Latest Updates
-
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం!
2025లో కూడా అత్యంత పేదరికంలో మగ్గుతున్న 10 దేశాలు ఇవే
ఒకవైపు ప్రపంచం టెక్నాలజీ, డెవలప్ మెంట్ పథంలో పరుగులు పెడుతుంటే.. మరోవైపు కోట్లాది మంది ప్రజలు కనీస అవసరాలైన తిండి, నీరు, విద్య, వైద్యం కోసం ప్రతిరోజూ పోరాడుతూనే ఉన్నారు. 2025 నాటికి కూడా కొన్ని దేశాలలో పేదరికం తీవ్రస్థాయిలోనే కొనసాగుతుందని అంచనాలు చెబుతున్నాయి. యుద్ధాలు, రాజకీయ అస్థిరత, అవినీతి, నిరుద్యోగం, ప్రకృతి వైపరీత్యాలు వంటి సమస్యలు ఈ దేశాలను పట్టిపీడిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత పేదరికంతో సతమతమవుతున్న 10 దేశాల గురంచి ఇక్కడ చూడండి.
సౌత్ సూడాన్: అంతర్యుద్ధం ఛిద్రం చేసిన దేశం
ఈ విషాదకరమైన జాబితాలో అగ్రస్థానంలో సౌత్ సూడాన్ నిలిచింది. ఇక్కడ ఏకంగా 82శాతం మంది జనాభా దారిద్ర్యరేఖకు దిగువన జీవిస్తున్నారంటే ఎంత పేదరికం ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. సంవత్సరాల తరబడి కొనసాగుతున్న అంతర్యుద్ధం దేశ ఆర్థిక వ్యవస్థను, మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేసింది. ఈ దేశంలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారమైనప్పటికీ తరచుగా వచ్చే వరదలు, సాయుధ ఘర్షణలు ప్రజలను నిరాశ్రయులను చేసి వారి బతుకును మరింత కష్టతరం చేశాయి.

ఈక్వటోరియల్ గినియా: సహజ వనరులు శాపంగా మారిన దేశం
అపారమైన చమురు నిక్షేపాలు ఉన్నప్పటికీ ఈ దేశ జనాభాలో 77శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారు. దీనికి ప్రధాన కారణం వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతి, సామాజిక అసమానతలు. సహజ వనరుల ద్వారా వచ్చే సంపద కొద్దిమందికే చేరుతుండటంతో సాధారణ ప్రజలకు విద్య, వైద్యం, ఉద్యోగ అవకాశాలు అందని ద్రాక్షలా మిగిలిపోయాయి.
మడగాస్కర్: ప్రకృతి విధ్వంసం సృష్టించిన సంక్షోభం
ఒకప్పుడు జీవవైవిధ్యానికి స్వర్గధామమైన మడగాస్కర్ లో 75శాతం జనాభా ఇప్పుడు దారిద్ర్యంలో జీవిస్తోంది. రాజకీయ సంక్షోభాలు, అటవీ నిర్మూలన, బలహీనమైన ఆర్థిక వ్యవస్థ ఇక్కడి పేదరికానికి కారణాలు. వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయం తీవ్రంగా దెబ్బతినడంతో ప్రజలు జీవనం సాగించడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
బురుండి: దశాబ్దాల పోరులో నలిగిపోయి
బురుండిలో 74శాతం మంది దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. దీర్ఘకాలిక పౌర సంఘర్షణ, రాజకీయ అస్థిరత దేశ ఆర్థికాభివృద్ధిని కుంగదీశాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు స్వచ్ఛమైన నీరు, పారిశుధ్యం, విద్య వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా అందుబాటులో లేవు.
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్: హింసతో ఛిన్నాభిన్నం
దవాబ్దాల పాటు సాగిన అంతర్యుద్ధం, హింస ఈ దేశాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. ఇక్కడ 68శాతం జనాభా తీవ్ర పేదరికంలో ఉంది. ప్రభుత్వం ప్రాథమిక సేవలను అందించడంలో విఫలమవడంతో ప్రజలు మనుగడ కోసం అంతర్జాతీయ సంస్థలు అందించే సహాయంపైనే ఆధారపడాల్సిన దయనీయ స్థితి నెలకొంది.

హోండురాస్: అవినీతి, హింస
మధ్య అమెరికా దేశమైన హోండురాస్‌లో 64శాతం జనాభా పేదరికంలో ఉంది. తీవ్రమైన అవినీతి, ముఠా హింస, అధిక నిరుద్యోగం ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. దీనికి తోడు తుఫానుల వంటి ప్రకృతి వైపరీత్యాలు పేదల బతుకును మరింత దుర్భరం చేస్తున్నాయి.
జాంబియా: సంపద ఉన్నా
జాంబియాలో రాగి వంటి సహజ వనరులు పుష్కలంగా ఉన్నా ప్రభుత్వ అసమర్థత, ఆర్థిక నిర్వహణ లోపాల వల్ల 60శాత ప్రజలు పేదరికంలోనే ఉన్నారు. అధిక ద్రవ్యోల్బణం, విద్య, వైద్యం వంటి సౌకర్యాల కొరత ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తున్నాయి.

గ్వాటెమాల: అసమానతలే పునాది
గ్వాటెమాలాలో 59శాతం జనాభా పేదరికంలో జీవిస్తోంది. ఇక్కడ పేదరికానికి ప్రధాన కారణం సామాజిక అసమానతలు. భూమి, విద్య, వైద్య సేవలు కొందరికే పరిమితం కావడం, ముఖ్యంగా స్థానిక ఆదివాసీ సమాజాలు అభివృద్ధికి దూరంగా ఉండటం ఈ దుస్థితికి కారణం.
కాంగో: వనరులున్నా కూడా
కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ వజ్రాలు, ఖనిజాలతో సమృద్ధిగా ఉన్నా అంతర్యుద్ధం, అవినీతి, అసమర్థ పాలనతో పీడించబడుతోంది. నిరంతర హింస వల్ల 56శాతం మంది ప్రజలు దారిద్ర్యంలో జీవిస్తున్నారు. విద్యుత్, విద్య వంటి కనీస సేవలు కూడా అందని గ్రామాలు ఇక్కడ వేల సంఖ్యలో ఉన్నాయి.
ఎస్వాటిని : నిరుద్యోగం, అనారోగ్యం
ఈ ఆఫ్రికన్ దేశంలో 58శాతం జనాభా పేదరికంతో పోరాడుతోంది. అధిక నిరుద్యోగం, ఎయిడ్స్ వంటి ఆరోగ్య సమస్యలు, విద్యావ్యవస్థ వైఫల్యం ఇక్కడి పేదరికానికి ముఖ్య కారణాలు. వ్యవసాయంపై ఆధారపడిన ప్రజలకు భూమి, వనరుల కొరత తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని సృష్టిస్తోంది.



Click it and Unblock the Notifications











