Latest Updates
-
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్..
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద జిల్లా ఏదో తెలుసా?.. 90% మంది తప్పుగానే చెప్తారు!
భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే మన దేశాన్ని భౌగోళికంగా ఉత్తర, దక్షిణ భారతదేశాలుగా విభజించి చూస్తుంటాం. దక్షిణ భారతదేశం అనగానే దట్టమైన అడవులు, పశ్చిమ కనుమలు, అందమైన తీరప్రాంతాలు మన కళ్ల ముందు మెదులుతాయి.
ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చేరి కూడా దక్షిణ భారతంలో అంతర్భాగంగా ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కొచ్చి, విజయవాడ వంటి ఫేమస్ నగరాలు, వందలాది జిల్లాలు దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. అయితే భౌగోళిక విస్తీర్ణం పరంగా దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద జిల్లా ఏదో మీకు తెలుసా?

అందుకే ఈ జిల్లాకు ఆ స్పెషాలిటీ
విస్తీర్ణం పరంగా దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద జిల్లా మన ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో, తూర్పున బంగాళాఖాతం సరిహద్దుగా ఉన్న ఈ జిల్లా ఏకంగా 14,322 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. సుమారు 40 లక్షల జనాభా కలిగిన ఈ మహా జిల్లాకు ఒంగోలు హెడ్ క్వార్టర్స్ గా ఉంది. ప్రస్తుతం ఈ జిల్లా పరిధిలో 8 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.
గందరగోళం ఎందుకు?
ఇక్కడే చాలామందికి ఒక పెద్ద సందేహం రావచ్చు. పాత జనరల్ నాలెడ్జ్ పుస్తకాల్లో దక్షిణ భారతదేశంలో అతిపెద్ద జిల్లా అనంతపురం అని చదువుకున్నాం కదా, మరి ఇప్పుడేంటి ఇలా చెబుతున్నారు? అని. డౌట్ రావడం సహజమే. గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లా 19,130 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో అగ్రస్థానంలో ఉండేది. కానీ 2022లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత అనంతపురం జిల్లా విభజనకు గురైంది. దీంతో భౌగోళిక ముఖచిత్రం మారిపోయి, ప్రకాశం జిల్లా నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.
ప్రకాశం జిల్లాకు.. ప్రకాశం అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా?
దీని వెనుక ఒక గొప్ప చారిత్రక నేపథ్యం ఉంది. ఆంధ్ర రాష్ట్రావతరణకు విశేష కృషి చేసిన మహనీయుడు, ఆంధ్ర కేసరిగా ప్రసిద్ధి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జ్ఞాపకార్థం ఈ జిల్లాకు ఆయన పేరును సగర్వంగా నామకరణం చేశారు.



Click it and Unblock the Notifications
