Latest Updates
-
గ్రహాల శక్తితో పాటు దైవానుగ్రహం.. పూజలో ఈ రంగు వస్త్రాన్నే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా.? -
రాత్రి పూట స్వీట్ తినాలనిపిస్తుందా? ఓవెన్ అక్కర్లేకుండానే ఇంట్లోనే బేకరీ స్టైల్ బనానా బ్రెడ్ చేసుకోండిలా.. -
పిల్లలు, వృద్ధుల ఎముకల బలానికి రాగి, మునగాకు రోటి.. రోజూ ఒక్కటి తింటే చాలు.! -
మగవారిలో వీర్య కణాల సంఖ్య దారుణంగా పడిపోవడానికి ఈ పది ఆహార పదార్థాలే కారణం.! -
పప్పుచారులోకి బెస్ట్ సైడ్ డిష్.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ వడ.. 10 నిమిషాల్లో చేసేయండిలా -
ఈ మూడు రాశుల వారికి ఊహించని ఆర్థిక అవకాశాలు.. ఏ పరిహారాలు చేస్తే ఇంకా మంచిది.! -
వారం రోజులు నిల్వ ఉండే సొరకాయ హల్వా..రసాలూరుతూ భలే రుచిగా.. -
మీ పిల్లలు రోజులో ఎన్ని చాక్లెట్స్ తింటున్నారు.. ఈ లిమిట్ దాటితే ఎంత ప్రమాదమో తెలుసా.? -
భక్తులకు అలర్ట్.. పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. రద్దీలో మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి.? -
రోజూ 20 నిమిషాలు చాలు.. ఈ సింపుల్ యోగాసనాలతో మీ రోజు మారిపోతుంది.!
ప్రెగ్నెన్సీ సమయంలో సెక్స్? ఎలాంటి భంగిమల్లో చేయాలి, ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి
ప్రెగ్నెన్సీ అంటే భార్యాభర్తలు, ఇరు కుంటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసే సమయం. ఓ కొత్త వ్యక్తి తమ కుటుంబంలోకి రాబోతున్నాడంటే ఆ ఇంటిల్లిపాదికి ఉండే సంతోషం అంతా ఇంతా కాదు. అయితే గర్భంతో ఉన్న 9 నెలల పాటు ఆ తల్లిని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. గర్భం వచ్చిందన్న ఆనందం పక్కన పెడితే.. 9 నెలల పాటు భార్యాభర్తలు శృంగారానికి దూరంగా ఉండాల్సిందేనా, లేక లైంగిక సుఖం పొందవచ్చా అనే ప్రశ్న చాలా మంది జంటలకు వస్తుంది.
అసలు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు శృంగారం చేయవచ్చా.. గర్భంతో ఉన్న సెక్స్ చేయడం వల్ల లోపల ఉన్న శిశువుకు ఎలాంటి ప్రమాదం లేదు కదా.. ఒకవేళ శృంగారం చేయాలనుకుంటే ఎలా చేసుకోవాలి.. ఎలాంటి భంగిమలు ప్రయత్నించాలి.. లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గర్భాధారణ సమయంలో శృంగారం చేయవచ్చా?
గర్భాధారణ సమయంలో నిరభ్యంతరంగా శృంగారం చేసుకోవచ్చు. పూర్తి ఆరోగ్యంగా ఉండి ఎలాంటి సమస్యలు లేనట్లయితే లైంగిక చర్యలు పాల్గొనవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. నిజానికి గర్భధారణ సమయంలో సెక్స్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నది వైద్యులు చెప్పే మాట. శృంగారం భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం, భావోద్వేగ సంబంధాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మానసిక స్థితిని, మొత్తం శ్రేయస్సును పెంచుతుంది.
గర్భాధారణ సమయంలో ఎలాంటి భంగిమలు ఉత్తమం:
ప్రెగ్నెన్సీ తో ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొనాలనుకుంటే కొన్ని భంగిమలు ప్రయత్నించడం మంచిది. వాటి వల్ల ఎలాంటి సమస్యా రాదు. అవేంటంటే..
స్పూనింగ్:
ఈ భంగిమలో సెక్స్ చేసుకోవడం వల్ల గర్భిణీలకు ఎలాంటి ప్రమాదం ఉండదు. అలాగే అసౌకర్యంగా కూడా ఉండదు. ఈ భంగిమ వల్ల గర్భిణీల పొత్తికడుపుపై ఎలాంటి ఒత్తిడి పడదు.
ఉమెన్ ఆన్ టాప్:
కింద పురుషులు ఉండి వారిపై గర్భిణీలు ఉన్న పొజిషన్ లో శృంగారం చేసుకోవడం వల్ల మహిళలపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. సౌకర్యవంతంగా లైంగిక చర్యను ఆస్వాదించవచ్చు.
సైడ్-బై-సైడ్:
సైడ్-బై-సైడ్ పొజిషన్ గర్భధారణ సమయంలో ఉత్తమమైన సెక్స్ భంగిమల్లో ఒకటి. క్లాసిక్ సైడ్-బై-సైడ్ సెక్స్ పొజిషన్ లోని ఈ వైవిధ్యం భాగస్వామిని వెనక నుంచి ప్రవేశించడానికి వీలుగా ఉంటుంది.
మిషనరీ:
గర్భధారణ ప్రారంభంలో మిషనరీ భంగిమ చాలా సౌకర్యంగా ఉంటుంది. కానీ గర్భం పెరిగే కొద్దీ మిషనరీ పొజిషన్ అసౌకర్యంగా మారుతుంది. 20 వారాల గర్భిణీలు ఈ పొజిషన్ లో లైంగిక చర్యను ఆస్వాదించవచ్చు.
ఎడ్జ్ ఆఫ్ ది బెడ్:
మంచం అంచున ఉండి సెక్స్ చేయడం గర్భిణీలపై ఎలాంటి చెడు ప్రభావాన్ని చూపదు. ఈ భంగిమలో శృంగారం చాలా సౌకర్యంగా ఉంటుంది.
సెక్స్‌కు ఎప్పుడు దూరంగా ఉండాలి:
* హై-రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్నట్లయితే సెక్స్ కు దూరంగా ఉండటం మంచిది. శృంగారం కావాలనిపిస్తే మాత్రం వైద్యులను సంప్రదించిన తర్వాతే సెక్స్ చేయడం ప్రారంభించాలి.
* ప్లాసెంటా ప్రెవియాతో బాధపడుతుంటే సెక్స్ కు దూరంగా ఉండాలి. రక్తస్రావం, శిశువుకు హాని కలగకుండా ఉండాలంటే శృంగారానికి దూరంగా ఉండాల్సిందే.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications