Latest Updates
-
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి!
కాలుష్యాన్ని తగ్గిద్దాం, పచ్చదనాన్ని పెంచుదాం..పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలను ఇలా చెప్పుకోండి
ప్రతి ఏటా జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం(WED) జరుపుకుంటారు. అయితే ప్రతి సంవత్సరం గ్లోబల్ వార్మింగ్, అటవీ నిర్మూలన, వాతావరణ మార్పు వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఒక ఢిఫెరెంట్ థీమ్ ను ఎంచుకుంటారు. ఈ థీమ్ పర్యావరణ సమస్యలపై ప్రజల దృష్టిని ఆకర్షించడానికి, అవగాహన కల్పించడానికి సహాయపడుతుంది. 1973లో మొదటిసారిగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఓన్లీ వన్ ఎర్త్ అనే థీమ్ తో జరుపుకున్నారు. ఈ క్రమంలో భాగంగా ఈ ఏడాది అంటే 2025 ప్రపంచ పర్యావరణ దినోత్పవ థీమ్.."ఫ్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం(Beat Plastic Pollution)".
అనాలోచిత మానవ చర్యల కారణంగా పర్యావరణానికి కలుగుతున్న అనర్థాల గురించి ప్రజలకు తెలియజెప్పేందుకు ఈ రోజున అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. పర్యావరణ సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ రోజుని జరుపుకుంటారు. ప్రకృతి కూడా మనకు ఇళ్లు లాంటిదే. మన తల్లే కాదు పుట్టిన దగ్గరి నుంచి మరణించే వారకు మనల్ని కంటికి రెప్పలా కాపాడేది ప్రకృతే. అలాంటి ప్రకృతిని కాపుడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ప్రకృతి దేవుడు లాంటిది. గురువారం(జూన్ 5,2025) వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మీ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులకు పంపగలిగే కొన్ని అద్భుతమైన శుభాకాంక్షల సందేశాలను ఇక్కడ చూడండి.

ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలను ఇలా తెలుగులో చెప్పుకోండి
-కాలుష్యాన్ని తగ్గిద్దాం, పచ్చదనాన్ని పెంచుదాం. పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు
-భూమిని కాపాడుకుందాం, భవిష్యత్తును రక్షిద్దాం. పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.
-పర్యావరణాన్ని కాపాడుదాం, ప్రపంచాన్ని బాగు చేద్దాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.
-భూమిపై కొద్దిగా ఉండే వజ్రాలకు ఎంతో విలువ ఉంటుంది. అలాంటిది ఈ విశ్వంలోనే మనం జీవించేందుకు వీలైన ఒకే ఒక్కటి భూమి. దాన్ని కాపాడుకుందాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.
-దేవుడు ఈ భూమిని మనకు గిఫ్టుగా ఇచ్చాడు. దీన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన బాధ్యతలని నెరవేరుద్దాం.
-మన ప్రతి పుట్టినరోజుకు ఒక కేక్ ను కట్ చేస్తాం. దానికి బదులుగా ఒక మొక్కను నాటుదాం. హ్యాపీ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే.
-ప్లాస్టిక్ ను వాడకుండా భూమిని ఊపిరి పీల్చుకోనిద్దాం. అప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా ఉంటాం. పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు 2025.

-ఈ పర్యావరణ దినోత్సవం నాడు మన ప్రకృతికి సేవ చేద్దాం. హ్యాపీ ఎన్విరాన్మెంట్ డే
-పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు
-ప్రతి మొక్క ఒక ప్రాణం, ప్రతి ప్రాణం ఒక భవిష్యత్తు. పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.
-ఈ భూమి మన ఇల్లు దీనిని శుభ్రంగా ఉంచుకుందాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.
-పర్యావరణం మనకు ప్రాణం, దానికి మనం రక్ష. హ్యాపీ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే.
-పర్యావరణాన్ని రక్షించడం మనందరి సామాజిక బాధ్యత. ఈ రోజు నుండి ఒక మార్పుకు శ్రీకారం చుడదాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.
-మన పిల్లల భవిష్యత్తు కోసం, పచ్చని భూమిని వారసత్వంగా ఇద్దాం. పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.
-పర్యావరణాన్ని కాపాడటానికి మన వంతు కృషి చేద్దాం. చిన్న చిన్న చర్యలు కూడా పెద్ద మార్పును తీసుకువస్తాయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.
-ఈ పర్యావరణ దినోత్సవం నాడు మన చుట్టూ ఉన్న ప్రకృతిని పరిశుభ్రంగా ఉంచుకుందాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.
-మనం పర్యావరణానికి ఏం చేస్తే, అది మనకు తిరిగి అదే చేస్తుంది. జాగ్రత్తగా ఉందాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.
-భూమికి అనారోగ్యం వస్తే, మనకూ అనారోగ్యం. పర్యావరణాన్ని కాపాడుకుందాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.

-పర్యావరణాన్ని రక్షించడం ఒక అలవాటుగా మార్చుకుందాం. ప్రతీ రోజును పర్యావరణ దినోత్సవంగా భావిద్దాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.
-ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు, మనం ప్రకృతితో కలిసి జీవించడానికి ప్రమాణం చేద్దాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.
-మనం అడవులకు ఏం చేస్తున్నావో.. అది అద్దంలో ప్రతిబింబం లా తిరిగి మనకే చెందుతుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.
-ప్రతీ చిన్న చర్య పర్యావరణానికి గొప్ప మార్పును తీసుకువస్తుంది. హ్యాపీ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే.
-ప్రకృతికి తిరిగి ఇవ్వడం మన బాధ్యత. హ్యాపీ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే.
-పర్యావరణ దినోత్సవం కేవలం ఒక రోజు కాదు ఒక ఉద్యమం. హ్యాపీ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే.
-ప్రకృతికి మనకు రుణపడి ఉన్నాం, దానికి తిరిగిద్దాం. హ్యాపీ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే.
-పర్యావరణం బాగుంటేనే మానవాళికి మనుగడ. హ్యాపీ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే.
-మన తర్వాతి తరాలకు స్వచ్ఛమైన ప్రపంచాన్ని అందజేద్దాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.
-పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. పచ్చని ప్రపంచం కోసం కృషి చేద్దాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.
-భూమి తల్లిని రక్షించడం మన కర్తవ్యం.. పర్యావరణ దినోత్సవం నాడు ఈ సంకల్పాన్ని నెరవేర్చండి. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.

-మన జీవితాలను పచ్చదనంతో అలంకరించుకునేందుకు కలిసి ప్రతిజ్ఞ చేద్దాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.
-ప్రకృతికి వ్యతిరేకంగా కాదు, దానికి అనుగుణంగా నడుచుకోండి. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.
-ప్రకృతికి మనం అవసరం లేదు. మనకు ప్రకృతి అవసరం. దానిని కాపాడుకుందాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.
-మీరు పర్యావరణం గురించి శ్రద్ధ వహించినప్పుడు ప్రతి ప్రయాణం పచ్చగా ఉంటుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.
-మనకు అన్నీ ఇచ్చే గ్రహానికి తిరిగి ఇద్దాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.
-చెట్లను కాదు ప్లాస్టిక్ ను నరికివేయండి. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.
-ప్లాస్టిక్ జీరో కాదు, గ్రహం హీరోగా ఉండు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.
-ప్లాస్టిక్ కు నో చెప్పండి, భూమికి అవును అని చెప్పండి. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.

-మరింత పచ్చదనం, తక్కువ ప్లాస్టిక్, మెరుగైన భవిష్యత్తు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.
-ప్రతి రోజును ధరిత్రి దినోత్సవంగా చేసుకుందాం. పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.
-భూమి తల్లిని రక్షించడం మన కర్తవ్యం.. పర్యావరణ దినోత్సవం నాడు ఈ సంకల్పాన్ని నెరవేర్చండి.
-మనం భూమిని మన పూర్వీకుల నుండి వారసత్వంగా పొందలేదు, మన పిల్లల నుండి అప్పుగా తీసుకుంటాము.
-మన గ్రహానికి అతి పెద్ద ముప్పు ఏంటంటే దానిని మరొకరు కాపాడతారనే నమ్మకం.
"-భూమి మనకు చెందినది కాదు మనం భూమికి చెందినవాళ్ళం.



Click it and Unblock the Notifications