Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
తగవులు తీర్చటం....బంధాలు పెంచటం!

1. అత్యవసరం అనుకుంటే తప్ప పిల్లల విషయంలో జోక్యం చేసుకోకండి. పిల్లలు వారిలో వారే తమ సమస్య పరిష్కరించుకోవాలని తెలుపండి. ఇద్దరూ ఒక అవగాహన ఏర్పరచుకోవాలనండి.
2. మంచి విలువలు వారికి నేర్పండి. చిన్న విషయాలపై పోట్లాటలు వద్దని తెలుపండి. తోడబుట్టినవారు అయికమత్యంగా వుండాలని నేర్పించండి. ఒకే తల్లితండ్రులకు పుట్టటం ఎంతో మేలని అది వారిలో సహాయతను పెంపొందిస్తుందని తెలుపండి. మొదటినుండి మంచి ప్రవర్తన కలిగిస్తే వారు పెద్ద అయినప్పటికి వాటిని కాపాడుకుంటూ జీవిస్తారు.
3. వారి తగాదాలకు ప్రాధాన్యతనివ్వకండి. ఇద్దరి పిల్లలలోను ఎవరికీ అతి చనువు ఇవ్వకండి. ఒకరికి మీవద్ద అతి చనువు ఇస్తే అది మరిన్ని సమస్యలకు దోవతీస్తుంది.
4. టీనేజ్ అహంకార పోట్లాటలు వస్తాయి. చాలామంది ఎంతో మొండిగా ప్రవర్తిస్తారు. కోపం తెచ్చుకుంటారు. వారిని శాంతపరచాలి. రెండువైపులా వినడం చాలా తెలివిగా తీర్పులివ్వడం వుండాలి. కుటుంబంలో ప్రశాంతత వుండాలంటే టీనేజర్లతో సామరస్యంగా సరైన రీతిలో వ్యవహరించాలి.
5. తోడబుట్టిన వారిమధ్య పోట్లటలు రాకూడదంటే వారిని ఎల్లపుడూ బిజీగా వుంచాలి. ఖాళీ సమయాన్ని ఏ రకంగా గడపాలనేది సామరస్యంగా వారిలో వారినే నిర్ణయించుకోమనండి. ఇంటిలోని పనులు సైతం వారిలో వారే నిర్ణయించుకొని చేస్తూంటే, ఇక వారిమధ్య తగాదాలు వచ్చే అవకాశం వుండదు.
6. తగవులు వచ్చే పరిస్ధితి రానీయకండి. తగవు వస్తుందనుకుంటే ముందుగానే అది తప్పేలా చేయండి. ఉదాహరణకు మీరు చేసే డిష్ ఒకరికి ఇష్టమై మరొకరికి కాకపోతే రెండో వారికి ఇష్టమైన డిష్ కూడా చేయటమో లేదా మరో రోజుకు నిర్ణయించి వారిని మెప్పించటమో చేయాలి.



Click it and Unblock the Notifications