Latest Updates
-
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు!
పిల్లల స్నానాలు - పెద్దల పాట్లు?

పిల్లలు వారంతటవారే స్నానం చేసి సంతోషంగా బయటకు రావాలంటే, మీ పిల్లల బాత్ రూమ్ ఆకర్షణీయంగా రంగుల బొమ్మలు, టబ్ మొదలైనవాటితో అలంకరించాలి. అందుకనువైన సరంజామా అంతా బాత్ రూమ్ లో వుంచాలి. అపుడు ఏడ్వకుండా వారంతట వారే స్నానాల గదిలోకి వచ్చి తయారై బయటకు వస్తారు. బాత్ రూమ్ ప్రవేశ భాగంలోనే వారి కవసరమైన టవల్, చర్మ సంరక్షణా క్రీములు, పౌడర్లు, దువ్వెన వంటివి ఒక షెల్ఫ్ లో వుంచాలి. వాటిని ఉపయోగించే విధానాలు సైతం పిల్లలకు నేర్పించాలి. దీనితో పెద్దలకు విలువైన ఉదయంపూట సమయం కలిసివస్తుంది.
పిల్లల స్నానాల గదిలో బాత్ మేట్స్ తప్పనిసరిగా వుండాలి. మేట్ కాకపోయినా వారి ఎత్తుకు తగిన స్టూలు వంటివి వేస్తే కూడా బాగానే వుంటుంది. పిల్లల బాత్ రూమ్ మరింత ఆకర్షణీయంగా వుండాలంటే, వారి కిష్టమైన మికీ మౌస్ వంటి కార్టూన్ స్టిక్కర్లు గోడల టైల్స్ గా వేయించండి లేదా స్టిక్కర్లు అంటించండి. ఆకర్షణీయంగా వున్న బాత్ రూమ్ లోకి పిల్లలు వారంతటవారే చొరబడి మీ సమస్య పరిష్కరించడమే కాక సరైన సమయానికి రెడీ అయిపోతారు.



Click it and Unblock the Notifications
