Latest Updates
-
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.? -
పూజ గదిలో దీపం ప్రతిసారీ ఆరిపోతుందా.. మీ ఇంట్లో ఈ కష్టాలు తప్పవు.! -
రోజూ అవే చపాతీలు, రోటీలు తిని బోర్ కొట్టిందా? మట్కా రోటీ ఇలా చేస్తే పిచ్చెక్కించే టేస్ట్! -
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో? -
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి!
పసిపిల్లలకు ఈ ఆహారాలతో ఆరోగ్య హాని...
నిపుణుల ప్రకారం, పిల్లకు కొన్ని ఆహారాలను ఇవ్వకూడదని అంటున్నారు. ముఖ్యంగా 3-12 నెలల మద్య వయస్సు ఉన్నవారి, ఈ ఆహారాలను ఖచ్చితంగా దూరంగా ఉంచాలి. ఈ క్రింది లిస్ట్ లో ఉన్న ఆహారాలను పిల్లలకు అందివ్వడం వల్ల వారిలో జీర్ణ సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా పిల్లలకు ఎటువంటి వ్యాయామాలు ఉండవు. దానికి తోడు ఈ వయస్సు పిల్లలు రోజంతా నిద్రకే పరిమితమై ఉంటారు. ఇటువంటి ఆహారాలను వారికి అందివ్వడం ద్వారా పిల్లలు అసౌకర్యానికి గురి అవుతారు.
సరిగా జీర్ణం అవ్వకపోవడంతో పిల్లలు వాంతులు చేసుకోవడం మరియు ఊపిరిడకపోకుండా కూడా చేస్తాయి. అందువల్ల ఈ క్రింది లిస్ట్ లోని ఆహారాలను చిన్న పిల్లలకు ఇచ్చే డైట్ లో చేర్చుకూడదని నోట్ చేసుకోవాలి. పసిపిల్లలుకు చిన్న వయస్సులో ఖచ్చితంగా తల్లిపాలను అందివ్వాలి. మరియు ఇతర ఆహారాలు చాలా మెత్తగా తయారుచేసినవి మరియు సులభంగా జీర్ణం అయ్యే ఆహారాలను అంధివ్వాలి. మరి పసిపిల్లలు తినకూడని అటువంటి ఆహారాల లిస్ట్ క్రింది విధంగా ...

ఎగ్ వైట్ :
ఎగ్ వైట్ చిన్నపిల్లలకు(ఒక సంవత్సరంలోపు పిల్లలకు) అంత మంచి ఎంపిక కాదు. ఎగ్ వైట్ చిన్న పిల్లల్లో పొట్ట సమస్యలను లేదా ఎగ్జిమాకు గురిచేస్తుంది.

పీనట్ బటర్:
పసిపిల్లలకు ఖచ్చితంగా నివారించాల్సిన ఆహారాల్లో పీనట్ బటర్ ఒకటి.

ద్రాక్ష:
పసిపిల్లలు నివారించాల్సిన ఆహారాల్లో ద్రాక్ష కూడా ఒకటి. ఇవి పిల్లలకు పుల్లగా ఉండటం మాత్రమే కాదు, గొంతు సమస్యలకు గురిచేస్తుంది. అంతే కాదు, డయోరియాకు గురిచేస్తుంది.

తేనె:
తేనె అతుక్కొనే స్వభావం కలిగి ఉంటుంది. చిన్న పిల్లలు మింగడానికి ఇబ్బంది కలిగి ఉంటారు. కాబట్టి పిల్లలకు దీన్ని దూరం చేయండి.

చీజ్ :
అన్ పాచ్యురైజ్డ్ చీజ్ చిన్న పిల్లలకు ఫుడ్ పాయిజ్ లక్షణంగా మారుతుంది. ఈ ప్రమాదం నుండి రక్షించాలంటే, పసిపిల్లలకు చీజ్ ను పెట్టకూడదు.

వీట్(గోధుమల)తో తయారుచేసినవి:
పసిపిల్లలు తినకూడాని ఒక ఆహారాలో ఒకటి వీట్. గోధుమలతో తయారుచేసిన ఏ ఆహారాన్నైనా పిల్లలకు పెట్టకూడదు. గోధుల్లో గులిటిన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పిల్లల్లో ఇది జీర్ణం అవ్వడానికి కష్టం అవుతుంది.

జ్యూస్:
జ్యూసులలో యాసిడ్స్ ఉంటాయి. కాబట్టి, పిల్లలకు ఇది అంత మంచిది కాదు. ఇది పొట్టసమస్యలకు దారితీస్తుంది.

షెల్ ఫిష్ :
షెల్ ఫిష్ లో తప్పకుండా నివారించాల్సిన ఆహారం. వీటిలో మెర్యురి అధికంగా ఉండటం వల్ల ఇది పిల్లలకు అంత మంచిది కాదు. అంతే కాదు, ఇది పిల్లలకు పెడితే అలర్జీ వస్తుంది. దాంతో సమస్య మరింత తీవ్రం అవుతుంది.

స్ట్రాబెర్రీస్:
ఇంకా స్ట్రాబెర్రీలు కూడా పసిపిల్లలకు దూరంగా ఉంచాలి. వీటిలో ముఖ్యంగా విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది పసిపిల్లలకు చాలా ప్రమాధకరమైనవి. ఇది పిల్లలకు ఒక అసిడిక్ ఫుడ్ కాబట్టి ఎట్టిపరిస్థిల్లో పసిపిల్లలకు వీటిని అందివ్వకండి.

చాక్లెట్స్:
చాక్లెట్ లో ఎక్కువ కెఫిన్ ఉండటం వల్ల ఇది పసిపిల్లలకు అంత మంచిది కాదు.

నట్స్:
పసిపిల్లలు(నెలలోపు)పిల్లకు దంతాలు వచ్చి ఉండవు కాబట్టి, ఇటువంటి నట్స్ ఇవ్వకపోవడమే ఉత్తమం. జీర్ణసమస్యలకు దారితీస్తుంది.



Click it and Unblock the Notifications