Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం, వైకుంఠ ఏకాదశి రోజు రూ.7.68 కోట్లు
వైకుంఠ ఏకాదశి రోజు శ్రీవారి ఆలయానికి ఏకంగా రికార్డు స్థాయిలో రూ.7.68 కోట్లు ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది.
వైకుంఠ ఏకాదశి రోజు మహా విష్ణువును దర్శించుకుంటే ఎంతో మంచి జరుగుతుందని, సకల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారా గుండా భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ప్రత్యేక ఉత్తర ద్వార దర్శన సౌభాగ్యం కల్పించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలు భక్తులు పోటెత్తారు.

తిరుమలకు వచ్చిన భక్తులు తమ శక్తి మేర స్వామి వారికి కానుకలు సమర్పిస్తుంటారు. అలా వైకుంఠ ఏకాదశి నాడు తిరుమలు వచ్చిన భక్తులు భారీ స్థాయిలో కానుకలు, విరాళాలు సమర్పించారు.
దీంతో తిరుమల ఆలయానికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది. కరోనా సమయం నుండి పరిమిత సంఖ్యలోనే భక్తులను తిరుమలకు అనుమతించగా అదే స్థాయిలో హుండీ ఆదాయం వచ్చేది. అయితే ఇప్పుడు పరిస్థితులు స్థిమిత పడటంతో భక్తుల రాక పెరిగిపోయింది. దాంతో పాటు హుండీ ఆదాయం పెరుగుతూ వస్తోంది.

రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం:
వైకుంఠ ఏకాదశి రోజు శ్రీవారి ఆలయానికి ఏకంగా రికార్డు స్థాయిలో రూ.7.68 కోట్లు ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది. గతేడాది అక్టోబర్ 23వ తేదీన రూ.6.31 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక హుండీ ఆదాయం రికార్డుగా ఉండేది. కానీ ఇప్పుడు ఏకాదశికి ఆ రికార్డు బ్రేక్ అయింది.

తిరుమల ఆలయానికి వచ్చిన రికార్డు స్థాయి ఆదాయం:
* రూ. 7.68 కోట్లు - జనవరి 2, 2023
* రూ. 6.31 కోట్లు - అక్టోబర్ 23, 2022
* రూ. 6.28 కోట్లు - జులై 27, 2018
* రూ. 5.73 కోట్లు - ఏప్రిల్ 1, 2012
* రూ. 4.23 కోట్లు - జనవరి 1, 2012



Click it and Unblock the Notifications
