Latest Updates
-
సగ్గుబియ్యంతో హెల్తీ బ్రేక్ఫాస్ట్.. మెత్తగా, స్పాంజీలా నోట్లో వేస్తే కరిగిపోయేలా కమ్మనైన దోశలు.! -
చుండ్రు సమస్యతో పాటు జుట్టు ఎక్కువగా రాలిపోతుందా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
గుండె ఆరోగ్యంతో పాటు బరువును అదుపులో ఉంచే చట్నీ.. వారానికి ఒక్కసారైనా డైట్లో ఉండాల్సిందే.! -
రెస్టారెంట్ స్టైల్ టేస్టీ స్టార్టర్.. ఇంట్లోనే ఈజీగా స్పైసీ చిల్లీ ఎగ్.. ఎలా చేయాలంటే.! -
కిచెన్లో ఉండే ఈ చిన్న ఐటం.. అజీర్తి సమస్యే కాదు బరువును సైతం తగ్గిస్తుందని తెలుసా.? -
రక్తం పెరగాలన్నా, చర్మం మెరవాలన్నా.. బ్రేక్ ఫాస్ట్ లో ఈ పింక్ పూరీ ఉండాల్సిందే! -
స్పెషల్ అంటే ఇలా ఉండాలి.. వీకెండ్లో మజా ఇచ్చే కొబ్బరి పాల చికెన్ పులావ్.. ఇంటిల్లిపాదికీ పండగే.! -
మీరు సెప్టెంబర్లో జన్మించారా.. మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా.? -
నేపాల్ దేశంలో ఎంతో ఫేమస్..ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోయే తెల్ల నువ్వుల చట్నీ చేసుకోండిలా.. -
జిమ్ చేసేవారికి పర్ఫెక్ట్ స్వీట్.. పంచదార లేని హై ప్రోటీన్ పీనట్ బటర్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే..
ఆకలినే ఆయుధంగా మార్చి 20 రోజులుగా నిరాహార దీక్ష.. ఎందుకీ ఉద్యమం, ఎవరీ సోనం వాంగ్ చుక్.!
గత 20 రోజులుగా దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు సోనమ్ వాంగ్ చుక్. ప్రవేశ పరీక్షల్లో లోపాలను ఎత్తిచూపుతూ, ఆకలి కేకలను భరిస్తూ, ఎండకీ వానకీ తట్టుకుంటూ శారీరకంగా శక్తి క్షీణిస్తున్నా, ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకుంటూ సమస్యల పరిష్కారానికి రాజధాని ఢిల్లీని వేదికగా చేసుకుని నిరాహార దీక్ష చేస్తున్నారు. తన ప్రాణాలనే పణంగా పెట్టి దీక్ష చేస్తున్న ఈ సోనమ్ వాంగ్ చుక్ ఎవరు.. ఆయన నేపథ్యం ఏంటి.. తెలుసుకుందాం..

విద్యావ్యవస్థలో జవాబుదారీతనాన్ని కోరుతూ, ప్రజాస్వామ్యంలో బాధ్యత, పౌరుల స్వరం వినిపించాలనే సంకల్పంతో జూన్ 28న సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్షకి దిగారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోనం దీక్ష చేపట్టారు. ఇటీవల ప్రవేశ పరీక్షల నిర్వహణలో భారీగా అవకతవకలు జరిగిన విషయం తెలిసిందే. ఈ అవకతవకలపై జవాబీదారీతనం తీసుకురావాలని, విద్యావ్యవస్థపై విద్యార్థుల విశ్వాసాన్ని పునరుద్ధరించాలని సోనం విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సోనమ్ వాంగ్‌చుక్ ఎవరు..
సోనమ్ వాంగ్‌చుక్ లద్దాఖ్‌కి చెందిన ఇంజినీర్, విద్యావేత్త మాత్రమే కాదు. పర్యావరరణవేత్తగా, సామాజిక కార్యకర్తగా సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ విద్యావిధానాలకు పేరుగాంచిన SECMOL సంస్థను ఆయన స్థాపించారు. దీని ద్వారా వేలాది మంది విద్యార్థుల జీవితాలను మార్చిన ఘనత ఆయనది. హిమాలయ ప్రాంతాల్లో నీటి కొరతను నివారించేందుకు 'ఐస్ స్థూపా’ అనే సాంకేతికతను అభివృద్ధి చేసి తాగునీటిని అందించారు. స్థిరమైన అభివృద్ధి, వాతావరణ మార్పులపై అవగాహన కల్పించేవారు. లద్దాఖ్ ప్రజల హక్కుల కోసం ఆయన నిరంతరం పోరాడుతూనే ఉన్నారు.
సమాజ సేవకి తన జీవితాన్ని అంకితం చేసిన సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష నేటికి 20 రోజులకి చేరడంతో ఆయన ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తోంది. దీంతో ఆయన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని హైకోర్టు సైతం ఆదేశాలు జారీ చేసింది. దీర్ఘకాల నిరాహార దీక్ష కారణంగా ఆయన గణనీయంగా బరువు తగ్గారు. తీవ్ర బలహీనత దరిచేరడంతో మద్దతుదారులు ఆందోళన చెందారు. వైద్యపరమైన జోక్యం అవసరమని వైద్యులు సైతం హెచ్చరించడంతో ఈ అంశం కోర్టు దృష్టికి చేరింది. 18 రోజుల్లో ఏకంగా 9 కిలోల బరువు తగ్గడంతో.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీవ్రంగా ఆందోళన నెలకొంది.

ప్రజలకు సూచనలు
ఓ వైపు సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్షకి ప్రజల మద్దతు లభించడంతో పాటు ఆయన పట్టుదల, అంకితభావానికి ప్రజల నుంచి ప్రశంసల కురిపిస్తున్నారు. ఈ క్రమంలో తనను హీరోగా చూడవద్దని, ప్రతి పౌరుడు దేశంలో తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని వాంగ్ చుక్ పిలుపునిస్తున్నారు. కేవలం ఒక్క వ్యక్తితో ప్రజాస్వామ్యంలో మార్పు రాదని, ఈ పోరాటంలో సమాజం మొత్తం భాగస్వామ్యం కావాలని స్పష్టం చేశారు.
అంతేకాకుండా జులైన 20న నిర్వహించే పార్ెంట్ మార్చ్ వరకూ తాను ప్రాణాలతోనే ఉంటానని చెప్పడం ఆయన తెగింపునకు, ఆత్మవిశ్వాసానికి అద్దం పడుతోంది. ఒకవేళ తాను ప్రాణాలతో లేకపోయినా ఆత్మగా అయినా తిరిగొచ్చి పోరాడతానని ఉద్ఘాటించారు. తాను బయట బలహీనంగా కనిపిస్తున్నా, అంతర్గతంగా బలంగా ఉన్నానని చెప్పడం సమాజంపై ఆయనకున్న బాధ్యతను తెలియజేస్తుంది.
కాగా, సోనమ్ వాంగ్ చుక్ దీక్షకు దేశవ్యాప్తంగా విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు మద్దతు ఇస్తున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో దీక్ష విరమించాలని కోరుతున్నారు. అదేవిధంగా ఆయన లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరి, వాంగ్‌చుక్ చేస్తున్న దీక్ష ఒక వ్యక్తి ఆరోగ్యం గురించి మాత్రమే కాదు.. ప్రజాస్వామ్యంలో పౌరుల స్వరం ఎంత విలువైనదో అర్థం చేసుకోవాల్సిన సమయం ఇది. విద్యావ్యవస్థలో జవాబుదారీతనం ఎలా పెరగాలనే దానిని ఆలోచింపజేస్తుంది.



Click it and Unblock the Notifications