Latest Updates
-
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్
Viral Videos : సాంబార్‌లో చచ్చిన ఎలుక.. పని చేయకున్నా 20 ఏళ్ల జీతం ఇచ్చినందకు కంపెనీ పైనే కేసు..!
బయట తినాలంటే ఇప్పుడు చాలా మందికి భయమేస్తోంది. ఇంటికి ఆన్‌లైన్ ఆర్డర్ పెటుకోవడానికి కూడా 100 సార్లు ఆలోచిస్తున్నారు. ఏ పార్సల్‌లో ఏమి వుందోనని అనుమానపడుతున్నారు. మోన్నటి వరకు ఐస్‌క్రీంలో మనిషి వేలు, చిప్స్ ప్యాకెట్‌లో చచ్చిన కప్ప, చాక్లెట్ సిరప్‌లో చచ్చిన ఎలుక, అమెజాన్ పార్సల్ బాక్స్‌లో తాచు పాము.. ఇవి కాకుండా తాజా మళ్లీ గుజరాత్‌లోని అహ్మదాాబాద్ రెస్టారెట్‌లో సాంబార్‌లో చచ్చిన ఎలుక కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
అహ్మదాబాద్‌లోని నికోల్‌లో దేవి దోసా రెస్టారెంట్‌లో ఈ దారుణం జరిగింది. దీనిపై రెస్టారెంట్ యాజమాన్యం కూడా సరిగ్గా స్పందించలేదు. దీంతో కస్టమర్ అక్కడ వున్న అమ్దావాద్ మునిసిపల్ కార్పొరేషన్‌కు ఫిర్యాదు చేశారు. దీన్ని తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ సదరు రెస్టారెంట్‌ను సీజ్ చేసింది.
హోటల్ లోపల వంట చేసే ప్రదేశం చూసి అధికారులు చూడా షాక్‌కు గురయ్యారు. కిచెన్‌లోపలికి బయట జంతువులు కూడా వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఇది గమనించిన వెంటనే హోటల్ సీజ్ చేయబడింది. ఈ సంఘటనపై నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రతీ రెస్టారెంట్ల బయట ఆహారంలో ఈ దారుణ పరిస్తితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఎవ్వరైనా గానీ కంపెనీ సరిగ్గా జీతం ఇవ్వకపోతే కంపెనీపై కేసుపెడతారు లేదా కంపెనీలో పనిచేసిన యాజమాన్యంపై కేసు పెడతారు. కానీ ఫ్రాన్స్‌లోని ఓ మహిళ 20 ఏళ్లుగా తనకు పనిచేయించకుండా జీతం చెల్లించినందుకు కంపెనీపై కేసు పెట్టి కోర్టుకు లాగింది. ఈ సంఘటన ఫ్రాన్స్‌లో జరిగింది. ఫ్రాన్స్‌లో అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన ఆరెంజ్ కంపెనీలో వాసెన్ హోవ్ అనే మహిళను 1993లో ఉద్యోగంలోకి తీసుకున్నారు. అయితే అప్పటి నుంచి ఆమె పక్షవాతంతో బాధపడుతున్నట్లు కంపెనీ తెలుసుకొని ఆమెకు తగిన ఉద్యోగాన్ని ఇచ్చి నెలనెలా జీతం ఇస్తోంది. ట్రాన్స్‌ఫర్ కోరినా ఆమెను ట్రాన్స్‌ఫర్ చేయలేదు.
ఆమెకు ఏ పనీ ఇవ్వకుండా ప్రతి నెల పూర్తి జీతాన్ని అందిస్తున్నారు. ఇది ఆమెను ఉద్యోగంలోంచి బయటకు పంపించడానికే చేస్తున్నారని ఆమె ఆరోపణ చేస్తుంది. ఏ పనీ ఇవ్వకుండా జీతం తీసుకోవడం చాలా అవమానకరంగా వుంటోందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఉద్యోగం లేదని, రాదని చాలా మంది తీవ్రంగా బాధపడతారు. కానీ ఇక్కడ అంతా విరుద్ధంగా జరిగింది. మనిషి ఆశకు అంతు వుండదు. ఏది లభించినా వున్న దానితో తృప్తి పొందరు. ఉద్యోగం లేక చాలా మంది కష్టాలు ఎదుర్కొంటూ వుంటే ఉద్యోగం ఇచ్చి పనిచేయకున్నా అనారోగ్యం కారణంగా జీతం ఇస్తుండడం వల్ల ఉద్యోగిని కంపెనీ పైనే కేసు పెట్టింది. అయితే సదరు మహిళ అనారోగ్యంతో చాలా ఏళ్లు ఒంటరిగా వుండడం వల్ల ఆమె డిప్రెషన్‌కు గురైందని ఆమె తరపు లాయర్ అసలు విషయాన్ని బయటపెట్టారు.



Click it and Unblock the Notifications