దాచుకోలేక ఇతరులతో పంచుకునే వారు మరికొందరు. వారు మన స్నేహితులు కావొచ్చు, సహొద్యోగులు కావొచ్చు, బంధువులు, కుటుంబసభ్యులు ఎవరైనా కావొచ్చు. వారిలో ఈ రాశుల వారు ఉన్నారేమో తెలుసుకోండి. ఎందుకంటే ఈ రాశుల వారు రహస్యాలను తమలో దాచుకోలేరు.

రహస్యాలు దాచుకోలేని ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

కన్య
కన్య రాశి వారు తమలో రహస్యాలను ఎక్కువసేపు దాచుకుని ఉండలేరు. స్నేహితుల రహస్యాలైనా, బంధువుల సీక్రెట్స్ అయినా వారు ఎక్కువ కాలం దాచలేరు. కన్య రాశి వారికి సీక్రెట్స్ చెప్పాలనుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే.

మేషరాశి
మేషరాశి వ్యక్తులు రహస్యాలను ఎక్కువసేపు రహస్యంగా ఉంచలేరు. రహస్యాలను బహిర్గతం చేస్తుంటారు. మేషరాశి వారికి ఏదైనా సీక్రెట్ చెప్పేముందు వారి గురించి తెలుసుకోండి.

మిథునరాశి
మిథున రాశి వారు ఎక్కువగా కబుర్లు చెబుతుంటారు. మిథున రాశి వారికి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. వారు మాట్లాడటం మొదలు పెడితే అస్సలే ఆపరు. మిథున రాశి వారు ఎక్కువ సేపు రహస్యాలను దాచుకోలేరు.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు తమ విషయాలను, తమ రహస్యాలను ఎవరితోనూ పంచుకోరు. ప్రాణ స్నేహితులకైనా కొన్ని విషయాలను మాత్రమే చెబుతారు. కానీ ఎదుటి వారి రహస్యాలను ఏమాత్రం దాచుకోలేరు. వీలైనంత ఎక్కువ మందికి చెప్పేందుకు ప్రయత్నిస్తారు.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు. సూటిగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. సీక్రెట్స్ కూడా బయటకు చెప్పేస్తారు. స్నేహితుల, బంధువుల రహస్యాలను బహిర్గతం చేసేస్తారు. అయితే సీక్రెట్ చెప్పిన తర్వాత పశ్చాత్తాపపడతారు కానీ అప్పటికే రహస్యం బయటపడిపోతుంది.



Click it and Unblock the Notifications