Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Viral Videos : రైల్వే కప్లింగ్‌లోకి దూరుతున్న ప్రయాణికులు.. ఇండియన్ రైల్వే వైరల్ వీడియోలు..!
భారత రైల్వేల దుస్థితిని చూపెడుతూ చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో కంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. గత సంవత్సరం ఇదే నెల జూన్‌లో ఒడిస్సాలో బాలాసోర్ ట్రైన్ ప్రమాధంలో చాలా మంది చనిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత రైల్వేలు అస్తవ్యస్తంగా వున్నాయంటూ సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్‌గా మారుతున్నాయ్.

కింద వున్న ఈ వీడియోలో ప్రయాణికులు లోపల రైళ్లో కిక్కిరిసిపోయారు. కనీసం నడవడానికి కూడా స్థలం లేదు. నిలబడే పరిస్థితి కూడా లేదు. అన్ని బెర్తులు నిండిపోవడమే కాకుండా రైలులోని కింద ఫ్లోర్‌పైన కూడా కూర్చొని వున్నారు.
ఇక్కడ మరో వీడియోలో రైలు మధ్యలో వున్న కప్లింగల్‌లోకి కొందరు ప్రయాణికులు దూసుకెళ్లిపోతున్నారు. వారిని అలా వెళ్లవద్దని చెప్పినా కూడా అలాగే వెళ్లడం మనం చూడవచ్చు. ప్రాణాలను ప్రయాణికులు కావాలని అరచేతిలో పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. భోగీలు నిండిపోయినా భోగీల మధ్యలో కూడా దూరి వెళ్లడం నెటిజెన్లను ఆందోళనకు గురి చేస్తోంది.
ఒక ఫారన్ టూరిస్టు భారత రైల్వేల దుస్థితిని కళ్లకు కట్టాడు. ట్రైన్ చూస్తే వందల ఏళ్ల క్రితానికి చెందినదిగా వున్నట్లు తన అభిప్రాయాన్ని చెప్పాడు. ట్రైన్‌లో కూడా వాసన పూర్తిగా కుళ్లిపోయినట్లుగా వస్తుందని తెలిపాడు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని మన భారతీయ రైల్వే నిర్మించింది. దీనినే చినాబ్ రైల్వే బ్రిడ్జ్ అని అంటాము. జమ్ము కశ్మీర్‌లో దీనిని నిర్మించారు. ఇటీవల ఈ రైలు బ్రిడ్జ్ ఎలా పనిచేస్తుందోనని చాలా పరీక్షలు జరుపుతూ వుస్తున్నారు. రైలు ప్రమాదం జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వీడియో కూడా వైరల్‌గా మారుతోంది. దీనిపై కొందరు నెటిజెన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఎంత అభివృద్ధి చెందినా సామాన్యులకు సరైన రేల్వే సేవలను అందించలేకపోతున్నామని భారత రైల్వేను ప్రశ్నిస్తున్నారు.
కొన్ని రైళ్ల పరిస్థితి చూస్తే మరీ దారుణంగా వుంది. ప్రయాణికులు స్వయంగా రైళ్ల రూఫ్ పైన నిద్రించడం చాలా భయాందోళనని కలిగిస్తోంది. ట్రైన్ రూఫ్ పైనే వీరు పడుకొని వుండడం, ఎప్పుడు కిందపడతారోనని తెలియకుండా వుండడం పరిస్థితి తీవ్రతను తెలియచేస్తుంది.



Click it and Unblock the Notifications