Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
మరణించిన తరువాత జరిగేది అదేనా.. సైన్స్ కూడా సమాధానం చెప్పలేకపోతోంది..
మరణించిన తరువాత అసలేమి జరుగుతుందనే ప్రశ్న అనుమానం చాలా మందిని వేధిస్తుంది. శాస్త్రీయంగా మరణించిన తరువాత మనిషి శరీరం మట్టిలో లేదా బూడిదలో కలిసిపోతుంది. కానీ దీనిని ఆస్థికులు, కొందరు మేధావులు ఒప్పుకోవడం లేదు. మనిషి శరీరంలోపల ఆత్మ ఉంటుందని అది మళ్లీ జన్మ తీసుకుంటుందని అంటారు. మరికొందరు అది వేరే లోకాలకు ప్రవేశిస్తుందని చెబుతున్నారు.

కర్మలు
మనిషి తన జీవితంలో చేసిన పనులనప్నీ కలిసి కర్మలుగా మనిషి మరణించే సమయానికి అతనితో ఉంటాయ్. ఒక్కసారి మనిషి మరణించాగే శరీరం కుళ్లిపోవడమో, కాలిపోవడమో జరుగుతంది కానీ శరీరం లోపల ఉన్న ఆత్మ లేదా ప్రాణం వేరే శరీరంలో ప్రవేశించడానికి కొత్తగా మరో గర్భాన్ని వెతుక్కుంటుందని ఇషా యోగా సెంటర్ వ్యవస్థాపకులు జగ్గీవాసుదేవ్ చెబుతున్నారు. హిందూ పురాణాల్లో కూడా చెప్పింది కూడా ఇదే. భగవద్గీతలో స్పష్టంగా శ్రీకృష్ణుడే స్వయంగా చెబుతాడు. ఒక శరీరం పాత వస్త్రాలను విడిచి కొత్త వస్త్రాలను ఎలాగైతే ధరిస్తుందో అలాగే ఆత్మ కూడా ఒక శరీరాన్ని విడిచి వేరే శరీరంలోకి ప్రవేశిస్తుందని చెబుతాడు.
వేరే శరీరం కోసం వెతుకులాట
జీవితాన్ని ప్రశాంతంగా పూర్తి చేసుకొని మరణించినవారు వెంటనే మళ్లీ పుట్టడానికి వేరే శరీరాన్ని వెతుక్కుంటారు. కానీ అనుకున్న కోరికలు తీరకుండా, తీవ్రమైన బాధలో మరణించిన వారి ఆత్మలు వేరే శరీరంలోకి ప్రవేశించడానికి సమయం తీసుకుంటుందని, అలాంటి ఆత్మలనే దయ్యాలుగా పరిగణిస్తామని శాస్త్రాలు చెబుతున్నాయ్.
మళ్లీ పుట్టుక
మరణించిన తరువాత మళ్లీ భూమిపైనే పుడతాము. చేసుకున్న కర్మలను బట్టి మనిషి మళ్లీ పుడతాడు. గత జన్మకు సంబంధించినవి ఏవీ గుర్తుండవు. పుట్టిన ప్రతీ సారీ కొత్తగా జీవితాన్ని ప్రారంభిస్తాడు. ప్రస్తుతం ఉన్న సమయాన్ని జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడిపితే ఆనందంగా ఉంటాడు. అదే స్వర్గం. సమయాన్ని వృధా చేసుకుంటూ గడిపితే ఆనందాన్ని అనుభవించలేడు.
మరణం తరువాత వేరే లోకం
మరణించిన తరువాత వేరే ప్రపంచం ఏదీ లేదని శరీరం పనిచేయకుండా అయిపోతుందనే అంటారు. పునర్జన్మలను, ఆత్మలను, స్వర్గం, నరకాన్ని కొట్టిపారేస్తుంటారు. అలాంటి ఎన్నో ప్రశ్నలను ఒకే సమాధానన్ని ఇస్తున్నారు. మనిషి మెదడు చాలా విషయాలను పసిగట్టడానికి, పరిశీలించడానికి సామర్ధ్యాన్ని కలిగి లేవు. కాంతి వేగాన్ని, విద్యుత్తును పరికరాలు పసిగట్టినంతగా మనిషికి సాధ్యం కాదు. కాబట్టి మనిషి కూడా అన్ని అంశాలను తెలుసుకోలేడు. మరణించిన తరువాత ఏమవుతుందనే ఎన్నో మిస్టరీలను మనిషి సులభంగా తెలుసుకోలేకపోతున్నాడు. మనిషి చూడలేకపోవడం వల్ల అక్కడున్న దానిని లేదని చెప్పలేము.
పైన చెప్పబడిన విషయాలన్నింటినీ కొందరు ప్రముఖులు, నిపుణులు చెప్పిన విషయాల నుంచి సేకరించి చెప్పబడిందే కానీ సొంతంగా ఎలాంటి అభిప్రాయమూ తెలపలేదు.



Click it and Unblock the Notifications