Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
బేబీకి బెస్ట్....పేరెంట్స్ కి టెస్ట్!

1. భధ్రత - బేబీ భధ్రత ప్రధానం నేటిరోజులలో బేబీని ఎత్తుకుపోవటాలు, దుర్వినియోగం చేయటాలు జరుగుతున్నాయి. కనుక మీరు ఎంపిక చేసుకునే సెంటర్ లో బేబీ రోజంతా ఏం చేస్తుందనేది సి.డి. తీయించి మీకు అందించగల నిపుణతలు కల సెంటర్ ఎంపిక చేయండి.
2. డేకేర్ సిబ్బంది నైపుణ్యం - మీరు వ్యక్తిగతంగా డే కేర్ సిబ్బంది నిపుణతలు పరిశీలించి వారికి సరైన అర్హతలున్నాయా లేక ఏదైనా క్రిమినల్ రికార్డ్ వంటివి వున్నాయా? అనేవి చెక్ చేయండి.
3. సిబ్బంది - పిల్లల సంఖ్యను బట్టి తగినంతమంది సిబ్బంది వున్నారా? అనేది కూడా పరిశీలించాలి. దీనితోనే బేబీకి అవసరమైన శ్రధ్ధ లభిస్తుంది.
4. పని గంటలు - డే కేర్ సెంటర్ లో మీ బేబీ వుండే గంటలు మీ పని గంటలకు కూడా సరిపోవాలి. అది మీకు, బేబీకి కూడా సౌకర్యంగా వుంటుంది.
5. సెలవు దినాలు - డే కేర్ సెంటర్ కు గల సెలవు దినం మీ కార్యాలయ సెలవు దినంతో సరిపోలాలి. చాలా డేకేర్ సెంటర్ లు ఆదివారాలు సెలవుదినాలుగా ప్రకటిస్తాయి.
6. వ్యయం - డేకేర్ సెంటర్ లోని ఫీజు వంటివి మీ బడ్జెట్ కు కూడా అనుకూలంగా వుండాలి. వారు అధికమైన ఫీజులు అడిగితే మరొక దానిని ఎంపిక చేయాల్సివుంటుంది.
7. ఎమర్జెన్సీ - ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినపుడు మీరు బేబీని తెచ్చుకోలేకుంటే, వారు ఏ రకమైన ఏర్పాట్లు చేస్తారనేది కూడా ముందుగా తెలుసుకోండి.
8. దూరం - డే కేర్ సెంటర్ మీ కార్యాలయానికి అందుబాటులో లేక మీరు వెళ్ళే దారిలో వుంటే బేబీని అప్పగించడం, తెచ్చుకోవడం తేలికవుతుంది. ఈ సూచనలు పాటించి మీ బేబీని మంచి డేకేర్ సెంటర్ లో చేర్పించండి.



Click it and Unblock the Notifications
