Latest Updates
-
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.!
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్‌తో రచ్చ.!
వీకెండ్ వచ్చిందంటే చాలు మెట్రో నగరాల్లో మందుబాబుల హడావుడి అంతా ఇంతా కాదు. ఇక కొందరు యువతులు తాము ఎందులో తక్కువ కాదంటూ వారితో పోటీగా మందు, సిగరెట్లతో నడిరోడ్డుపైనే హల్‌చల్ చేస్తుంటారు. తాజాగా ఓ యువతి మద్యం మత్తులో చేసిన రచ్చ వైరల్ అవుతోంది.

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా పరిధిలో ఓ యువతి మద్యం సేవించి, సిగరెట్ తాగుతూ రోడ్డుపై పడి ఉన్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రోడ్డుపై అడ్డంగా పడుకోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆమె పరిస్థితి చూసి అక్కడి నుంచి సురక్షితంగా తరలించేందుకు అక్కుడున్న వారు ఆమెకు సర్ది చెంపేందుకు సైతం యత్నించినా వినకపోవడం వీడియోలో కనిపిస్తోంది.
ఒక చేతిలో సిగరెట్, పక్కనే మద్యం సీసాలతో పట్టపగలే రోడ్డుపై పడుకుని ఉన్న యువతిని వీడియోలో చూడవచ్చు. అక్కడి నుంచి లేవడానికి ఆమె నిరాకరించడంతో భారీ ట్రాఫిక్ జామ్ సైతం ఏర్పడింది. వాహనదారులు హారన్లు మోగిస్తూనే ఉన్నా ఆమె అక్కడి నుంచి కదల్లేదు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
యువతి తీరుపై కొందరు నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా.. మరికొందరు దానిపై వ్యంగ్యంగా విమర్శలు చేశారు. ఇదే నిజమైన లింగ సమానత్వం.. ఇలాంటి విషయాల్లో పురుషుల కంటే మహిళలు ఎందుకు వెనుకబడి ఉండాలంటూ విమర్శనాత్మకంగా స్పందించారు. మరికొందరు మన అమ్మాయిలు.. అబ్బాయిల కంటే ఎందుకు తక్కువ అంటూ దంగల్ సినిమా డైలాగ్స్‌ను గుర్తు చేశారు. మరికొందరు ఆ ప్లేస్‌లో అబ్బాయి ఉంటే ఇప్పటికే పోలీసులు అతడిని స్టేషన్‌కి లాక్కెళ్లేవారు. కానీ అమ్మాయి కాబట్టి చేయి చేసుకోలేక తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లేదంటూ కామెంట్స్ చేశారు. మరికొందరు అర్జున్ రెడ్డి ఫిమేల్ వెర్షన్ అంటూ ఫన్నీగా స్పందించారు. మహిళా సాధికారత అంటే ఇదేనా అని మరికొందరు ప్రశ్నించారు.
అయితే పట్టపగలే నడిరోడ్డుపై మహిళ ఇలా వాహన రాకపోకలకు అంతరాయం కలిగిస్తూ ప్రవర్తించడం సభ్యసమాజాన్ని నివ్వెరపరుస్తోంది. ఇలాంటి సంఘటనలూ అప్పుడప్పుడూ చోటుచేసుకుంటూనే ఉన్నాయి. బైక్‌పై వెళ్తూ యువతీయువకులు అసభ్యంగా ప్రవర్తిస్తూ తోటి వాహనదారులకు ఇబ్బంది కలిగించడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. పబ్లిక్ ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



Click it and Unblock the Notifications
